Hii Friends నా పేరు Nandini ఈ రోజు నేను మీ కోసము Best Telugu Neethi Kathalu ! Moral Stories In Telugu అనే మంచి మంచి కథలు తీస్కొని వచ్చాను కథలు చాలా బాగుంటాయి అందువల్ల కథలు పూర్తిగా చదివి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి.
1. ఎలుక మరియు ఏనుగు కథ ! Telugu Neethi Kathalu
అనగనగ ఒక గ్రామం ఉండేది ఆ గ్రామము లో దాదాపు వంద ఇల్లులు ఉండెడివి ఒక సారి గ్రామం లో వర్షాలు పడక ఆ ఊర్లో వాళ్ళదరు ఊరు వదిలి వెళ్ళిపోతారు అప్పుడు ఆ ఊర్లో ఒక్క మనిషి కూడా ఉండదు, అక్కడ కేవలము ఎలుకలు మాత్రమే ఉండిపోతాయి ఆలా కొన్నాళ్ళకు ఎలుకలు పూర్తిగా ఉరిలో తమ సామ్రాజ్యము చేసుకుంటారు, ఆ ఎలుకలకు ఒక రాజు ఉండేవాడు అతని పేరు చిట్టి, ఎవరికి ఏ బాధ వచ్చిన వాళ్ళు చిట్టి దగ్గరికి వెళ్లి పరిష్కారము చేసుకుబీనేవారు, ఒక సారి ఎలుకలు
అందరు కలిసి చిట్టి దగ్గరికి వెళ్లి రాజు గారు రాజు గారు మన ఊర్లో నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయి కనీసం తాగడానికి కూడా నీళ్లు లేకుండా పోయింది ఇలాగె ఉంటె మనుషులు ఈ ఉరిని వదిలి వెళ్ళిపోయినట్టు మనము కూడా వెళ్ళిపోవాలి అందువల్ల ఏదో ఉపాయము చేయండి అని చిట్టి ఎలుక తో అంటాయి, అప్పుడు చిట్టి సరే నాకు రెండు రోజులు సమయం ఇవ్వండి నేను ఏదో ఒక పరిష్కారము చేస్తాను అని అంటుంది, సరే అని మిగితా ఎలుకలు వెళ్లిపోతాయి అప్పుడు చిట్టి ఎలుక రెండు రోజులు బాగా
ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది, చిట్టి ఎలుక ఒక రోజు అన్ని ఎలుకను పిలిచి మనకు తాగడానికి నీళ్లు లేకపోతె మనము చచ్చిపోతాము కావున మనము అందరం కలిసి ఈ భూమి ని బాగా లోపలి తవ్వాలి అప్పుడు భోమి లో నుండి నీళ్లు వస్తాయి వాటిని తాగి మనము ప్రాణాలు కాపాడుకోవొచ్చు అని సలహా ఇస్తుంది, సరే అని అన్ని ఎలుకలు ఒప్పుకుంటాయి ఇక అందరు కలిసి తమ ముక్కు తో గుంతలు తవ్వడము మొదలుపెడ్తారు ఆలా తవ్వుతూ తవ్వుతూ చాలా ఎలుకలు చనిపోతాయి కానీ
మిగిత ఎలుకలు మాత్రం తమ పని ఆపక తవ్వుతునే ఉంటారు ఆలా పది రోజులు తవ్వేక నెమ్మదిగా ఆ గుంటలో నుండి నీళ్లు రావాడం మొదల అవుతాయి ఆ నీళ్లను చూసి ఎలుకలు అందరు బాగా సంతోషపడి సంబరాలు చేసుకుంటాయి, చిట్టి ఎలుక కూడా వాళ్ళను చూసి బాగా ఆనంద పడుతుంది అంత బాగానేవుంది కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ గ్రామము లోకి నీళ్లను వెతుకుంటు కొన్ని ఏనుగులు వస్తాయి ఆ ఏనుగులకు నీళ్లు కనిపిస్తాయి నీళ్లను చూసి ఏనుగులు కూడా ఎంతో సంతోషపడి

హమ్మయ ఇక్కడ బాగేనే నీళ్లు ఉన్నాయి ఇక మనము ఇక్కడే ఉండిపోదాము అని అనుకుంటూ ఉంటాయి వాళ్ళు మాట్లాడుకునేది ఒక ఎలుక విని పరిగెత్తుకుంటూ వెళ్లి చిట్టి ఎలుకతో చెప్తుంది, చిట్టి ఎలుకకు ఏనుగులు అంటే భయం అందువల్ల చిట్టి ఎలుక ఒక రోజు దాక్కొని ఏనుగుకు చూస్తూ ఉంటుంది కానీ వెళ్లి మాట్లాడే దేర్యం దానికి లేదు, ఆలా ప్రతి రోజు ఏనుగులు నీళ్లు తాగడానికి వెళ్తుండగా వాటి కళ్లలో పడి ఎలుకలు చనిపోయేటివి, అందువల్ల ఎలుకలు అన్ని కలిసి చిట్టి ఎలుక
దగ్గరికి వెళ్లి రాజు గారు ఆ ఏనుగులు ప్రతి రోజు మన ఎలుకను తొక్కి వెళ్లిపోతున్నాయి అందువల్ల మన చాలా ఎలుకలు చనిపోయాయి ఇలాగైతే మనము అందరము చచ్చిపోతాము మీరు వెళ్లి ఆ ఏనుగులతో మాట్లాడండి అని అంటాయి, కానీ చిట్టి ఎలుకకు ఏనుగులంటే భయం అందువల్ల చిట్టి ఎలుక సరే మీరు వెల్లడి నేను ఏనుగులతో మాట్లాడుతాను అంటూ ఒక రోజు చిట్టి ఎలుక భయపడుతూ భయపడుతూ ఏనుగుల దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఏనుగులు పడుకొని ఉంటాయి చిట్టి ఎలుక
నెమ్మదిగా ఒక ఏనుగు దగ్గరికి వెళ్లి దానికి నిద్రలేపి ఏనుగు గారు నేను మీతో మాట్లాడాలి అని అంటుంది అప్పుడు ఆ ఏనుగు చిట్టి ఎలుకతో నీకు ఏదైనా మాట్లాడాలి అంటే మా రాజు దగ్గరికి వెళ్లి మాట్లాడు అని అంటుంది, ఇది విని మీ రాజు ఎక్కడ ఉన్నాడు అయన పేరు ఏంటి అని అడుగుతుంది అప్పుడు ఆ ఏనుగు మా రాజు పేరు గజరాజు అదిగో అక్కడ పడుకొని ఉన్నాడు అని చూపిస్తుంది చిట్టి ఎలుక గజరాజు దగ్గరికి వెళ్లి రాజు గారు రాజు గారు అని నెమ్మదిగా అంటుంది అప్పుడే గజరాజు
నిద్రలేచి ఎలుకను చూసి ఏంటి నువ్వు ఎవరివి నా నిద్ర ఎందుకు పాడుచేసావు అని అంటుంది, అప్పుడు చిట్టి ఎలుక గజరాజు గారు ఈ గ్రామం లో మేము చాల ఏళ్ళ నుండి ఉంటున్నాము ఎంతో కస్టపడి గుంటలు తవ్వుకొని నీళ్లు తెచుకున్నాము మీరు ప్రతి రోజు నీళ్లు తాగడానికి వెళ్తున్నప్పుడు మా ఎలుకలని తోక్కేస్తున్నారు అందువల్ల ఎలుకలు చచ్చిపోతూన్నాయి దయ చేసి వేరే మార్గం లో వచ్చి నీళ్లు తాగండి అని అంటుంది, ఇది విని గజరాజుకి ఎలుకపై జాలి కలిగి అయ్యో మన్నించండి ఎలుక
గారు మా వల్ల మీ ప్రాణాలు పోతున్నాయి అంటే నాకు చాలా బాధగా ఉంది, ఇక నుండి మేము వేరే దారిలో వెళ్లి నీళ్లు తాగుతాము అని అంటుంది గజరాజు, ఇది విని చిట్టి ఎలుక గజరాజు గారు నేను ఇన్నాళ్లు ఏనుగులు మంచివి కావు అని అనుకోని ఏనుగులను చూసి భయపడేదాన్ని కానీ మీతో మాట్లాడక నాకు అర్ధం అయ్యింది ఏనుగులు ఎంత మంచివారో అయిన మీరు అంత పెద్ద ఏనుగు నాలాంటి ఒక చిన్న ఎలుక మాట ఎంత బాగా అర్ధం చేసుకున్నారు మీకు చాలా చాల ధన్యవాదాలు ఇక

నేను వెళ్తాను నేను కూడా ఇదే ఊర్లో ఉంటాను మీకు ఎప్పుడన్నా ఏదన్నా సహాయం కావాలంటే నన్ను అడగండి అని అంటుంది, ఇది విని గజరాజు లోలోపలే ఇంత చిన్న ఎలుక నాకు ఏమి సహాయము చేస్తుంది అని నవ్వుకుంటుంది, ఆలా ఏనుగులు తమ దారి మార్చుకొని నీళ్లకు వెళ్లేవారు కొన్నాళ్లకు ఏనుగులు మరియు ఎలుకలకు మంచి స్నేహం ఏర్పడింది, ఒక రోజు వేటగాడు వచ్చి వల వేసి ఏనుగులను పట్టడం మొదలుపెట్టాడు ఆలా ప్రతి రోజు చేసేవాడు ప్రతి రోజు ఒక ఏనుగు తగ్గిపోయేది
అప్పుడు గజరాజు మిగితా ఏనుగులతో ప్రతి రోజు మనలో ఒక ఏనుగు తగ్గిపోతుంది అసలు ఏమి జరుగుతుంది ఇక్కడ అని కోపం తో గట్టిగ అరుస్తుంది, అప్పుడు ఒక ఏనుగు ముందుకొచ్చి గజరాజు గారు మన ఊర్లోకి ఒక వేటగాడు వస్తున్నాడు వాడు ప్రతి రోజు ఒక ఏనుగుని వాలా వేసి పట్టుకొని పోతున్నాడు అని అంటుంది ఇది విని గజరాజు చాలా చింతలో పడిపోతుంది, ఆలా ప్రతి రోజు వేటగాడు వచ్చి ఏనుగులను వలలో వేసి పట్టుకెళ్లి అమ్మేసేవాడు అల కొన్ని రోజులకి వాడు అన్ని
ఏనుగులను తిప్పుకొని వెళ్ళిపోతాడు ఇక గజరాజు ఒక్కతే మిగిలిపోతుంది, ఒక రోజు గజరాజు నీళ్లు తాగి తిరిగి వస్తుండగా ఆ వేటగాడు గజరాజు పై వాలా వేసి దాన్ని కూడా పట్టుకుంటాడు గజరాజు కాపాడండి కాపాడండి అంటూ గట్టిగ అరుస్తుంది కానీ దాని సహాయానికి రారు, అప్పుడే అక్కడ ఒక ఆవు గడ్డి తింటూ ఉంటుంది అది గజరాజు ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో గజరాజు గారు మీరు ఈ వలలో ఎలా చిక్కుకున్నారు నేను మీకు ఎలా సహాయం చేయాలి చెప్పండి నా ప్రాణాలు ఐన ఇచ్చి
మిమల్ని కాపుడుతాను అని అంటుంది, అప్పుడు గజరాజు ఆవుతో నువ్వు వెళ్లి చిట్టి తో నేను వలలో చిక్కునన్ను అని చెప్పు అని అంటుంది ఆవు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి చిట్టి ఎలుకతో జరిగిందంతా చెప్తుంది, అప్పుడే చిట్టి ఎలుక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తన స్నేహితులైన అన్ని ఎలుకను తీస్కొని గజరాజు దగ్గరికి వెళ్తుంది ఇక అందరు కలిసి తమ సూది లాంటి పళ్లతో ఆ వలను కొరికి తెంపేస్తారు గజరాజు వలలో నుండి బయటకు వచ్చి ఎలుకల తో నా
ప్రాణం కాపాడినందుకు చాల చాల ధన్యవాదాలు అని చెప్పి నేరుగా చిట్టి ఎలుక దగ్గరికి వెళ్లి చిట్టి ఎలుక గారు మీరు కొన్నాళ్ల క్రితము నా దగ్గరికి వచ్చి ఏదైనా సహాయము కావాలంటే నాకు చెప్పండి నేను మీకు తప్పకుండ సహాయము చేస్తాను అని అన్నప్పుడు నేను మనసులో ఇంత చిన్న ఎలుక నాకు ఏమి సహాయం చేస్తుందని అనుకున్నాను కానీ ఈ రోజు మీరు నా ప్రాణాలు కాపాడి నాకు ఇంకో
జన్మ ఇచ్చారు నేను మీ మేలు ఎప్పటికి మర్చిపోలేను అని చిట్టి ఎలుక తో అంటుంది, చిట్టి ఎలుక కూడా బాగా సంతోషపడి ఇక నుండి గజరాజు గారు మనతో పాటే ఉంటారని ఘోషణ చేస్తుంది ఇక నుండి అందరు ఒకే దగ్గరుంటూ తమ జీవితం గడుపుకుంటారు.
Moral Of The Story : ఈ కథ ద్వారా మనము నేర్చుకున్న నీతి ఏమిటంటే, మనకు ఎప్పుడైనా ఎవ్వరితో ఐన అవసరము పడవచ్చు అందువల్ల బలహీనులను చూసి వాళ్ళను తక్కువ అంచనా వెయ్యకూడదు.
Also Read These Moral Stories In Telugu : Top 2 Telugu Moral Stories For Kids
Top 2 Best Telugu Moral Stories