Hii friends నా పేరు Neha ఈ రోజు నేను మీకోసం మంచి Telugu Kathalu తీస్కొని వచ్చేసాను ఈ తెలుగు కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయ కామెంట్ చేసి తెలియచేయండి, ఐతే నేరుగా కతలోకి వెళ్లిపోదాము
అనగనగ ఒక నగరం లో దొంగల గోల బాగా ఉండేది, ఆ నగర వాసులు అంత కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమ నగరం లో దొంగలు బాగా ఉన్నారు వాళ్ళని పట్టుకొని జైలు లో వేయండి అని కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వెంటనే రంగం లోకి దిగి ఆ దొంగలను వెతికి మరి జైలుకి పంపించారు, కానీ ఒక దొంగ తప్పిచుకొని తిరుగుతున్నాడు, వాడు చాల రోజులు ఆలా తప్పిచుకొని తిరగలేదు కాబట్టి వాడికి ఓకే ఐడియా వచ్చింది ఆ ఐడియా ఏంటంటే వాడు ఒక సాధు బాబా లాగ మారిపోయి ప్రజలోకి వెళ్తే వాడికి ఎవ్వరు దొంగ అనుకోరు పైగా నన్ను దేవుడు అని అనుకుంటారు అని, ఒక సాధు వేషం వేసుకొని ప్రజల మధ్య తిరుగుతున్నాడు

దొంగ బాబా దగ్గర ఉన్న విద్య ఏంటి
ఆ దొంగ బాబా దగ్గర ఒక అద్భుతమైన విద్య ఉండేది ఆ విద్య ఏంటంటే వాడు మాటలాగాడు అంటే మంచి మంచి మాటలు చెప్పి అందరిని తన వైపు చేసుకొనే వాడు, ఆలా చేస్త చేస్తూ వాడికి కొందరు శిషులు కూడా అయ్యారు, బాబా తన శిశువులతో అడవిలో ఉండేవాడు, ఒక రోజు ఒక పెద్ద వ్యాపారవేత్త బాబా ని కలవడానికి అడవిలోకి వెళ్ళాడు, బాబా ఆ వ్యాపారవేత్త ను కూడా తన మాయ మాటల్లో దించేసాడు, బాబా ను కలిసి ఆ వ్యాపారవేత్త ఇంటికి తిరిగి వచ్చేస్తాడు, ఇంటికి వచ్చాక అతనికి ఒక Idea వచ్చింది ఆ idea ఏంటంటే అతని దగ్గర బాగా బంగారం ఉండేది,
ఆ బంగారాన్ని ఎవరైనా దొంగలు దొంగిలిస్తారు అని చాల భయపడేవాడు అందుకని అతను ఆ బంగారం అంత ఒక మూటలో కట్టుకొని బాబా దగ్గరికి తీసుకెళ్లి బాబా నా దగ్గర చాల బంగారం ఉంది ఎవరైనా దొంగలు లాక్కొని వెళ్ళిపోతారేమో అనే భయం ఉంది, మీరు దేవుడు తో సమానం ఈ బంగారం మీ దగ్గరే పెట్టుకోండి నాకు కావలసినప్పుడు నేను వచ్చి టిఎస్కెళతాను అని అన్నాడు, ఆ బంగారం మూట ని చూడగానే దొంగ బాబా లో లోపలే సంతోష పడుతున్నాడు, బాబా అతని దగ్గరి నుండి బంగారం మూట తీసుకోని ఒక చెట్టు కింద భూమి ని తవ్వి పెట్టాడు,
ఆ వ్యాపారవేత్త ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ ఆ దొంగ బాబాకి నిద్ర పట్టడం లేదు ఎలాగైనా సరే బంగారం తీసుకోని పారిపోవాలని ప్లాన్ వేస్తున్నాడు, ఇంకో పక్క ఆ వ్యాపారవేత్త ఇంటికి వెళ్లి హాయ్ గా పడుకున్నాడు, ఎలగైనాసరే బంగారం తీస్కొని పారిపోవాలని బాబా ఆ సొమ్ముని అక్కడి నుండి తీసి తన సంచి లో వేసుకొని నేరుగా ఆ వ్యాపారవేత్త ఇంటికి వెళ్లి బాబు నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను ని సొమ్ము అక్కడే చెట్టు కింద భూమిలో ఉంది వెళ్లి తీస్కో అని అంటాడు, ఇదంతా ఆ వ్యాపారవేత్త యొక్క భార్య గమణిత ఉంటుంది, సరే బాబు వెళ్తున్నాను అని బాబా వెళ్ళిపోతాడు కానీ కొద్దీ సేపు అయ్యాక బాబా మల్లి తిరిగి వస్తాడు బాబా ను చూసి వ్యాపారవేత్త ఏంటి గురువు గాగు మల్లి వచ్చారు అని అంటాడు, ఆ దొంగ బాబా అంటాడు ఇందాక నేను ఇక్కడి నిండి వెళ్తున్నప్పుడు అనుకోకుండా మీ చెప్పులు వెస్కొని వెళ్ళిపోయాను ఇడిదిగో ని చెప్పులు అని అంటదు
దొంగ బాబా ఎలా దొరికాడు
అప్పుడు ఆ వ్యాపారవేత్త అయ్యో గురువు గారు మీరు ఎంత మంచి వారు అని అంటాడు ఇదంతా నాటకం బాబా తన పై అనుమానం రాకూడదని చేస్టున్న డ్రామా, సరే వెళ్తున్నాను అని బాబా వెళ్ళిపోతాడు, అప్పుడు వ్యాపారవేత్త యొక్క భార్య ఎవరు అయన అని అడుగుతుంది వ్యాపారవేత్త మొత్తం చెప్తాడు చెప్పి బాబా చాల మంచి వారు అయన లేకుండా నేను ఎలా బ్రతకాలి అని ఏడుస్తుంటాడు, అతని భార్య కు అనుమానం వచ్చి వెంటనే బంగారం దాపెట్టిన చోటు దగ్గరికి వెళ్లి తవ్వితే అక్కడ బంగారం ఉండదు, ఇప్పుడు వ్యాపారవేత్త కు అర్ధం అయ్యింది బాబా దొంగ అని వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిందంతా చెప్తారు, పోలీసులు రెండు రోజల ప్రయత్నం తరువాత దొంగ బాబా ని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు
moral of the story : మనకు కళ్ళకు కనిపించేదల్లా నిజం కాదు, మనకు కనిపించనిది అబధం కాదు, గుడ్డిగా ఎవ్వరికీ నమ్మరాదు మన మధ్య లోనే మోసగాళ్లు ఉంటారు కొన్ని సార్లు వాళ్లకు గుర్తు పట్టడం చాల కష్టం గ మారుతుంది, ఎవరికి ఐన నమ్మే ముందు వాళ్ళ background తెలుసుకోవడం చాల ముఖ్యం, మనకు ఏదైనా అర్ధం కానప్పుడు మన పెద్దల సలహా తప్పకుండ తీసుకోవాలి లేదంటే జీవితం నాశనం అవుతుంది
Soo Friends ఇక్కడి తో మన ఈ రోజీ కథ ముగుస్తుంది మీకు నచ్చిందనుకుంటాను నాకు కామెంట్ చేసి తెలియ చేయండి రేపు ఇంకో కథ తో మల్లి మీ ముందు ఉంటాను This Is Neha Bye And Take Care
Also Read These Stories : Telugu Stories With Moral ! నీతి కథలు తెలుగు
Friendship Moral Stories In Telugu ! Friendship నీతి కథలు
Neethi Kathalu In Telugu ! నీతి కథలు తెలుగులో
Moral Stories In Telugu 2 {Part 2} తెలుగు నీతి కథలు 2
Moral Stories In Telugu 1 ! తెలుగు నీతి కథలు { Beauty And Beast }