కప్ప మరియు ఎలుక కథ ! Rat And Mouse Telugu Moral Stories

Hii Friends నా పేరు Nandini ఈ రోజు నేను అందరికోసం కప్ప మరియు ఎలుక కథ ! Rat And Mouse Telugu Moral Stories అనే రెండు మంచి నీతి కథలు తీసుకోని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయము కామెంట్ చేసి తెలపండి

1.కప్ప మరియు ఎలుక కథ ! Mouse Telugu Moral Stories

అనగనగ ఒక పెద్ద అడవిలో ఒక చెరువు ఉండేది ఆ చెరువులో ఒక కప్ప ఉండేది, ఆ కప్ప తో ఎవ్వరు మాట్లాడేవారు కాదు, ప్రతి రోజు కప్ప బాధ పడేది ఒక రోజు సాయంత్రము కప్ప చెరువులో నుంచి బయటకు వచ్చి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది అప్పుడే అక్కడి నుండి ఒక ఎలుక వెళ్తూ ఉంటుంది కప్ప ను చూసి ఎలుక ఓయ్ కప్ప ఏమి అయ్యింది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది కప్ప ఎలుక తో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు నాతొ ఎవ్వరూ మాట్లాడారు అందుకే ఏడుస్తూనన్ను అని

అంటుంది, ఇది వినగానే ఎలుక కు కప్ప మీద జాలి పడి అయ్యో అంతేనా నేను ఉన్నాను గా ఇక నుండి మనము ఇద్దరమూ మంచి ఫ్రెండ్స్ అయిపోదాము అని అంటుంది, ఇది వినగానే కప్ప ఆనందం తో గంతులు వేస్తుంది, ఇక చాల ఫ్రెండ్స్ అయిపోతారు ప్రతి రోజు ఇద్దరు కలిసి గంటలు గంటలు మాటలు పెట్టేవారు, ఆలా రోజులు గడుస్తున్నా కొద్దీ వాళ్ళ ఇద్దరి మధ్య స్నేహం ఇంకా బాగా గట్టిగ అయ్యింది, ఆలా కొన్ని రోజుల తరవాత కప్ప ఎలుక ఇంటికి వెళ్లడం మొదలుపెట్టింది ఇద్దరు

బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు, ఒక రోజు కప్ప ఎలుక తో నేను ప్రతి రోజు ని ఇంటికి వస్తాను కానీ నువ్వు ఒక్కసారి కూడా నా ఇంటికి రాలేదు రేపు నా ఇంట్లో ఫంక్షన్ ఉంది నువ్వు తప్పకుండ రావాలని అని అంటుంది, అప్పుడు ఎలుక నవ్వుతు కప్ప తో నువ్వు భూమి మీద బ్రతకొచ్చు కానీ నేను నీళ్ళల్లో వస్తే చనిపోతాను అని అంటుంది, అప్పుడు కప్ప సరే నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుది, తెల్లారి మల్లి కప్ప ఎలుక ఇంటికి వచ్చి నిన్నఫంక్షన్ కి నువ్వురాలేదు నేను ఒక్కదాన్నే

కప్ప మరియు ఎలుక కథ ! Rat And Mouse Telugu Moral Stories
Rat And Mouse Telugu Moral Stories

ఫంక్షన్ చేసుకున్న నువ్వు కూడా ఉంటె ఎంత బాగా ఉండేది అని అంటుంది, ఎలుక కూడా బాగా బాధ పడుతుంది, కప్ప అంటుంది ఎలుక తో నేను నీళ్ళల్లో ఉంటాను నువ్వు భూమి మీద ఉంటావు కదా మనము ఒకరి తో ఒకోరు మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు చేయాలి నీకు తెలుసా అని అంటుంది, పాపం ఎలుక అమాయకంగా నాకు తెలీదు అని అంటుంది, అప్పుడు కప్ప ఎలుక తో ఒక తాడు తీసుకొచ్చి ఇదిగో ఈ తాడు ని తోకను మరియు నా కాలికి కడతాను, నువ్వు నాతొ మాట్లాడాలి

అనుకున్నపుడు ఈ తాడు ని తోక తో లాగు నేను చెరువులో నుంచి బయటకు వస్తాను నేను ని తో మాట్లాడాలి అనుకున్నప్పుడు నా కాలు తో తాడుని లాగుతాను అప్పుడు మనం ఇద్దరం కలిసి మాట్లాడుకోవొచ్చు అని అంటుంది, పాపం కప్పు సరే అని ఒప్పుకుంటుంది, అనుకునట్టే కప్ప తాడు తీసుకోని ఎలుక తో కాలికి కట్టుకుంటుంది, ఒక రోజు రాత్రి కప్ప నిద్ర పోతూ తన కాలుని గట్టిగ జడిస్తుంది అందువల్ల ఎలుక వచ్చి చెరువులో పడుతుంది ఇది చూసి కప్పా పరిగెత్తు కుంటూ వెళ్లి

అయ్యో నా ఫ్రెండ్ నీళ్లలో పడిపోయింది అని అరుస్తూ ఎలుకను కప్పేదేందుకు చాలా ప్రయతనాలు చేస్తుంది కానీ ఎలుక నీళ్లలో మునగడం వల్ల చనిపోతుంది, అప్పుడే ఆకాశం లో ఒక కాకి ఎగురుకుంటూ వెళ్తుండగా అది ఎలుకని చూసి అబ్బా నాకు మంచి భోజనం దొరికిందని ఎగురుకుంటూ వచ్చి తన నోట్లో ఎలుకని పట్టుకొని వెళ్ళిపోతుంది, ఎలుక తోకకు కప్ప కాలు కూడా కట్టి ఉండడం వల్ల ఎలుక తో పాటు కప్పను కూడా కాకి ఎత్తుకొని వెళ్ళిపోతుంది, కాకి ఇద్దరినీ తినేస్తుంది, ఇలా కప్ప చేసిన తప్పుకి ఇద్దరు బలాయి పోతారు

Moral Of The Story : ఈ కథ ద్వారా మనము నేర్చుకున్న నీతి ఏమిటంటే ఒక తక్కువ వాడితో మనము ఎంత దూరం ఉంటె మనకే అంట మంచిది

2. రెండు పిల్లలు కథ ! Moral Stories In Telugu

అనగనగ ఒక అడవిలో రెండు పుల్లిలు ఉడేవి ఆ రెండు పిల్లలు చాలా మంచి ఫ్రెండ్స్ ఒక ఉల్లి పేరు చీని ఇంకో పిల్లి పేరు మీని, వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసే వెళ్లేవారు ఆ అడవిలో అన్ని జంతువులూ వాళ్ళిద్దరిని చూసి అబ్బా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని అనుకునేవారు, ఒకసారి చీని బజారుకి వెళ్ళింది కానీ మీని కి ఒంట్లో బాగాలేక అది చీని తో వెళ్ళలేదు ఇక మీని ఇంట్లో ఒక్కతే ఉంది ఇంట్లో చాలా బోరు కొడ్తుందని నేను కూడా బజారుకి వెళ్తాను వెళ్లి చీని కి

సర్ప్రైజ్ ఇస్తాను అని చీని కూడా బజారుకి బయలు దేరింది, ఆలా వెళ్తుండగా మేనికి దారిలో ఒక రొట్టె దొరుకుంటుంది ఆ రొట్టె ను మీని ఇంటికి తీసుకొచ్చి, ఇప్పుడు ఇంట్లో చీని లేదు నేను ఒక్కదాన్నే ఈ మొత్తం రొట్టెను తినేస్తాను అని ఆశపడుతోంది, రొట్టెను తన చేతుల్లో పట్టుకొని తినబోతుంది అప్పుడే చీని వచ్చేస్తుంది, మీని చేతులో రొట్టెను చూసి కోపం తో మనం మంచి ఫ్రెండ్స్ కదా నువ్వు ఒక్క దానివే తినేస్తావా అని గట్టిగ అంటుంది, వెంటనే మీని అయ్యో ఆలా ఏమి లేదు నేను నువ్వు లేకుండా

ఎప్పుడైనా తిన్నానా? ఈ రొట్టెను నేను రెండు చేస్తున్నాను అని అంటుంది కానీ మీని అంటుంది, కానీ చీని కి అంత అర్ధం అయిపోతుంది, వెంటనే మీని ఆ రొట్టెను రెండు భాగాలుగా చేస్తుంది కానీ ఒక భాగం ఎక్కువ ఇంకో భాగం తక్కువ ఉంటుందిఎం, తక్కువున్నా భాగం చీని కి ఇస్తుంది చీని కోపం తో నాకు తక్కువ ఎందుకు ఇచ్చావు అని అంటుంది, అప్పుడు మీని ఈ రొట్టె నాకు దొరికింది కదా అందువల్ల నేను ఎక్కువ తీసుకుంటాను అని అంటుంది కానీ చీని ఒప్పుకోదు అందువల్ల ఇద్దరు బాగా గొడవ పడుతూ ఉంటారు వాళ్ళ అరుపులు విని అడవిలోని ఇతర జంతువులూ కూడా వచ్చి అక్కడికి

కప్ప మరియు ఎలుక కథ ! Rat And Mouse Telugu Moral Stories
Rat And Mouse Telugu Moral Stories

చేరుతారు, ఆ అడవికి రాజు ఐన పులి కూడా అక్కడికి వచ్చి మీని తో నువ్వు చేసింది తప్పు ఇద్దరికీ సరి సమానం రొట్టె కావాలని నిర్ణయిస్తుంది, అందుకని పులి ఒక కోతిని పిలిపించి జరిగిందంతా చెప్పి ఇద్దరికీ సరి సమానం రొట్టె పంచి పెట్టు అని అంటుంది పులి, కోతి సరే మహారాజు గారు అని కోతి వెళ్లి ఒక తక్కెడ తీస్కొని వచ్చి ఆ రొట్టెను తక్కెడలో వేసి జోకుతుంది అప్పుడు ఒక రొట్టె ముక్క పెద్దగా ఉండడం వల్ల తక్కెడ ఒక వైపు వంగుతుంది కోతి ఎక్కువఉన్న రొట్టె తినేది ఆలా నెమ్మదిగా కోతి రొట్టె

మొత్తం తినేస్తుంది, చివరికి రెండు చిన్న చిన్న రొట్టె ముక్కలు మిగులుతాయి, ఆ రెండు చిన్న రొట్టె ముక్కలను చూసి పిల్లిలు బాధ పడుతూ కోతితో ఇక చాలు మిగిలిన ఆ రెండు మాకు ఇచ్చేయి మేము తినేస్తాము అని అంటారు కానీ కోతి అబ్బా మీరు ఇద్దరు ఎంత తెలివి గల వాళ్ళు నేను కష్టం చేసాను మరి నాకు ఏమి ఇవ్వరా? అంటూ మిగిలిన ఆ రెండు చిన్న రొట్టె ముక్కలు కూడా నోట్లో వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది, చీని మరియు మీని ఇద్దరు ఒకరి మొకం ఒకోరు చూసుకుంటూ అక్కడే నిలబడిపోతారు

Moral Of The Story : ఈ కథ తో మనం నేర్చుకున్న నీతి ఏమిటంటే, మన మధ్య ఎలాంటి విభేదాలు ఉన్న బయటవాళ్ళకు మన విషేయాలు చెప్పకూడదు వాళ్ళు మన బలహీనతను ఎప్పుడో ఒక సారి కచ్చితంగా వాడుకుంటారు, ఇంట్లో గొడవలు తగాదాలు ఇంట్లో పరిష్కరించు కోవాలి బయట వాళ్లకు మన Secrets చెప్పకూడదు

Soo Friends ఇది మన ఈ రోజి కప్ప మరియు ఎలుక కథ ! Rat And Mouse Telugu Moral Stories మీ అందరికి నచ్చాయి అని ఆశిస్తున్నాను రేపు ఇంకో మంచి నీతీ కథ తో మళ్ళి మీ ముందు ఉంటాను నా పేరు Nandini Bye And Take Care

Also Read These Moral Stories : Top Best Moral Stories In Telugu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు

Top 2 Best Neeti Kathalu In Telugu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు

Telugu Moral Stories On Friendship ! తెలుగు నీతి కథలు

Top 2 Best Moral Stories In Telugu ! తెలుగు నీతి కథలు

Leave a Comment

%d bloggers like this: