Hii Friends నా పేరు దివ్య ఈ రోజు నేను మీ కోసం Best Moral Stories In Telugu తెలుగు నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయం కామెంట్ చేసి తెలియ చేయండి
మూడు పందుల కథ ! Moral Stories In Telugu
అనగనగ ఒక అడవిలో ఒక పంది ఉండేది దానికి ముగ్గురు పిల్లలు ఉండేవారు, తల్లి పంది తన ముగ్గురు పిల్లలను ఎంతో ప్రేమతో పెంచుకున్నంది చూస్తూ చూస్తూ ముగ్గురు పిల్లలు పెద్దవారు అయిపోయారు ఒక రోజు తల్లి పంది తన ముగ్గురు పిల్లలను పిలిచి ఒరేయ్ బాబు ఇప్పుడు మీరు ముగ్గురు పెద్దవాళ్ళు అయోయారు ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్లి బ్రతకండి అని అంటుంది తన ముగ్గురు పిల్లలు సరే అమ్మ అని ఇంటి నుంచి బయలు దేరుతారు, తమ తో పాటు కొన్ని తినే వస్తువులు పెట్టుకొని ప్రయాణం మొదలుపెట్టారు
అల నడుస్తూ నడుస్తూ ముగ్గురు పందులు అలసిపోయారు అప్పుడు పెద్ద పంది ఇంక నడవడం నా వల్ల కాదు నాకు కాళ్ళు బాగా నొప్పి గా ఉన్నాయి, మనం కాసేపు ఇక్కడే విశ్రాంతి చేద్దాము అని అంటుంది మిగిలిన రెండు పందులు కూడా సరే అని అక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకుంటారు, అప్పుడు పెద్ద పంది అంటుంది మనము ఇంక ఎన్నాళ్ళు ఇలా కలిసి వుండాలి? మనము పెద్ద వాళ్ళము అయిపోయాము ఎవరి దారి వాళ్ళు చూస్కోండి అని అంటుంది, రెండవ పంది కూడా సరే మనము విడిపోదాం అని అంటుంది కానీ
మూడవ పంది మాత్రం బాధ పడుతూ ఒరేయ్ మనము ఇన్నాళ్లు కలిసి ఉన్నాము, ఇప్పుడు విడి పోవాలంటే చాలా బాధగా ఉంది రా, మనుము కలిసి ఉంటే మంచిది, ఒకరికి ఒకరు సహాయం పడొచ్చు అని మిగిలిన రెండు పందులతో అంటుంది, చిన్న పంది ఏడ్పు చూడలేక రెండు పందులు సరేలే ఏడవకు మనము కలిసే ఉందాము అని అంటారు, కానీ ఎవరి ఇళ్లుల్లు వాళ్ళు కట్టుకోవాలి అని ముగ్గురు తమ తమ ఇళ్లులు నిర్మించడం మొదలు పెడతారు, పెద్ద పంది అడవిలోకి వెళ్ళి గడ్డి తెచ్చుకొని తన ఇల్లు ఒక గంట

కట్టుకుంటుంది, రెండవ పంది చెట్టు కొమ్మలు తెచ్చుకొని రెండు గంటల్లో తన ఇల్లు నిర్మించుకుంటుంది, కానీ చిన్న పంది ఇటుకలు తో తన ఇల్లు కట్టుకోవడం మొదలు పెడుతుంది వారం రోజులు రాత్రి పగలు కష్ట పడి ఇల్లు కట్టుకుంటుంది, రెండు పందులు చిన్న పందిని చూసి ఒరేయ్ నీకేమన్నా పిచ్చా ఇటికెలతో ఇల్లు ఎందుకు కట్టుకుంటునవు అని నవ్వేవారు కానీ చిన్న పంది వాళ్ళ మాటలు పట్టిచుకోకుండ తన ఇల్లు బాగా బందోబస్తు గా కట్టుకుంటుంది, అల కొన్నాళ్ళ తరువాత ఒక రోజు రాత్రి అడవిలో ఒక పులి వస్తుంది
ఆ పులి బాగా ఆకలి తో షికారు కోసం వెతుకుతూ ఉంటుంది పులి తిరుగుతూ తిరుగతూ పందుల ఇళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది, దానికి పందుల ఇళ్లు కనపడతాయి పులి పెద్ద పంది ఇంటికి వెళ్ళి తలుపు కొడ్తుంది పంది లోపటి నుండి ఎవరు మీరు అని అడుగుతుంది, అప్పుడు నేను పులిని నాకు బాగా ఆకలి వేస్తుంది నేను నిన్ను తినాలి తలుపు తియ్యి అని అంటుంది, పంది భయం తో వనికి పోతుంది, భయం తో కేకలు వేయడం మొదలుపెట్టింది, పులి రాజ పులి రాజ నన్ను తినకు అని అంటుంది, కానీ పులి బాగా ఆకలి
తో ఉంటుంది నేను నిన్ను తింటేనే నాకు కడుపు నిడుతుంది అని అంటుంది, పంది తలుపు తీయకుండా వెనక door నుంచి రెండవ పంది ఇంటికి వెళ్ళి ఏడవడం మొదలు పెట్టింది, దాన్ని చూసి రెండవ పంది ఎంటి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది, అప్పుడు పెద్ద పంది జరిగిందంతా రెండవ పందికి చెప్తుంది ఇద్దరు భయం తో గజ గజ వణికిపోయారు, పులి రెండవ పంది ఇంటి ముందుకొచ్చి తలుపు కొట్టుతుంది, రెండు పందులు భయం తో ఎవరు మీరు అని అంటారు, నేను పులిని నాకు బాగా ఆకలిగా
ఉంది నేను మి ఇద్దరినీ తినేస్తను అని అంటుంది, అప్పుడు పందుల లోపలి నుండి ఏడుస్తూ దయ చేసి మాకు తినొద్దు మేము తలుపు తియ్యము నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటారు, పులి కి బాగా కోపం వేస్తుంది పులి కోపం తో మీరు తలుపులు తీయకపోతే నేను లోపలికి రాలేను అని అనుకున్నారా? అని ఒక్కసారిగా చెట్ల కొమ్మల తో కట్టుకున్న ఇంటిని తన కాలు తో తన్నగానే ఆ ఇల్లు కూలిపోతుంది పులి లోపలికి వచ్చేస్తుంది, ఆ రెండు పందులు పరిగెత్తుకుంటు వెళ్లి చిన్న పంది ఇంట్లోకి వెళ్లిపోతాయి లోపలి నుండి గట్టిగ గొల్లం పెట్టుకుంటారు,
పందులు పులి నుండి ఎలా తప్పించుకుంటాయి ! Best Moral Stories In Telugu
పులి వాళ్ళను వెంబడిస్తూ అక్కడికి కూడా వచ్చేస్తుంది, వచ్చి తలుపు తీయండి అని అంటుంది చిన్న పంది ఏ మాత్రం భయపడకుండా లోపలి నుండే పులి తో ఓయ్ పులి ఇక్కడినుండి వెళ్ళిపో లేదంటే బాగోదు అని గట్టిగ హెచ్చరిస్తుంది పులికి కోపం వచ్చి నువ్వు తలుపు తియపోతే నేను లోపలి రాలేను అని అనుకున్నావా అని వెనక్కి వెళ్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా చిన్న పంది యొక్క గోడను గుద్దుతోంది, కానీ చిన్న పంది తన ఇల్లు ఇటికలతో కట్టుకోవడం వల్ల ఆ ఇల్లు కులదు, అందువల్ల పులి ఎంత ప్రయత్నం చేసిన చిన్న పంది ఇంట్లోకి వెళ్లడం కుదరలేదు, పులి కూడా బాగా మొండిది పులి
తన బుర్ర ఉపయోగించి ఇంట్లోకి వెళ్లే వేరే మార్గం చేసింది, ఈ సారి పులి పండి ఇంటి పైకి ఎక్కి చిమ్ని లో నుండి లోపలికి వెళ్లే పరాయత్నం చేస్తూ చిమ్ని లోపలి దూరింది చిమ్ని లో నుండి కిందికి దిగడం మొదలు పెట్టింది, పులి చిమ్ని ద్వారా లోపలికి రావడం చిన్న పంది చూసి అది కూడా తన బుర్ర పెట్టి ఎలాగైనా సరే పులిని లోపలికి రవివ్వకూడదు అని చిమ్ని కింద మంటలు పెట్టింది పులి కాస్త కిందికి దిగంగానే కింద మంటలు ఉండడం చూసి వామ్మో అని మళ్ళి పైకి పరిగెత్తడం మొదలు పెట్టింది
ఆలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ అడవిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది మళ్ళి దాని జన్మలో తిరిగి పందుల ఇంటి వైపు రాలేదు, అప్పుడు రెండు పెద్ద పందులు చిన్న పండి తో ఒరేయ్ తమ్ముడు నువ్వు ఇటికెలా తో ఇల్లు కడ్తున్నపుడు నిన్నుచూసి మేము బాగా యెగతాళి చేసాము ఈ రోజు ని ఇటికెలా ఇల్లే మా ప్రాణాలు కాపాడింది మమల్ని క్షమించు రా తమ్ముడు అని ఇద్దరు చిన్న పంది తో క్షమాపణలు కోరుకుంటారు, చిన్న పంది కూడా చాలా మంచిది, మీరు ఇద్దరు నా అన్నలు మనము అన్న తమ్ములము మనలో మనకు క్షమాపణలు ఏంటి అని అంటుంది, ఆ తర్వాత ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటూ తమ జీవితం సరదాగా గడుపుకుంటారు.
Soo Friends ఇది మన ఈ రోజీ “Best Moral Stories In Telugu తెలుగు నీతి కథలు” రేపు మరిన్ని కథలతో మల్లి మీ ముందు ఉంటాను, కథ మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసి తెలపండి Soo Friends నేను దివ్య Bye And Take Care Of Yourself
Also Read These Stoies : Top 3 Neethi Kathalu In Telugu ! మంచి నీతి కథలు కావలి
Telugu Neeti kathalu ! మంచి నీతి కథలు
Top 2 Small Stories In Telugu ! మంచి నీతి కథలు కావాలి
Top 2 Neeti Kathalu In Telugu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు