Hii Friends నా పేరు Aishwarya ఈ రోజు నేను మీ కోసం ఎంతో reserch చేసి Best 4 Moral Stories In Telugu ! నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు చదివి మీ అమూల్యమైన అభిప్రాయము కామెంట్ చేసి తెలపండి
1. కాకి మరియు నక్క కథ ! Moral Stories In Telugu
అనగనగ ఒక అడవిలో ఒక కాకి ఉండేది ఆ కాకి తో ఎవ్వరు మాట్లాడేవారు కాదు ఎందుకంటె ఆ కాకి ఎప్పుడు చుసిన తన చిరిగిపోయిన గొంతు తో కావు కావు అని పాటలు పడుతూ ఉండేది, ఒక రోజు అడవిలోని అన్ని జంతువులూ కలిసి కాకి దగ్గరికి వెళ్లి ఓయ్ కాకి అసలే ని గొంతు బాగాలేదు పైగా నువ్వు కావు కావు అని పాటలు పడుతున్నావు మాకు చెవులు నొప్పి వస్తున్నాయి అని అంటారు, కానీ కాకి ఆ జంతువులకు నా గొంతు నా ఇష్టం నేను పాడుతాను అని గొడవ చేస్తుంది అందువల్ల ఆ
జంతువులూ అక్కడి నుండి వెళ్ళిపోతారు, ఒక రోజు పోదున్నే కాకి కి బాగా ఆకలి వేస్తుంది అందువల్ల కాకి భోజనం వెతుకుంటూ వెళ్తుంది చాలా సేపు అయ్యాక దానికి ఒక రొట్టె ముక్క దొరుకుతుంది కాకి వెళ్లి వెంటనే ఆ రొట్టెను తన నోట్లో పెట్టుకొని అక్కడి నుండి ఎగురుకుంటూ వెళ్లి ఒక చెట్టు మీద కూర్చుంటుంది, అప్పుడే ఒక నక్క ఆకలి తో విలవిలలాడుతూ ఆహారం కోసం వెతుకుంటూ వెళ్తూ ఉంటుంది, అప్పుడే అది కాకి నోట్లో రొట్టెను చూసి అబ్బా కాకి నోట్లో రొట్టె ఉంది ఎలాగైనా సరే ఆ

రొట్టెను నేను తినేయాలి అని ప్లాన్ వేస్తుంది, నెమ్మదిగా కాకి కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్లి కాకి గారు కాకి గారు ఈ అడవిలో మీరు తియ్యని పాట పాడుతారు అంట కదా ? నిజమేనా ? అని కాకిని అడుగుతుంది కాకి తన పొగడ్తలు విని తలా ఊపుతుంది, కాకి నక్క తన తెలివి తేటలు ఉపయోగించి కాకి గారు మీరు ఇంత తియ్యగా పాడుతారు అంటే నేను నమ్మను నాకు నమ్మకం కలగాలి అంటే మీరు నాకు ఒక పాట పాడి వినిపించండి అని అంటుంది, అప్పుడు పిచ్చి కాకి పాట పాడటానికి తన నోరు తెరుస్తుంది
అప్పుడే దాని నోట్లో ఉన్న రొట్టె ముక్క కింద పడిపోతుంది, నక్క ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రొట్టెను తన నోట్లో పెట్టుకొని అక్కడి నిండి పారిపోతుంది కాకి తెల్ల మొకం వేసుకొని చూస్తూ ఉండిపోతుంది
Moral Of The Story : జనాలు మనకు చాలా సార్లు పొగుడుతూ ఉంటారు మనము వాళ్ళ మాటల్లో పడి ముర్ఖులం అవ్వకూడదు, వాళ్ళ అవసరాలకు మనకు వాడుకుంటారు
2. తాంబేలు మరియు కొంగ కథ ! Telugu Moral Stories
చాలా ఏళ్ళ క్రితం ఒక అడవిలో చెరువు ఉండేది ఆ చెరువులో నీళ్లు త్రాగడానికి అడవిలోని అన్ని జంతువులూ అక్కడికి వచ్చేవి, ఆ చెరువులో ఒక తంబేలు మరియు రెండు కొంగలు ఉండేవి, ఎప్పుడు చుసిన తాంబేలు మాట్లాడుతూ ఉండేది అందువల్ల అడవిలోని జంతువులూ అందరు కలిసి దాని పేరు మాటలగాడు అని పెట్టేసారు, ఆలా కొద్దీ రోజులు అయ్యాక వేసవి కాలం వచ్చింది అందువల్ల చెరువు లో నీళ్లు ఎండకు తగ్గుతున్నాయి, అడవిలోని అన్ని జంతువులు ఒక్కోటి నీళ్ల కోసం వేరే
చెరువుకి వెళ్లిపోతున్నాయి, అప్పుడు కొంగలు తంబెలుతో ఒరేయ్ మన చెరువులో నీళ్లు బాగా తగ్గిపోయాయి ఇంకా కొన్నాళ్ళు అయితే నీళ్లు పూర్తిగా ఎండిపోతాయి మనము కూడా వేరే చెరువు లోకి వెళ్ళిపోతే మంచిది అని అంటాయి, అప్పుడు తంబేలు బాధ పడుతూ కొంగలతో మీకు రెక్కలు ఉన్నాయి మీరు కొన్ని క్షణాల్లో ఎక్కడికైనా ఎగిరిపోతారు మరి నా సంగతి ఏంటి? నేను చాలా నెమ్మదిగా నడుసాను కదా నేను రాలేను ఇక్కడే ఇలాగె చచ్చిపోతాను మీరు ఇద్దరు వెళ్లిపోండి అని అంటుంది,

ఇది వినగానే కొంగలకు తాంబేలు పై జాలి కలిగి ఒరేయ్ తంబేలు నువ్వు భయపడకు నీకు మేము ఇక్కడి నుండి తీసుకెళ్లి పోతాము అని ఒక కర్ర తీసుకొచ్చి మేము ఇద్దరమూ మా నోటి ద్వారా చెరో పక్క ఈ కర్ర ను పట్టుకుంటాము నువ్వు ఈ కర్రను మధ్యలో పట్టుకో అప్పుడు మనము ముగ్గురం ఎగురుకొంటూ వేరే చెరువులోకి వెళ్లిపోదాము అని అంటాయి, కొంగలు ముందే తంబేలు తో నువ్వు మాట్లాడకూడదు ఒక వేళా నువ్వు మాట్లాడితే కింద పడిపోతావు అని హెచ్చరిస్తాయి తంబేలు కూడా సరే
నేను ఏం మాట్లాడాను అని ఒప్పుకుంటుంది, ఇక కొంగలు ఆ కర్ర సహాయం తో తంబేలు ని తీస్కొని ఎగురుతాయి కాస్త దూరం వెళ్ళాక ఒక ఉరి మీదగా ఎగురుకుంటూ వెళ్తూ ఉంటారు, ఊర్లో వాళ్ళందరూ కొంగలు కాకి ని ఒక కర్ర సహాయం తో తీసుకెళ్తూ చూసి అందరు ఆనందం తో చప్పట్లు కొడతారు, తాంబేలు కిందికి చూస్తూ ఒరేయ్ ఎందుకు రా ఆలా చప్పట్లు కొడతారు అని నోరు తెరిచి అంటుంది, అందువల్ల ఆకాశం నుండి నెల మీదకు పది చనిపోతుంది కొంగలు బాధపడుతూ అక్కడి నుండి ఎగిరిపోతాయి
Moral Of The Story : అనవసరంగా మాట్లాడకూడదు, ఇలా చేయడం వల్ల మనకే నష్టం
3. ఏనుగు మరియు చీమ కథ ! Telugu Moral Story
అనగనగ ఒక పెద్ద అడవిలో ఒక ఏనుగు ఉండేది అది చాలా పెద్దగా బలంగా ఉండేది దాన్ని చూసి అడవిలోని ఇతర జంతువులూ భయపడేవారు, ఆ ఏనుగు కూడా అన్ని జంతువులను బాగా భయపెట్టేది, ఒక రోజు ఏనుగు ఎక్కడికో వెళ్తుండగా దానికి ఒక చెట్టు మీద చిలక కనిపిస్తుంది ఏనుగు చిలక దగ్గరికి వెళ్లి ఓయ్ చిలక నాకు దండం పెట్టు అని అంటుంది కానీ చిలక నేను నీకు దండం ఎందుకు పెట్టాలి నేను పెట్టాను పో అని అంటుంది, అప్పుడు ఏనుగుకి కోపం వచ్చి చిలక కూర్చున్న
చెట్టు భూమిలో నుండి పీకేస్తుంది, చిలక భయపడి అక్కడి నుండి ఎగిరిపోతుంది, అప్పుడు ఏనుగు చూసావా నా బలం నాతొ పెట్టుకోవొద్దు నాకు చాలా బలం ఉంది అంటూ నవ్వుతుంది, ఆలా ఇంకా కాస్తా ముందుకు వెళ్తుంది అక్కడ దానికి ఒక చీమ కనిపిస్తుంది చీమ ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటూ ఉంటుంది ఏనుగు చీమతో ఓయ్ చీమ ఏంచేస్తున్నావు ? అని అంటుంది అప్పుడు చీమ వర్షాకాలం వస్తుంది అందువల్ల నేను ఇల్లు కట్టుకుంటున్నాను అని అంటుంది, ఇది విని ఏనుగు పక పక నవ్వుతు

చీమ ఇల్లు తన తొండం తో కూల్చేస్తుంది నాతొ పెట్టుకోకు అంటూ చీమకు వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది, అప్పుడు చీమ బాగా ఏడుస్తూ ఎలాగైనా సరే నేను ఏనుగు తో ప్రతీకారం తీర్చుకుంటాను అని మనసులో అనుకుంటుంది, ఒక రోజు ఏనుగు కడుపు నిండా అన్నం తిని పచ్చని గడ్డిలో నిద్రపోతూ వుంటుంది అప్పుడు చీమ నెమ్మదిగా ఏనుగు తొండం లోకి వెళ్ళిపోతుంది, తొండం లోపలి వెళ్లి బాగా కరుస్తూఉంటుంది అందువల్ల ఏనుగు వామ్మో నూపి వామ్మో నొప్పి అంటు గట్టిగ
కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఏనుగు కేకలు విని అడవిలోని ఇతర జంతువులూ అందరు వచ్చి ఏనుగును చూసి ప్రతి రోజు మాకు ఏడ్పించేది ఈ రోజు దేవుడు నిన్ను ఏడ్పిస్తున్నాడు అని అన్నారు, ఇక చీమ నెమ్మదిగా తొండం లో నుంచి బయటక వచ్చి, ని శరీరం పెద్దగా ఉందని నువ్వు అందరిని భయపెట్టి బ్రతుకుంటూన్నావు నన్ను చూడు నేను ఎంత చిన్న చీమని ఐన నిన్ను ఏడ్పిస్తున్నాను అని అంటుంది, అప్పుడు ఏనుగుకి తానూ చేసింది తప్పు ఇంకో సారి నేను ఎవ్వరి పై నా బలం చూపించాను అని అందరి ముందు క్షమాపణలు కోరుకుంటుంది.
Moral Of The Story : బలహీనుల పై మన బల ప్రయోజనాలు చేయకూడదు, మనకన్నా బలవనులు కూడా ఉంటారు
4. మొసలి మరియు కోతి కథ ! Short Moral Stories In Telugu
పూర్వకాలం లో ఒక అడవిలో ఒక చెరువు ఉండేది, ఆ చెరువులో ఒక పెద్ద మొసలి ఉండేది ఆ చెరువు చుట్టూ పక్క మంచి మంచి పళ్ళ చెట్లు ఉండేవి ఒక పళ్ళ చెట్టు పై కోతి ఉండేది ఆ కోతి మరియు మొసలి ఇద్దరు చాలా మంచి స్నేహితులు గా ఉండేవారు ప్రతి రోజు కోతి మంచి మంచి పళ్ళు కోసి తినేది కొన్ని పళ్ళు మొసలి కి కూడా ఇచ్చేది మొసలి కూడా బాగా తినేది, ఆలా సమయం గడుస్తున్నా కొద్దీ ఇద్దరు ప్రాణ స్నేహితులు అయిపోయారు, మొసలి కోతిని తన వీపుపై కూర్చోపెట్టుకొని నది అంతా
తిప్పేది మళ్ళి సాయంతరం కోతిని తీసుకొచ్చి వడ్డున దింపేది, అప్పుడు కోతి మొసలికి పళ్ళు కోసి ఇచ్చేది మొసలి ఆ పళ్ళు తీసుకెళ్లి తన భార్యకు ఇచ్చేది ఇద్దరు భార్య భర్తలు కలిసి ఆ పళ్ళను తినేవారు, ఒక రోజు మొసలి భార్య తన భర్త తో ఏవండీ, మీ స్నేహితుడు ఐన కోతి రోజు ఎంత రుచికరమైన పళ్ళను తింటుంది ఈ పళ్లే ఇంతా రుచిగా ఉంటే కోతి యొక్క గుండె ఎంత రుచికరంగా ఉంటుంది, నాకు కోతి గుండె తినాలని ఉంది అని అంటుంది, అప్పుడు మొసలి ఇది అసాధ్యము కోతి

నా ప్రాణ స్నేహితుడు నేను దాన్ని చంపలేను అని అంటుంది, అప్పుడే మొసలి భార్య ఏడుస్తూ కుర్చుంటుంది తన భార్య ఏడ్పు చూడలేక మొసలి సరే నువ్వు ఏడవకు నేను రేపు కోతిని నా పాటు తీస్కొని వస్తాను అప్పుడు దాన్ని చంపి తిందువు అని అంటుంది, రెండవ రోజు మొసలి కోతి దగ్గరికి వెళ్లి రా వీపు పై కూర్చో ఆలా చెరువు లో తిరుగుదాము అని అంటుంది పాపం కోతికి ఏమి తెలీదు అందువల్ల కోతి మొసలి వీపు పై ఎక్కి కూర్చుంటుంది చెరువులో కాస్త దూరం వెళ్ళాక మొసలి కోతితో
ఒరేయ్ నా భార్య నిన్ను చంపి ని గుండె తినాలని అంటుంది నన్ను మన్నించు ఈ రోజు ని ప్రాణాలు బలి తీసుకుంటున్నాను అని అంటుంది, ఇది విని కోతి అస్సలు భయపడకుండా అయ్యో మొసలి గారు ఈ మాట ముందే చెప్పాలి కదా, నేను నా గుండెకాయ చెట్టు మీదే పెట్టి వచ్చాను నన్ను చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు నేను నా గుండెకాయ తీస్కొని వస్తాను అని అంటుంది కోతి, తెలివితక్కువ మొసలి కోతి మాటలు నమ్మి కోతిని మళ్ళి వడ్డుకు తెచ్చి వెళ్లి ని గుండెకాయ తీస్కొని రా అని అంటుంది, కోతి
టక్కున కిందికి దిగి పరిగెత్తుకుంటూ చెట్టు పైకి వెళ్లి కూర్చొని ఒరేయ్ మొసలి నీకు అసలు బుద్ది ఉందా? గుండెకాయ ఎప్పుడు మనతో పాటే ఉంటుంది, ఐన నేను మీకు ప్రతి రోజు మంచి మంచి పళ్ళు కోసిఇస్తే మీరు నన్నే తినాలని అనుకున్నారా అంటూ అక్కడి నుండి పారిపోతుంది.
Moral Of The Story : మనకు ఎలాంటి పరిస్తుతులు ఎదురైనా కంగారు పడకుండా తెలివి ఉపయోగించి బయట పడాలి
Also Read These Moral Stories : Top Moral Stories In Telugu ! నీతి కథలు
Rat And Mouse Telugu Moral Stories
Top Best Moral Stories In Telugu
Top 2 Best Neeti Kathalu In Telugu