Moral Stories In Telugu 1 ! తెలుగు నీతి కథలు { Beauty And Beast }

Hii Friends నా పేరు Neha ఈ రోజు మీకోసం ఒక మంచి Moral Stories In Telugu 1 ! తెలుగు నీతి కథలు { Beauty And Beast } అనే తెలుగు కథ చాలా రీసెర్చ్ చేసి తీసుకొనివచ్చాను ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కథ పూర్తిగా చదివి కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి

కథలో ముఖ్య పాత్రలు

  • బ్యూటీ
  • Beast {దయ్యం}
  • వ్యాపారి
  • బ్యూటీ యొక్క అక్కలు
Moral Stories In Telugu 1 ! తెలుగు నీతి కథలు { Beauty And Beast }
Moral Stories In Telugu 1 ! తెలుగు నీతి కథలు { Beauty And Beast }

Beauty And Beast కథ తెలుగు లో

అనగనగ ఒక ఊర్లో ఇక వ్యాపారి ఉండేవాడు అతనికి ముగ్గురు అమ్మాయిలు ఆ వ్యాపారి తన ముగ్గురు బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు వాళ్లకు ఏ లోటు లేకుండా అన్ని అవసరాలు తీర్చేవాడు, ఒకసారి య ఎదో పని మీద అయన విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది వెళ్లే ముందు ముగ్గురు అమ్మాయిలను పిలిచి నేను విదేశానికి వెళ్తున్నాను మీకు అక్కడి నుండి ఏమైనా కావాలా చెప్పండి నేను తెస్తాను అని అన్నాడు

మొదటి అమ్మాయి నాన్నా నా కోసం మంచి బట్టలు తీస్కోనిరా అని అన్నది రెండవ అమ్మాయి నాన్నా నాకోసం నగలు తీస్కోనిరా అని అన్నది ఇక మూడోవ అమ్మాయి తన పేరు బ్యూటీ ఆ అమ్మాయి నానా నా కోసం ఒక గులాబి పువ్వు తీస్కొనిరా అని అన్నది ఆ వ్యక్తి సరే మీ ముగ్గురి కోసం మీరు అడిగింది తప్పకుండ తెస్తామని అని తన ప్రయాణానికి బయలుదేరాడు

తన పని ముగించొకొని అయన తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో ఒక పెద్ద తుఫాను వచ్చింది అందువల్ల అతను ఇంటికి వెళ్లలేకపోయాడు ఎటు చుసిన తుఫాను, గాలి, వాన, వరదలు అప్పటికే బాగా చీకటి పడింది, ఆయనకు ఎక్కడో దూరం ఒక వెలుగు కాంతి కనిపించింది, ఈ రోజు రాత్రి అక్కడే ఉంది పోదున్నే ఇంటికి వెళ్లిపోదాము అనే ఉద్దేశం తో అయన ఆ కాంతి ఉన్న భవనం దగ్గరికి వెళ్ళాడు

Moral Stories In Telugu ఎలా మొదలు అవుతుంది

ఆ వ్యాపారి భవనం దగ్గరికి వెళ్లి చుస్తే అక్కడ ఎవ్వరు కనపడలేదు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని ఎన్ని సార్లు అరిచినా ఎవ్వరు పలకలేదు, ఇంకా కాస్త లోపలికి వెళ్లి చూడగా అక్కడ డైనింగ్ టేబుల్ పై రక రకాల వంటకాలు చేసి రెడీ గా పెట్టి ఉన్నాయి కానీ ఆశచేర్యం ఏంటంటే అక్కడ తినేవాళ్లు కూడా ఎవ్వరు లేరు, రుచికరమైన వంటకాలు చూసి వ్యాపారి యొక్క ఆకలి ఇంకా గట్టిగ పెరిగింది అయన ఏమి ఆలోచించక వెళ్లి అక్కడున్న వంటకాలు అన్ని తినేసాడు ఇంకా నిద్రపోవాలని ఒక గదిలోకి వెళ్లి బాగా మెత్తగున్న పరుపు పై నిద్రపోయాడు, తెల్లారి లేచి చుస్తే ఆ భవనం లో ఒక అందమైన పువ్వుల గార్డెన్ కనిపించింది అందులో ఒక చెట్టు కు తాజా తాజా గులాబీ పువ్వు కూడా పూసింది ఆ పువ్వు ని చూడగానే ఆయనకు తన అమ్మాయి బ్యూటీ గులాబీ పువ్వు కావాలన్నా మాట గుర్తుకు వచ్చింది,

అయన అల్సయం చేయకుండా వెళ్లి ఠప్పున ఆ గులాబీ పువ్వు తెంపి తన బ్యాగులో వెస్కొని ఇంటికి బయలుదేరాడు, అంతలోపు అతని ముందు ఒక పెద్ద దయ్యం ప్రతేక్ష్యం అయ్యి నువ్వు నా ఇంట్లో అన్నం తిన్నావు, రాత్రంతా నా ఇంట్లో పడుకున్నావు నేను నిన్ను ఏమి అనలేదు ఇపుడు నా పర్మిషన్ లేకుండా నా గార్డెన్ లో పువ్వు తెంపావు, నిన్ను వదిలిపెట్టను నిన్ను చంపేస్తా అని అంటుంది, వ్యాపారి భయం తో గాఢ గాఢ వణికిపోతూ నన్ను మన్నించు నేను తప్పు చేసాను, ఐన ఈ పువ్వు నేను నా కోసం కొయ్యలేదు నా అమ్మాయి బ్యూటీ గులాబీ పువ్వు కావాలంది దాని కోసం తెంపాను అని అంటాడు, ఇది వినగానే ఆ రాక్షసుడు సరే నిన్ను వెళ్లనిస్తాను కానీ నాది ఒక షరతు అని అంటదు, వ్యాపారి భయపడుతూ ఏంటి ఆ షరతు అని అంటాడు అప్పుడు రాక్షసుడు అంటాడు ని అమ్మాయిని నా దగ్గరికి పంపాలి అని అంటాడు, పాపం వ్యాపారి బాధపడుతూ సరే పంపిస్తాను అని మాట ఇచ్చి అక్కడి నుండి బయలుదేరుతాడు

ఇంటికి వెళ్లి వ్యాపారి జరిగిందంతా తన ముగ్గురు అమ్మాయిల తో చెప్తాడు, బ్యూటీ నన్ను క్షమించు తల్లి ఆ సమయం లో ఏమి చేయాలో నాకు అర్ధం కాలేదు నేను నిన్ను రాక్షసుడి దగ్గరికి పంపుతానని మాట ఇచ్చి వచ్చను అని అన్నాడు, బ్యూటీ తండ్రి చెయ్యి పట్టుకొని నాన్న నువ్వు ఆ రాక్షసుడికి ఇచ్చిన మాట నేను నిలబెడతాను అని బ్యూటీ ఆ రాక్షసుడి భవనానికి వెళ్తుంది

బ్యూటీ ఆ భావననానికి వెళ్ళగానే రాక్షసుడు తనకు స్వగతం పలుకుతున్నాడు ఆ రాక్షసుడి ని చూడగానే బ్యూటీ భయం తో కేకలు వేసింది, రాక్షసుడు భయపడకు నేను నిన్ను ఏమి అన్నాను అని బ్యూటీ ని లోపలి ఆహ్వానించాడు బ్యూటీ భయపడుతూ భయపడుతూ లోనికి వెళ్ళింది, ఆలా సమయం గడుస్తున్నా కొద్దీ బ్యూటీ భయం కూడా తగ్గింది ఇప్పుడు రాక్షసుడు మరియు బ్యూటీ ఇద్దరు బాగా Close Friends అయిపోయారు, ఇద్దరు గంటలు గంటలు నవ్వుకుంటూ మాట్లాడుకునే వాళ్ళు కానీ రాక్షసుడు బ్యూటీ పై తన మనసు పాడేసుకున్నాడు బ్యూటీ ని ప్రేమిస్తున్నాడు, తన తో పెళ్లి చేసుకోవాలి కోరిక ఆ రాక్షసుడి లో కలిగింది, ఒక రోజు తన మనసులో మాట బ్యూటీ తో చెప్పాలని బ్యూటీ దగ్గరికి వెళ్ళాడు, కానీ అప్పుడు బ్యూటీ ఏడుస్తూ కూర్చుంది

రాక్షసుసుడు కంగారు పడి బ్యూటీ ఎందుకు ఏడుస్తున్నావు నీకు ఏమైంది చెప్పు అని అడిగాడు అప్పుడు బ్యూటీ నాకు మా నాన్న గుర్తుకు వస్తున్నాడు మా నన్ను ను చూసి చాలా రోజులైంది అని అంటుంది, అప్పుడు ఆ రాక్షసుడు నవ్వుతు ఇంతేనా? నువ్వు ఏడవకు అని ఒక బ్యూటీ కి ఒక అద్దం ఇచ్చాడు ఆ అద్దం లో బ్యూటీ తన నాన్నను చూసి బాగా సంతోష పడుతుంది కానీ బ్యూటీ వాళ్ళ నాన్న అనారోగ్యం తో బడా పడుతూ ఉంటాడు, ఇది చూసి బ్యూటీ ఆ రాక్షసుడి తో మా నాన్నకు ఒంట్లో బాగాలేదు నేను మా నాన్న దగ్గరికి వెళ్లి మల్లి వస్తాను అని అంటుంది రాక్షసుడు సరే వేళ్ళు కానీ మల్లి 7 రోజుల్లో తిరిగిరావాలి పంపిస్తాడు బ్యూటీ తన ఇంటికి వెళ్తుంది, బ్యూటీ తన తండ్రి మరియు అక్కలను చూసి బాగా సంతోష పడుతుంది, చూస్తూ చూస్తూ 7 రోజులు గడిచిపోతాయి

ఒకరోజు రాత్రి బ్యూటీ కి కల వస్తుంది కలలో రాక్షసుడు చనిపోతాడు బ్యూటీ వెంటనే భవనానికి బయలుదేరుతుంది వెళ్లి చూడగా అక్కడ రాక్షసుడు నిజంగానే చనిపోతాడు బ్యూటీ రాక్షసుడి దగ్గర కూర్చొని నువ్వు నన్ను వదిలి పెట్టి వెళ్లొదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను అని గట్టిగ కేకలు పెట్టి ఏడుస్తుంది, అంతలో ఆకాశం లో నుంచి ఒక వెలుగు వచ్చి ఆ రాక్షసుడి పై పడుతుంది కాసేపు అయ్యాక వెలుగు వెళ్ళిపోతుంది, ఎంతో భయంకరంగా కనిపించే రాక్షసుడు ఒక అందమైన రాజకుమారుడి లా మారిపోతాడు, బ్యూటీ ఆశచేర్యం తో ఎవరు నువ్వు అని ఆ రాజకుమరుడిని అడుగుతుంది, అప్పుడు ఆ

రాజకుమారుడు అంటాడు నేనే ఆ రాక్షసుడిని కొన్నాళ్ల క్రితం ఒక మంత్రగాడు నన్ను షాపాము పెడితే నేను రాక్షసుడిలా మారిపోయను, వెళ్తూ వెళ్తూ ఆ మంత్రగాడు ఎవరైనా అమ్మాయి నిన్ను ప్రేమిస్తే నువ్వు మల్లి రాజకుమారుడివి అవుతావు లేకపోతె నువ్వు జీవితాంతం ఇలాగె రాక్షసుడి లాగే బ్రతకాలి అని అన్నాడు, నేను ఈ శాపం తిస్కోడానికి చాలా మంది అమ్మాయిలను నన్ను ప్రేమించండి అని అన్నాను కానీ అందరు నన్ను చూసి పారిపోయారు, కానీ నువ్వు ఒక్కదానివి నన్ను ప్రేమించావు ఇపుడు ని వాళ్ళ నా శాపం పోయింది అని అంటాడు, రాజకుమారుడు వెంటనే బ్యూటీ ని నన్ను పెళ్లి చేస్కుంటావా అని అడుగుతాడు బ్యూటీ కూడా చాలా ఆనందంతో పెళ్ళికి సిద్ధం అవుతుంది ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని చాలా స్నాతోషం తో తమ జీవితం గడుపుతారు

Soo Friends ఇది మన ఈ రోజీ Moral Stories In Telugu కథ మీ అందరికి నచ్చింది అనుకుంటాను మీ అభిప్రాయం కామెంట్ చేసి తెలపండి ఇట్లు మీ Friend Neha

Also Read These Stories : Disney Cinderella Story In Telugu ! సిండ్రెల్లా కథలు 2

Disney Princess Rapunzel Love Story In Telugu ! రపుంజీల్ ప్రేమ కథ

Top 8 Moral Stories in Telugu ! నీతి కథలు

Top 11 Telugu Moral Stories In Telugu ! 11 నీతి కథల

Top 10 Telugu Moral Stories In Telugu 

Leave a Comment

%d bloggers like this: