Hii Friends నా పేరు Jyothi ఈ రోజు నేను మీ కోసం Telugu Neeti kathalu ! మంచి నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయము కామెంట్ చేసి తెలపండి
ముని మరియు ఎలుక కథ ! Stories In Telugu With Moral
అనగనగా ఒక అడవిలో ఒక ముని ఉండేవారు అయన శివునికి చాలా పెద్ద భక్తుడు, ఆయన ప్రతి రోజు గంటలు పాటు పూజ చేసేవారు, ఒక రోజు అయన పూజ చేస్తుండగా అయన దగ్గరికి ఒక ఎలుక వచ్చి పడింది ఆ ఎలుక కి బాగా రక్తం పోతుంది, ముని ఎలుకను చూసి అయ్యో ఎలుక నీకు ఏం అయ్యింది నీకు రక్తం ఎందుకు వస్తుంది అని అడుగుతారు, అప్పుడు ఎలుక మునిగారు నా మీద ఓకే కాకి దాడి
చేసింది అందువల్ల నేను గాయపడ్డాను ఇప్పుడు నాకు ప్రాణం పోయేటట్టు ఉంది అని ఎలుక అంటుంది, అప్పుడు ముని నీకు ఏమి కాదు భయపడకు అని అంటారు, ముని గారికి పిల్లలు లేరు అందువల్ల ఆయనకు ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచన ఏంటంటే ఈ ఎలుకను నా మంత్రాల విద్య తో ఒక అమ్మాయి లాగ మార్చేసి నా భార్య కి ఇస్తే నా భార్య బాగా సంతోష పడుతుంది అని ముని గారు

ఆ ఎలుక పై మంత్రాలు వేసి దాన్ని ఎలుక నుండి ఒక చిన్న అమ్మాయి లాగ మార్చేస్తారు ఆ బిడ్డను తీస్కెళి తన భార్య చేతుల్లో పెట్టి ఇన్నాళ్లు మనకు పిల్లలు లేరు అని బాధ పడ్డావు కదా, ఇదిగో ని కోసం అమ్మాయిని తెచ్చాను అని అంటారు, ముని భార్యా ఆశచేర్యంతో అసలు ఈ అమ్మాయి ఎవరు
ఎక్కడినుండి తెచ్చారు అని అడుగుతూనే అప్పుడు ముని ఈ అమ్మాయి ని ఎవరో అడవిలో వదిలేసి పోయారు నేను ఇంటికి తిరిగి వస్తుండగా ఈ అమ్మాయి కనిపించింది జాలి పడి నేను అమ్మాయిని ఇంటికి తీస్కొని వచ్చాను అని అంటారు, ముని భార్యా ఆనందం తో అమ్మాయి ని తీసుకోని ఇంటి లోపలి వెళ్ళిపోతుంది, ఇక ముని తన భార్య అమ్మాయిని ఎంతో ప్రేమతో పెచుకుంటారు
అమ్మాయిని ఎలా పెంచుకుంటారు ! Telugu Neeti kathalu
మునిగారు మరియు అయన భర్య ఆ అమ్మాయి పేరు వేదాంత అని పెడ్తారు, మునిగారు ఆయనకు వచ్చిన తంత్ర మంత్రాల విద్యను వేదాంత కి నేర్పిస్తారు ఆలా చూస్తూ చూస్తూ వేదాంత చాలా అందంగా అయిపోతుంది అందంతో పాటు వేదాంత 16 ఏళ్ళు అయిపోతుంది, ఒక రోజు ముని భార్యా అయన తో ఏవండీ మన అమ్మయి పెద్దగా అయ్యింది, ఎక్కడన్నా మంచి సంబంధం చూసి మన అమ్మాయికి పెళ్లి చేయాలి అని అనగా, మునిగారు తన భార్య తో నువ్వు ఎక్కువగా ఆలోచించకు
మన అమ్మాయి కోసం నేను పెద్ద సంబంధం తెస్తాను అని మునిగారు ఒక రోజు వేదాంత ను తన తో పాటు ఒక పెద్ద అడవిలోకి తీసుకెళ్లి, తన దగ్గరున్న మంత్రాలతో సూర్యుడిని పిలుస్తారు వెంటనే సూర్యుడు ప్రత్యెక్షామ్ అయ్యి మునిగారు నన్ను ఎందుకు పిలిచారు ఆజ్ఞ చేయండి అని అంటాడు అప్పుడు మునిగారు సూర్యుడితో ఇది నా అమ్మాయి దీన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు, సూర్యుడు మునిగారు నాకేమి అభ్యంతరము లేదు ఒక సారి మీ అమాయిని కూడా
అడగండి అని అంటాడు, అప్పుడు మునిగారు వేదాంతా తో అమ్మ ని వివాహము సూర్యుడి తో చేయాలనీ అనుకుంటున్నాను నీకు ఇష్టమేనా అని అడుగుతారు, అప్పుడు వేదాంత నాన్న ఈ సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడు నేను ఆయనతో ఎలా ఉండాలి? ఇది అసంభవం నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది, అప్పుడు మునిగారు సూర్యుడితో నీ ఎండను కప్పేవాడు ఎవరైనా ఉంటె చెప్పు నా బిడ్డ పెళ్లి వారితో చేస్తాను అని అంటారు, అప్పుడు సూర్యుడు మునిగారు నా ఎండను కప్పే
వాడు ఒకోడు ఉన్నాడు మునిగారు వెంటనే ఎవరు చెప్పు అని అంటారు, అప్పుడు సూర్యుడు అంటాడు నా ఎండను కప్పేవాడు మబ్బు మీరు వెళ్లి మబ్బు తో మాట్లాడండి అని అంటాడు, మునిగారు తన అమ్మయిని మబ్బు దగ్గరికి తీసుకెళ్లి, వేదాంతా నిన్ను మబ్బు తో పెళ్లి చేసుదాము అని అనుకుంటున్నాను నీకు ఇష్టమేనా తల్లి అని అడుగుతారు, వేదాంత కోపం తో నాన్న ఈ మబ్బు ఎలా నల్లగా ఉందొ చూసావా నేను ఎంత తెల్లగా ఉన్నాను నాకు మబ్బు కి కుదరదు ఇంకో సంబంధం చూడు
అని వేదాంతా అంటుంది, ఈ సారి మునిగారు వేలంతా ను గాలిదేవుడి దగ్గరికి తీసుకెళ్లి అమ్మ తల్లి నీకు గాలిదేవుడ్ని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా అని అంటారు, వేదాంత అంటుంది నాన్న గాలి ఒక దగ్గర నిలబడదు నేను గాలి తో ఎలా ఉండగలను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని మునిగారిని అక్కడినుండి తీసుకెళ్లి పోతుంది దారి లో మునిగారికి ఓకే పెద్ద కొండా కనిపిస్తుంది, మునిగారు ఆ కొండా ను చూసి వేదాంతా ఈ కొండా ఎంత బాగుంది చేసావా? నీకు ఇష్టం
అంటే నేను కొండతో మాట్లాడి నీకు కొండనిచ్చి పెళ్లి చేస్తాను అని కొండా తో మునిగారు ఓయ్ కొండా ఇది నా అమ్మాయి వేదాంత ఎంత అందంగా ఉందొ చూసావా మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను నీకు ఇష్టమేనా? అని ముని అడుగుతారు కొండా ముని తో గురువు గారు మీరు పెద్దవారు మీ మాట నేను కాదు అని ఎలా అంగాలను మీకు ఇష్టం అంటే నాకు కూడా ఇష్టమే ఒక సారి మీ అమ్మాయిని కూడా అడుగుతే బాగుంటుంది అని అంటుంది కొండా, మునిగారు
వేదాంతా నిన్ను ఈ కొండకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను నీకు ఇష్టమే కదా అని అడుగుతారు, వేదాంతా ఏద్వడం మొదలు పెడ్తుంది మునిగారు అయ్యో తల్లి ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అని అనగా వేదాంత అంటుంది నాన్న నేను ఇంత అందగతిని నన్ను ఈ రాయి కి పెళ్లి చేస్తారా? అని గట్టిగ కేకలు పెట్టి అడవి అంతా వినపడేలా ఏడుస్తుంది, వేదాంతా ఏడ్పు విని అడవిలోని అన్ని జంతువులూ ఒక్కోటి బయటకు వస్తాయి అన్ని జంతువులూ వచ్చి వేదాంతా ను
అయ్యో తల్లి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు? అని అడుగుతారు కానీ వేదాంత మాత్రం ఇంకా గట్టిగ కేకలు పెట్టి ఏడుస్తుంది ఆ ఏడ్పు వినలేక అడవిలోని జంతువులన్నీ అక్కడి నుండి పారిపోతాయి, కానీ ఒక ఎలుక అక్కడే నిలబడుతుంది, మునిగారు ఎలుకను చూసి ఏంటి అందరు పారిపోయారు నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని అంటారు, అప్పుడు ఆ ఎలుక మునిగారు నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది, ఎలుక గొంతు వినగానే వేదాంత కళ్ళకు తెరిచి చూడగా తనకు ఒక
ఎలుక కనిపిస్తుంది, వేదాంతా ఆ ఎలుకను చూసి నాన్న నాకు ఈ ఎలక బాగా నచ్చింది నేను ఈ ఎలుక తో పెళ్లి చేసుకుంటాను అని అంటుంది, మునిగారికి అప్పుడు తన బిడ్డ కూడా ఒకప్పుడు ఎలుకే అందువల్ల నా బిడ్డ ఎలుకను ఇష్టపడింది అని అనుకుంటారు, వెంటనే వేదాంత ను మల్లి ఎలుకలా మార్చేసి ఆ ఎలుక తో పెళ్లి చేస్తారు, పెళ్లి తరువాత రెండు ఎలుకలు అడవిలోకి వెళ్ళిపోయి తమ జీవితం ఆనందం తో గడుపుకుంటారు అప్పుడప్పుడు అవిచ్చి మునిగారు తో తమ కష్ట సుఖాలు పంచుకుంటారు
Moral Of The Story : మనిషి ఎంత మారిన వాడి గుణం మారదు వాడు ఎప్పటికి అలాగే ఉంటాడు, ఇది సత్యం దీన్ని ఎవ్వరు మార్చలేరు
Soo Friends ఇది మన ఈ రోజీ Telugu Neeti kathalu ! మంచి నీతి కథలు మీ అందరికి నచ్చింది అనుకుంటాను, రేపు ఇంకా మంచి నీతి కథతో మల్లి మీ ముందు ఉంటాను ఇట్లు మీ friend Jyoth Bye And take Care
Also Read These Stories : Top 2 Small Stories In Telugu ! మంచి నీతి కథలు కావాలి
Top 2 Neeti Kathalu In Telugu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు
Top 2 Friendship Moral Stories In Telugu ! మంచి నీతి కథలు
Top 3 Telugu Moral Stories ! మంచి నీతి కథలు