Hii Friends నా పేరు Neha నేను మీ అందరి కోసం 2 Best Moral Stories In Telugu ! మంచి నీతి కథలు కావాలి అనే చాలా మంచి కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.
1. మొసలివాడు మరియు అతని భార్య ! Moral Stories In Telugu
అనగనగా ఒక ఊర్లో రాందాసు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతని వయసు 70 ఏళ్ళు, అతని భార్య లత వయసు 30 ఏళ్ళు, రాందాసు తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కానీ అతని భార్య రాందాసు ముసలివాడు నేను వయసులో ఉన్నాను నాకు కూడా వయసులో ఉన్న భర్త ఉంటె ఎంత బాగుంటుంది అని లోలోపలే అనుకుంటూ ఉంటుంది, ఒక్క మాటలో చెప్పాలంటే రాందాసు భార్య రాందాసు తో సంతోషంగా లేదు ఆమెకు వయసులో గల భర్త కావాలని కోరిక ఉండేది ఆమె చూడడానికి
చాలా అందంగా ఉండేది, ఆ ఊర్లో ఒక దొంగ ఉండేవాడు వాడు ప్రతిరోజు లత వెంటపడేవాడు ఒక రోజు ఆ దొంగ లత దగ్గరికి వెళ్లి లత గారు లత గారు మీరు ఏమి అనుకోనంటే ఒక మాట చెప్తాను అని అంటాడు, లత ఏంటి చెప్పు అని అంటుంది అప్పుడు ఆ దొంగ లతతో లత గారు మీరు ఎంత అందంగా ఉన్నారు పైగా వయసులో కూడా ఉన్నారు మీరు ఆ మొసలివాడితో ఎలా ఉంటున్నారు ? నేను మిమల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు, ఇది విని లత తన మనసులోని
కోరిక పూర్తీ అయ్యిందని అనుకుంటుంది, లత ఒక్క నిమిషం కూడా ఆలస్యము చేయకుండా ఆ దొంగతో సరే మనము పెళ్లి చేసుకుందాము కానీ మనము పెళ్లి చేసుకొని ఈ ఊర్లో ఉండకూడదు అని అంటుంది, అప్పుడు దొంగ లతతో లత గారు పట్నం లో నాకు తెలిసినవాళ్ళు ఉన్నారు మనము అక్కడికి వెళ్లిపోదాము అని అంటాడు, ఇది విని లత సరే మరి అయితే మనము ఈ రోజు రాత్రి 12 గంటలకు ఇక్కడి నుండి పారిపోదాము అని అంటుంది అప్పుడు దొంగ లతతో లత గారు నా దగ్గర

డబ్బులు లేవు మనము ఎలా వెల్దాము? అని అంటాడు, ఇక లత అంటుంది మా అయన దగ్గర చాలా డబ్బులు నగలు ఉన్నాయి నేను అన్ని తీస్కొని వస్తాను నువ్వు కంగారు పడకు అని అంటుంది, డబ్బులు నగలు అన్న మాట విన్నాక దొంగ అబ్బా నా కోరిక పూర్తీ కాబోతుందని లోలోపలే నవ్వుకుంటూ ఉంటాడు, అదే రోజు రాత్రి లత తన భర్త పడుకున్నపుడు నెమ్మదిగా లేచి ఇంట్లో ఉన్న డబ్బులు నగలు ఒక ముటలో కట్టుకొని ఆ దొంగ దగ్గరికి వెళ్లపోతుంది, అప్పుడు దొంగ లత తనతో పాటు తెచ్చినా
డబ్బు మరియు నగలను చూసి ఎంతో సంబరపడిపోతాడు ఇద్దరు కలిసి పారిపోతారు ఆలా కాస్త దూరము వెళ్ళాక ఒక నది వస్తుంది అప్పుడు దొంగ లతతో లత గారు మనము ఈ నది దాటి వెళ్ళాలి కావున మీ దగ్గరున్న డబ్బుల మూట నాకివ్వండి నేను ముందు వెళ్లి ఈ డబ్బు మూటను నదికి ఆ పక్కన పెట్టి వస్తాను మళ్ళి వచ్చి మీకు తీసుకెళ్తాను అని అంటాడు, లత ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన దగ్గరున్న డబ్బు మూటను ఆ దొంగ చేతికి ఇచ్చేస్తుంది, దొంగ ఆ డబ్బు మూట
తీసుకోని నదిలో ఇత కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు, ఇక్కడ లత వాడి కోసము ఎదురు చూస్తూ ఉంటుంది యెంత సేపైనా వాడు తిరిగి రాడు అప్పుడు లత నేను మోసపోయాను అంటూ అక్కడే ఏడ్చుకుంటూ కూర్చుంటుంది, కానీ ఇప్పుడు ఎంత ఏడ్చినా లాభం లేదని తిరిగి ఉరికెళ్ళి జరిగిందంతా తన భర్తతో చెప్తుంది, రాందాసు చాలా మంచి వ్యక్తి కాబట్టి లతును ఏమి అనకుండా మళ్ళి ఇంట్లోకి అనుమతి ఇస్తాడు ఇక మీదట లత తన భర్తతో ఎంతో ప్రేమగా న్యాయంగా ఉంటుంది.
Moral Of The Story : ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి, ఆశ పడడం మంచిది కానీ అత్యాశ పనికి రాదు.
2. విశ్వసముగల కుక్క ! మంచి నీతి కథలు కావాలి
చాలా ఏళ్ళ క్రితము ఒక ఊర్లో రాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అంటని భార్య పేరు లక్ష్మి వాళ్లకు పెళ్లియ్యి చాలా ఏళ్ళు గడిచిన పిల్లలు కాలేద, రాజు మరియు అతని భార్య ప్రతి రోజు దేవుడితో పిల్లల కోసము ప్రార్థన చేసేవారు, కొన్ని రోజుల తర్వాత వాళ్లకు ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి చాలా అందంగా ఉండేవాడు ఊర్లోవాళ్ళందరూ పిల్లవాడిని చూసేందుకు ఇంటికి వచ్చారు, ప్రతి ఒక్కోరు అబ్బా ఎంత బాగున్నాడు మీ పిల్లవాడు అని అనేవారు ఇది విని లక్ష్మి చాల సంతోషపడేది రాజు ఆనందంతో ఊర్లో వాళ్ళదారికి భోజనాలు పెట్టించాడు అంత బాగానే ఉంది, ప్రతి రోజు లాగే రాజు
పొలం పనికి వెళ్తూ వెళ్తూ లక్ష్మి నేను పొలానికి వెళ్తున్నాను పిల్లవాడు జాగ్రత అంటూ వెళ్ళిపోయాడు, ఇక లక్ష్మి తన కొడుకుతో ఆడుకుంటూ ఉంది అప్పుడే లక్ష్మి కి ఒక కుక్క పిల్ల ఏడుస్తూ కనిపించింది లక్ష్మి ఆ కుక్క పిల్ల దగ్గరికి వెళ్లి చూడగా అది అన్నము లేక బాగా చిక్కిపోయింది ఆ కుక్క పిల్ల పై లక్ష్మి జాలి పడి అయ్యో పాపం అంటూ ఆ కుక్క పిల్లను తనతో పాటు ఇంట్లోకి తీస్కొని వచ్చేసింది దానికి బాగా స్నానము చేయించి మంచి అన్నము పెట్టి తన తో పాటే ఇంట్లో పెట్టుకుంది, ఇక సాయంత్రము రాజు పొలం నుండి ఇంటికి తిరిగి వచ్చాడు కుక్క పిల్లను చూసి లక్ష్మి ఈ కుక్క పిల్ల ఎక్కడి వెంటనే
దీన్ని ఇంట్లో నుండి బయటకు పడేయి అని కోపం తో అంటాడు, అప్పుడు లక్ష్మి ఏవండీ ఈ కుక్క పిల్లను నేనే తెచ్చాను పాపం ఆకలి తో చచ్చిపోతుంటే తీసుకొచ్చి అన్నం పెట్టి స్నానం చేయించాను, దీన్ని కూడా మనతో పాటే పెట్టుకుందాము అని అంటుంది కానీ రాజు ఒప్పుకోదు ఇందువల్ల లక్ష్మి రాజు తో మాట్లాడం మానేసింది, ఇక చేసేది ఏమి లేక రాజు లక్ష్మి తో సరే కుక్కను ఇంట్లోకి తెచ్చి పెట్టుకు అని అంటాడు లక్ష్మి సంతోషం తో కుక్క ను మల్లి ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటుంది, ఆలా కొన్ని

రోజులు గడిచాక కుక్క మరియు లక్ష్మి కొడుకు ఇద్దరు మంచి స్నేహితులు అయిపోతారు ఇక లక్ష్మి కూడా కుక్కతో బాగా ప్రేమించేది, ఎక్కడికన్నా వెళ్లాలంటే లక్ష్మి తన కొడుకుని కుక్క దగ్గర కూర్చోపెట్టి వెళ్ళేది లక్ష్మి వచ్చేదాకా ఆ కుక్క పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకునేది, ఒక రోజు రాజు మరియు లక్ష్మి కి ఊర్లో ఫంక్షన్ కి వెళ్ళాలి కానీ బయట బాగా వర్షం పడుతుంది అందు వాళ్ళ లక్ష్మి తన భర్త తో ఏవండీ బయట బాగా వర్షం పడుతుంది అందువల్ల మన కొడుకుని ఇంట్లోనే పెట్టి మనము ఇద్దరం ఫంక్షన్ వెళదాము, ఇంట్లో కుక్క ఉందిగా మన కొడుకుకి ఏమి కాదు అని ఇద్దరు వెళ్ళిపోతారు, ఇంట్లో కుక్క
మరియు లక్ష్మ కొడుకు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు అప్పుడే ఇంట్లోకి పాము వచ్చేస్తుంది పాము ని చూసి లక్ష్మి కొడుకు భయపడి కేకలు వేస్తూ ఏడుస్తాడు, పాము ని చూసి కుక్క వెళ్లి దాని పై దాడి చేసి పాముని చంపేస్తుంది కుక్క కు కూడా గాయాలు అవుతాయి అందువల్ల కుక్కకు కూడా నోట్లో నుండి రక్తం వస్తుంది, పాముని చంపి కుక్క వెళ్లి బయట కూర్చుంటుంది అప్పుడే లక్ష్మి తన భర్త తో ఇంటికి తిరిగి వస్తుంది, కుక్క బయట కూర్చొని ఉంటుంది దానికి నోటి నిండా రక్తం చూసి లక్ష్మి వామ్మో ఈ
కుక్క నా బిడ్డను చంపి తినేసింది అంటూ కేకలు పెడుతూ గట్టిగ ఏడుస్తూ ఒక బాండ రాయి తీస్కొని కుక్క పైకి వేస్తుంది అందువల్ల కుక్క అక్కడిక్కడే చనిపోతుంది, ఇక రాజు లక్ష్మి ఇద్దరు కంగారు పడి ఇంట్లోకి పరిగెత్తి చూడగా వాళ్ళ కొడుకు నిద్ర పోతూ ఉంటాడు అప్పుడు వాళ్లకు అక్కడే పక్కన ఒక చనిపోయిన పాము కనిపిస్తుంది ఆ పామును చూసి వాళ్లకు అసలు విషయము అర్ధం అవుతుంది కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది, లక్మి మరియు రాజు పరిగెత్తుకుంటూ మల్లి కుక్క దగ్గరికి
వచ్చి చూడగా కుక్క అప్పటికీ చచ్చిపోయి ఉంటుంది, అప్పుడు రాజు మరియు లక్ష్మి కుక్కను చూసి అయ్యో యెంత పనయ్యింది అంటూ బాధ పడుతూ ఏడుస్తూ కూర్చుంటారు కానీ జరిగిన నష్టం జరిగిపోయింది.
Moral Of The Story : ఈ కథ ద్వారా మనము నేర్చుకున్న నీతి ఏమిటంటే, కోపం లో తొందర పది ఏ పని చేయకూడదు,ఆలా చేస్తే మనకే నష్టము.
Soo Friends ఇది మన ఈ రోజు 2 Best Moral Stories In Telugu ! మంచి నీతి కథలు కావాలి మీ అందరికి నచ్చాయి అని ఆశిస్తున్నాను రేపు మరిన్ని మంచి మంచి నీతి కథలతో మళ్ళి మీ ముందు ఉంటాను నా పేరు Neha Bye And Take Care
Also Read These Moral Stories : Top 2 Telugu Neeti Kathalu
Top 2 Neethi Kathalu In Telugu
Telugu Moral Stories On Friendship
Top 2 Moral Stories Telugu ! తెలుగు నీతి కథలు