Hii Friends నా పేరు Neha నేను ఈ రోజు మీ అందరి కోసం Top 15 Moral Stories In Telugu ! 15 నీతి కథలు తీస్కొని వచ్చేసాను, కథలు పూర్తిగా చదివి మీ అభిప్రయం కామెంట్ చేసి తెలియ చేయండి

1. పులి మరియు ఎలుక కథ ! Moral Stories In Telugu
అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది ఆ పులి కి బాగా నిద్రా వచ్చి అది ఒక చెట్టు కింద పడుకుంటుంది, ఆ చెట్టు మీద ఒక ఎలుక కూచుని ఉంటుంది ఎలుక కిందికి దిగి పడుకున్న పులి వీపు పై ఎక్కి ఆడుకుంటూ ఉంటుంది ఇందువల్ల పులి పులి నిద్ర లేచి కోపం తో ఎలుకను పట్టుకొని నేను నిన్ను తినేస్తాను అని అంటుంది, ఎలుక భయం తో పులి రాజు పులి రాజు నన్ను వదిలేయండి ఇంకో సారి నేను మీకు disturb చేయను, భవిష్తలో మీకు ఏదైనా సహాయం సహాయం కావాలంటే నేను మీకు సహాయం చెసాతాను అని అంటుంది, ఆ ఎలుక మాటలు విని పులి గట్టిగ నవ్వుతుంది, నువ్వు ఒక చిన్న ఎలుక నువ్వు నాకు ఏమి సహాయం చేస్తావు అని అంటుంది, సరే వెళ్ళిపో అని ఎలుకను వదిలేస్తుంది
కొన్ని రోజులు అయ్యాక ఆడవారిలో ఒక వేటగాడు వేట చేయడానికి వసతాడు, పులి పడుకొని ఉంటుంది ఆ వేటగాడు పులి పై తన వల విసిరి పులి ని పట్టుకుంటాడు పులి గట్టిగ అరుస్తుంది, ఆ అరుపులు విని ఎలుక పరిగెత్తుకుంటూ వచ్చి వేటగాడితో చాలా రిక్వెస్ట్ తో పులి ని వదిలేయండి అది చాలా మంచి పులి అని అంటుంది కానీ వేటగాడు ఓయ్ ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఎలుక ని తరిమేస్తాడు, ఎలుక నేరుగా వెళ్లి వల ను తన పళ్లతో కొరికి పులి ప్రాణాలు కాపాడుతుంది
Moral Of The Story : మనకు ఎప్పుడైనా ఎవరితో ఐన అవసరం పడొచ్చు, ఎవరికి తక్కువ అంచనా వేయకూడదు
2. అత్యాశకరమైన పులి Moral Stories In Telugu
అది వేసవి కలం ఒక పులి ఆకలి తో అల్లాడి పోతుంది ఆ పులి 3 రోజుల నుండి అన్నం తినలేదు షికారు కోసం పులి అడవిలో బయలుదేరుతుంది ఆ పులికి ఒక కుందేలు కనిపిస్తుంది పులి దాన్ని తినకుండా వదిలేస్తుంది ఎందుకంటె ఆ కుందేలు చాలా చిన్నగా ఉంటుంది, ఆలా ఇంకొంచం ముందుకు వెళ్తుంది అక్కడ పులికి ఒక జింక కనపడుతుంది పులి దాన్ని పట్టుకోడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ జింక పులి చేతికి రాదు అది పులి నుండి తపించుకుని పారిపోతుంది పులి దాని వెనుక పరిగెత్తి లేదు ఎందుకంటె అది 3 రోజుల నుండి ఏమి తినలేదు
పులి ఆకలి ఏడుస్తూ ఒక కొండా దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది అప్పుడు దానికి ఆ కుందేలు గుర్తుకు వస్తుంది ఆకలి తో ప్రాణం పోయేటట్టు ఉంది అని వెళ్లి ఆ కుందేలు నే తినేస్తుందాము అని పులి ఆ కుందేలు ఉన్న చోటుకి వెళ్లి చూస్తుంది కానీ పులి కి కుందేలు కనిపించదు ఎందుకంటె ఆ కుందేలు అక్కడి నుండి వెళ్ళిపోతుంది, చేసేది ఏమి లేక పులి ఆకలి తో అలాగే ఉండిపోతుంది
Moral Of The Story : ఉన్నపుడే ఏదైనా వాడుకోవాలి లేదంటే నీకు మిగిలేది ఏడుపే
3. సూదిలా వర్షం ! Moral Stories In Telugu
ఒక ఊర్లో ఇద్దరు అన్న తమ్ముళ్లు ఉండేవారు, అన్న తన తమ్ముడి పై కొంచం కూడా ప్రేమగా ఉండేవాడు కాదు, తమ్ముడి అన్నం లోకొని తినేసేవాడు తమ్ముడి ని రోజు కొట్టేవాడు, కానీ తమ్ముడు తన అన్నాను ఏమి అనే వాడు కాదు, ఒక రోజు డబ్బులు లేకపోవడం వాళ్ళ అన్న తన తమ్ముడితి తో ఒరేయ్ నేను అడవికి వెళ్లి కొన్ని చెట్లు నరికి వాటిని అమ్మి డబ్బులు తెస్తాను నువ్వు ఇంట్లో ఉంది నా బట్టలు ఉతికి అన్నం వండి పెట్టు అని వెళ్ళిపోతాడు, గోడలి పట్టుకొని అడవికి బయలుదేరుతాడు అక్కడ కొన్ని చెట్లు నరుకుతాడు ఆలా చెట్లు నరుకుతూ ముందుకు వెళ్తాడు వెళ్తూ వెళ్తూ వాడు ఒక Magic Tree దగ్గరికి వెళ్లి దాన్ని నరకడం మొదలు పెడతాడు ఆ Magic Tree ఒరేయ్ బాబు నన్ను నరకావొద్దు అని అంటుంది, అపుడు వీడు అంటాడు నిన్ను నరుకుతే నాకు డబ్బులు వస్తాయి
నిన్ను తప్పకుండ నరుకుతాను అని అంటదు, అప్పుడు Magic Tree నేను నీకు ఒక కిలో బంగారం ఇస్తాను అని అంటుంది, అప్పుడు వీడు అత్యాశ పది నాకూ కిలో బంగారం సరిపోదు నాకు 10 కిలోలు బంగారం కావాలి లేదంటే నేను నిన్ను నరికేస్తా అని Magic Tree ని బెదిరిస్తాడు, Magic Tree కి కోపం వచ్చి వాడి పై సూదిలా వర్షం కురిపిస్తుంది, ఆ సూదిలా వర్షం లో వాడు బాగా గయా పది నేలమీద పది వామ్మో నొప్పి వామ్మో నొప్పి అని కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటాడు, ఆలా చీకటి పడుతుంది ఇక్కడ
ఇంట్లో తన అన్న ఇంకా రాలేదు అని తమ్ముడు అన్నాను వెతకడానికి అడవికి బయలుదేరుతాడు చాల సేపు వెతికాక Magic Tree దగ్గర తన అన్న పది ఉండడం చూసి అన్న నీకు ఏం అయ్యింది అంటూ గట్టిగ అరుస్తూ అన్న దగ్గరికి చేరుకొని వాడికి గుచ్చుకున్న సుదీలు తీస్తూ ఉంటాడు, అప్పుడు అన్న ఒరేయ్ తమ్ముడు నేను నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను నను క్షమించు రా అని తమ్ముడు తో అంటాడు, తమ్ముడు మనలో మనకు క్షమాపణ ఏంటన్న అని అంటాడు, Magic Tree వీళ్ళ ఇద్దరి ని చూసి, మీరు ఎప్పుడు ఇలాగె కలిసి ఉండాలని ఇద్దరికీ 2 కిలోలు బంగారం ఇచ్చి పంపిచేస్తుంది
Moral Of The Story : మనము ఎప్పుడు అందరితో కలిసి మెలిసి ఉండాలి, అందరితో బాగున్నవాళ్లకే దేవుడు కూడా కరుణిస్తాడు
4. బంగారం గొడ్డలి ! Moral Stories In Telugu
ఒక ఊర్లో మణి అనే వ్యక్తి ఉండేవాడు, అతను చెట్లు నరికే పని చేసేవాడు ప్రతి రోజు లాగే తన గొడ్డలి తీసుకోని చెట్లు నరకడానికి అడవి కి బయలు దేరాడు, చాల దూరం వెళ్ళాక అతనికిబ్ నది పక్కన ఒక చేటు కనిపించింది, అతను ఆ చెట్టు నరకడం మొదలుపెట్టాడు అంతలో అతని చేతిలో నుంచి గొడ్డలి జారీ నదిలో వెళ్లి పడింది, ఆ నది చాల లోతు గా ఉండడం వల్ల ఇంకా ఆ గొడ్డలి రాదు అని నది పక్కన కూర్చొని మణి గట్టిగ కేకలు పెట్టి ఏడుస్తున్నాడు, అంతలో నది లో నుంచి ఒక దేవత ప్రతీక్షమై ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది, మణీ జరిగిందంతా ఆ దేవత తో చెప్తాడు
దేవత నువ్వు ఏడవకు నేను నీకు ని గొడ్డలి తీసుకొచ్చి ఇస్తాను అని నది లోకి వెళ్లి ఒక వెండి గొడ్డలి తీసుకొచ్చి ఇస్తుంది, వెండి గొడ్డలి ని చూసి మణీ ఈ గొడ్డలి నాది కాదు అని అంటాడు, దేవత మల్లి నదిలోకి వెళ్లి ఈ సారి బంగారం గొడ్డలి తెస్తుంది ఆ బంగారం గొడ్డలి చూసి మణి ఇది కూడా కాదు అని అంటాడు, దేవత ఇంకోసారి నదిలోకి వెళ్లి ఈ సారి ఇనుప గొడ్డలి తెస్తుంది ఆ ఇనుప గొడ్డలి ని చూసి మణీ నవ్వుతూ ఇదే నా గొడ్డలి అని అంటాడు, దేవత వాడి మంచితనం చూసి వాడికి వెండి బంగారం తో పాటు వాడి ఇనుప గొడ్డలి కూడా ఇస్తుంది
Moral Of The Story : ఈ కథ తో మనం నేర్చికోవాల్సింది మనము ఎప్పుడు న్యాయంగా ఉండాలి మనకు దక్కాల్సింది మనకే దక్కి తీరుతుంది
5. ఏనుగు కథ ! Moral Stories In Telugu
చాల ఏళ్ళ క్రితం ఒక ఏనుగు నీళ్ల కోసం వెతుకుంటూ వెతుకుంటూ పక్క అడవిలోకి వెళ్ళిపోతుంది, అక్కడ ఉన్న జంతువులన్నీ ఆ ఏనుగు ని విచిత్రంగా చూస్తాయి, ఏనుగు తో ఎవ్వరు మాట్లాడారు ఏనుగు ఒక్కటే ఒక చెట్టు కింద కూర్చొని బాధ పడుతుంది, అప్పుడే ఆ చెట్టు మీద ఏనుగు కి ఒక కోతి కనిపిస్తుంది వెంటనే ఏనుగు “నమస్తే కోతి గారు మీరు నాతొ friendship చేస్తారా అని అడుగుతుంది అప్పుడు కోతి నువ్వు నాలాగా చెట్లు ఎక్కలేవు నీతో నేను friendship చేయను అని అంటుంది
ఇప్పుడు ఏనుగు కుందేలు దగ్గరికి వెళ్లి నమస్తే కుందేలు గారు మీరు నాతొ friendship చేస్తారా అని అడుగుతుంది, కుందేలు నువ్వు నా లాగ పరిగెత్త లేవు కదా నీకు నాకు friendship అసంభవం ఇక్కడినుండి వెళ్ళిపో అని అంటుంది, ఈ సారి ఏనుగు రెండు కప్పల దగ్గరికి వెళ్లి మీరు నాతొ friendship చేస్తారా అని అడుగుతుంది, రెండు కప్పలు ఒకరిని ఒకరు చూసి నవ్వుకుంటూ నువ్వు మా లాగ నీళ్లలో ఉండలేవు నీతో మేము friendship చేయలేము అని అంటాయి, చేసేది ఏమి లేక ఏనుగు బాధ పడుతూ కూర్చుంటుంది
అప్పుడే ఒక్కసారిగా అడవిలో జంతువులూ ఒక్కసారిగా హడ విడి తో పరిగెత్తడం మొదలు పెడతాయి ఏనుగు వెళ్లి ఒక పావురం తో అసలు ఏమి అయ్యింది వీళ్లంతా ఎందుకు పరిగెత్తుతున్నారు అని అడుగుతుంది, అప్పుడు పావురం అంటుంది పులి వేటకు వచ్చింది పులి నుండి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అందరు పరిగెత్తుతున్నారు అని అంటుంది, వెంటనే ఏనుగు పులి దగ్గరికి వెళ్లి పులి రాజా వీళ్ళని ఎందుకు చాపుతావు, అందరికి బ్రతికే హక్కు ఉంది దయ చేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది, ఇది వినగానే పులికి కోపం వచ్చి ఏనుగు పై దాడి చేస్తుంది
ఏనుగు కి కూడా కోపం వచ్చి తన తొండం తో పులి తోక పట్టుకొని పులి ని విసిరేస్తుంది పులి భయం తో పరుగులు తీసుకుంటూ వెళ్లి పోతుంది, పులి వెళ్ళిపోయాక అడవిలోని అన్ని జంతువులూ ఒక్కోటి బయటకు వచ్చి నువ్వు మా అందరి ప్రాణాలు కాపాడావు, మాకు నీలాంటి స్నేహితుడు చాల అవసరము అని ఏనుగు తో friendship చేసుకుంటాయి
Moral Of The Story : మనిషి ఆకారం చూసి వాళ్లకు వ్యాకరించడం చాలా తప్పు, ఆకారం లోపల ఉన్న మనిషిని గుర్తించడం చాలా ముఖ్యం
6. ఆలుగడ్డ,గుడ్డు,కాఫీ ! Moral Stories In Telugu
ఒక అబ్బాయి ఉండేవాడు అతని పేరు రాజు, రాజు ఏడ్చుకుంటూ కూర్చుంటాడు అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి ఒరేయ్ రాజు ఏమైంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు అప్పుడు రాజు అంటాడు నాన్న నా జీవితం లో చాలా బాధలు ఉన్నాయి అందుకే ఏడుస్తున్నాను అని అంటాడు అప్పుడు రాజు వాళ్ళ నాన్న రాజు కి వెళ్లి ఒక ఆలుగడ్డ, ఒక గుడ్డు,కొంచం కాఫీ పొడి తీస్కొని రా అని అంటాడు, నాన్న చెప్పినట్టే రాజు వెళ్లి ఒక ఆలుగడ్డ, ఒక గుడ్డు,కొంచం కాఫీ పొడి తీసుకోని వస్తాడు
రాజు వాళ్ళ నాన్న అవన్నీ తీసుకోని ఒక గిన్నె లో వేసి బాగా మారగా పెడతాడు, అవన్నీ బాగా మరిగి చల్లారాక రాజు ని దగ్గరికి పిలిచి ఆలుగడ్డ ఎలా ఉంది చెప్పు అని అంటాడు రాజు ఆలుగడ్డ ని పట్టి నాన్న ఇప్పుడు ఆలుగడ్డ బాగా మెత్తగా అయిపోయింది గుడ్డు బాగా గట్టిగ అయ్యింది కాఫీ పొడి నీళ్లలో కలిసి పోయింది అని అంటాడు,అప్పుడు రాజు వల్ల నాన్న ఒరేయ్ బాబు మన జీవితం కూడా ఇంతే కష్ట సుఖాలు వాస్తు పోతూ ఉంటాయి మనం దాని గురించి ఎక్కువగా అలోచించి మన ఆరోగ్యం పాడు చేసుకోకూడదు అని అంటాడు
Moral Of The Story : కష్ట సుఖాలు మనిషికి సహజమే, దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు
7. రెండు కప్పల కథ ! Moral Stories In Telugu
ఒక గ్యాంగ్ వెళ్తూ ఉంటుంది అందులో నుంచి రెండు కప్పలు ఒక పెద్ద బావిలో పడి పోతాయి ఆ రెండు కప్పలను కాపాడేందుకు మిగిలిన కప్పలు చాల ప్రయత్నాలు చేస్తాయి, బావి బాగా లోతు ఉండడం వల్ల వాళ్ళు చేసిన అన్ని ప్రయత్నాలు వృధా అయిపోతాయి ఇంకా లాభం లేదని, బావిలో పడ్డ రెండు కప్పుతో అంటాయి మేము చాలా ప్రయత్నించాము కానీ బావి బాగా పెద్దగా ఉండడం వల్ల మీ ఇద్దరికీ బయటకి తియ్యలేక పోయాము ఇంకా మీరు ఇద్దరు చావాల్సిందే వేరే మార్గం లేదు అని అంటాయి, ఇది వినగానే ఒక కప్పు భయం తో వెంటనే చచ్చి పోతుంది,
మిగిలిన ఇంకో కప్పు చాల ప్రయత్నాలు చేసి ఒక పెద్ద Jump చేసి బావి పైకి వచ్చేస్తుంది, ఆ కప్పును ని చూసి ఇతర కప్పలు ఇంత లోతు బావిలో నంచి ఇది పైకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తాయి, ఇక్కడ అసలు విషయము ఏంటంటే ఆ కప్పు చెవిటిది దానికి చెవులు వినపడవు, అందు వల్ల ఇతర కప్పలు చెపింది దానికి వినపడలేదు, ఇంకో కప్పు ఇతర కప్పలు చెప్పింది విని ఇంకా నాకు చావు తప్పదని భయం తో చనిపోయింది
Moral Of The Story : జీవితం లో మనకు చాల మంది నెగెటివ్ గా చెప్తూ ఉంటారు, వాళ్ళ మాటలు వినకూడదు నీకు ని పై విశ్వసం ఉంటె నువ్వు దేనివైనా సాధిస్తావు
8. బుద్ధి లేని గాడిది ! Moral Stories In Telugu
అనగనగ ఒక వ్యాపారవేత్త ఉండేవాడు అతని దగ్గర ఒక గాడిద ఉండేది, అతను తన గాడిద పై వేరే ఊర్లకు వెళ్లి ఉప్పు అమ్మేవాడు, అతను వేరే ఊర్లకు వెళ్లాలంటే ఒక నది దాటి వెళ్ళాలి ఉప్పు సంచులు గాడిద వీపు పై పెట్టి నది దాటి వెళ్ళేవాడు, ఒక రోజు నది దాటుతూ ఉండగా గాడిద వీపు పై పెట్టి ఉన్న ఉప్పు సంచి నీళ్లలో పడిపోయింది, ఉప్పు సంచి నీళ్లలో పడగానే ఉప్పు మొత్తం నీళ్లలో కరిగిపోయింది అందువల్ల గాడిద కి బరువు తగ్గింది, గాడిది తనకు బరువు తగ్గిందని చాలా సంతోషించుతుంది ఇక
ప్రతి రోజు గాడిద ఇలాగె కావాలని ఉప్పు సంచులను నీళ్లలో పడేసేది ఇందు వాళ్ళ ఆ వ్యాపారవేత్త కి చాల నష్టం వచ్చేది, ఇలాగె ప్రతి రోజు జరిగేది గాడిద వేసిన plan ఆ వ్యాపారవేత్త కి అర్థమయ్యింది అతను రెండవ రోజు కొన్ని దూది సంచులు గాడిద పై పెట్టి నది దాటుతున్నాడు, ఆ గాడిద ఆ దూది సంచులు కూడా నీళ్లలో పడేసింది, ఆటను వెంటనే దూది సంచులని ఎట్టి మల్లి గాడిద పై పెట్టాడు కానీ ఈ సారి గాడిది కి బరువు ఎక్కువయ్యి దాన్ని మొయ్యలేక పోతుంది ఓ పక్క వ్యాపారవేత్త గాడిది కి కర్ర తో కొడుతూ ముందుకు తోస్తున్నాడు
Moral Of The Story :మామంము ఎప్పుడు ఎవ్వరికీ నష్టం చేయకూడదు, ఏదో రోజు ఆ పాపం మనకే చుట్టూ కుంటుంది
9. ముసలివాడి కథ ! Moral Stories In Telugu
ఒక ఊర్లో ఒక ముసలివాడు ఉండేవాడు, అతను చాల కోపం గలవాడు ఊర్లో ప్రతి ఒక్కరి తో గొడవ పడేవాడు, అతనితో ఎవ్వరు మాట్లాడేవారు కాదు పోదున్నే లేచి అయన మొకం చుస్తే కూడా దరిద్రము అని అతని మొకం కూడా చూసేవారు కాదు, ఆ ముసలి వాడిని నవ్వుతు ఎవ్వరు చూడలేదు ఎప్పుడు ఏడ్చేవాడు అందరితో లొల్లి పెట్టుకునే వాడు
కానీ ఒక రోజు ఆ ముసలివాడు గట్టిగ నవ్వు తున్నాడు ఊర్లో వాళ్ళఅందరితో మాట్లాడుతున్నాడు ఆ ఊర్లో వాళ్ళందరూ అశేర్యం తో ముసలోడి ఇంటికి వెళ్లి మేము నిన్ను నవ్వుతు ఎప్పుడు చూడలేదు అసలు ఏంటి కారణం ఎందుకు అంత నవ్వుతున్నావు అని అడిగారు, అప్పుడు ఆ ముసలైన అన్నాడు ఈ రోజు నేను 80 సంవత్సరాలు పూర్తీ చేసుకున్నాను, నేను గత 80 సంవత్సరాలు ఆనందం కోసం వెతుకుతున్నాను కానీ నాకు ఆనందం ఎక్కడ దొరకలేదు అందుకే నేను మిగిత జీవితం ఆనందం తో గడిపాలి అని అనుకుంటున్నాను అని అంటాడు
Moral Of The Story : ఆనందం కోసం వెతకడం ఒక మూర్ఖత్వం, ఆనందం తో బ్రతకడం నేర్చుకోవాలి
10. ఒక రాజు కథ ! Moral Stories In Telugu
చాలా ఏళ్ళ క్రితం ఒక రాజు కావాలని ఒక కొండను దారికి అడ్డంగా పెట్టించాడు, ఆ రాజు కూడా అక్కడే ఒక చెట్టు వెనక నిలబడి ఆ కొండను ఎవ్వరు తీస్తారో చూస్తున్నాడు, దారిన వచ్చి పోయే వాళ్ళు ఆ కొండను దాటి దాటి వెళ్తున్నారు కానీ కొండను ఎవ్వరు పక్కకు తీయడం లేదు, మహారాజు మంత్రులు కూడా ఆ కొండను దాటుతూ రాజు ని తిట్టుకుంటూ వెళ్తున్నారు, రాజు భార్య కూడా ఆ కొండా ను చూసి రాజు కి ఇష్టం వాచినట్టు తిట్టుకుంటూ వెళ్తుంది కానీ ఏ ఒక్కరు కూడా ఆ కొండా ను ముట్టుకోలేదు
అంతలో అక్కడికి ఒక కూరగాయలు అమ్ముకొనే వ్యక్తి వస్తాడు కొండా ను చూసి అయ్యో ఈ కొండా దారికి అడ్డంగా ఉందని తన కూరగాయలు ముఠా పక్కన పెట్టి వెళ్లి కొండను తీయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇదంతా రాజు చెట్టు వెనక దాక్కొని చూస్తున్నాడు చాల ప్రయత్నం చేసాక ఆ వ్యక్తి కొండను దారి లో నుంచి పక్కకు నెట్టి తన కూరగాయలు ముఠా తీసుకోడానికి వచ్చాడు, అతని కూరగాయలు ముఠా లో కూరగాయలకు బదులుగా బంగారు నాణేలు ఉన్నాయి ఇదంతా చూసి ఆ వ్యక్తి వచ్చెర్యం తో అటు ఇటు చూస్తున్నాడు అప్పుడే రాజు వచ్చి ఆ బంగారు నాణేలు నేనే పెట్టాను, నువ్వు చేసిన పనికి ఇది చాల తక్కువ అని అంటాడు
Moral Of The Story : మన జీవితం లో వచ్చే బాధల గురించి మనము అలోచించి వాటికీ భయపడి మన దారి మార్చకూడదు, కష్టాలతో పోరాడేవాడు మనిషి
11. నక్క కథ ! Life Changing Moral Stories In Telugu
అనగనగ ఒక నక్క ఉండేది దానికి బాగా ఆకలి వేస్తుంది 2 రోజుల నిండా ఏమి తినలేదు మేత కోసం చాలా వెస్టికింది కానీ ఆ నక్క కు తినడానికి ఏమి దొరకలేదు, ఆలా నక్క వెతుండగా దానికి ఒక ద్రాక్ష తోట కనిపించింది నక్క ఎంతో సంబరపడిపోయి హమ్మయ్య ఇక నా ఆకలి తీరినట్టే అని ద్రాక్ష తోట లోకి వెళ్ళింది కానీ ద్రాక్ష పళ్ళు చాలా పైకి ఉన్నాయి అందువల్ల నక్క యెంత ప్రయత్నించినా ద్రాక్ష పళ్ళు నక్క చేతికి రాలేదు
అసలే బాగా ఆకలి మీద ఉన్న నక్కకు ద్రాక్ష పళ్ళను చూసి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి నక్క చివరి సారిగా ఒక పెద్ద Jump చేసి మల్లి ప్రయత్నించింది ఐన ద్రాక్ష పళ్ళు దానికి చిక్కలేదు, చేసేది ఏమి లేక నక్క ఇంటికి వెళ్తూ వెళ్తూ మనసులో అనుటుకుంటుంది ఆ ద్రాక్ష పళ్ళు నేను తినలేదు మంచిదే అయ్యింది లే, ఎందుకంటె ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయి అని దాన్ని అదే సద్ది చెప్పుకుంది
Moral Of The Story : కొన్ని సార్లు మనము దేన్నైనా ఇష్టపడతాము అది మనకు దక్కదు, ఇంకా మనము అదే ఆలోచన లో పది మన time వేస్ట్ చేసుకుంటాము, అందుకని మనకు దక్కని దాన్ని గురించి అలోచించి మన time వేస్ట్ చేసుకోకుండా జీవితం లో ముందుకు వెళ్ళిపోవాలి
12. అహంకారి ! Inspirational Short Moral Stories in Telugu
ఒక పెద్ద ఎడారి లో ఒక గులాబి పువ్వు మొక్క ఉండేది దానికి తన అందం పై చాలా గర్వం ఉండేది దానంతట అది నేను బాగా అందంగా ఉన్నాను నాకంటే అందంగా ఎవ్వరు లేరు అని నుకునేది, ఆ గులాబీ మొక్క పక్కనే ఒక కాక్టస్ మొక్క కూడా ఉండేది గులాబీ మొక్క ప్రతి రోజు కాక్టస్ మూక ను చూసి చి చి నువ్వు యెంత దరిద్రంగా ఉన్నావు నన్ను చూడు నేను యెంత ఎర్రగా యెంత అందంగా ఉన్నాను అని దానికి కి ఏడ్పించేది కానీ కాక్టస్ గులాబీ ని ఏమి అనక పోయేది,
ఒకసారి బాగా ఎండ వచ్చింది అందువల్ల గులాబీ మొక్క నెమ్మదిగా తన అందాన్ని కోల్పోతుంది రోజు రోజు కి నల్ల బడిపోతుంది, అప్పుడు ఒక గద్ద వచ్చి కాక్టస్ మొక్కలో ఉన్న నీళ్ళని తాగుతుంది, గులాబీ ఇదంతా చూసి కాక్టస్ నేను నిన్ను చాల బాధ పెట్టాను నన్ను క్షమించి నాకు కూడా ని మొక్కలో నుంచి కొన్ని నీళ్లు ఇవ్వు లేదంటే నను చని పోతాను అని అంటుంది, కాక్టస్ ఒక్క్కసారి కూడా ఆలోచించ కుండా గులాబీ పువ్వు కి నీళ్లు ఇస్తుంది ఇందువల్ల గులాబీ మొక్క మల్లి జీవిస్తుంది
Moral Of The Story : ఎప్పుడు మనిషి అవతారం, వాడి బట్టలు, వాడి మాటలను చూసి వీళ్ళని యెగతాళి చేయకూడదు
13. బుద్ధిమంతుడు ! Akbar Birbal Short Moral Stories in Telugu
friends మనం అందరము అక్బర్ బీర్బల్ కథలు చాల విని ఉంటాము కదా అందులో ఇదొకటి, ఒక రోజు మహా రాజు అక్బర్ బీర్బల్ తో, బీర్బల్ నువ్వు చాలా చాల తెలివిగల వాడివి అని అందరు అంటూ ఉంటారు ఐతే ఈ రోజు నేను నీకు ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా అని ఆడుతాడు అక్బర్, బీర్బల్ తప్పకుండ మహారాజా ఏంటి మీ ప్రశ్న అని అంటాడు అప్పుడు అక్బర్ అంటాడు, బీర్బల్ మన రాజ్యం లో ఎన్ని కేకకి లు ఉన్నాయో నువ్వు చెప్పగలవా అని అడుగుతాడు, కాసేపు బీర్బల్ మౌనంగా ఆలోచిస్తాడు అప్పుడు అక్బర్ నవ్వుతు ఏంటి బీర్బల్ ఆలోచిస్తున్నావు? నీకు తెలీదా మన
రాజ్యం లో ఎన్ని కాకి లు ఉన్నాయో నాయి అంటాడు, అప్పుడు బీర్బల్ అంటాడు మాహరాజ్ మాన రాజ్యంలో మూడు లక్షల తొంబై వేల మూడు వందల పది కాకులు ఉన్నాయి అని అంటాడు, అక్బర్ అంత కర్రెక్టుగు ఎలా చెపుతున్నావు అని అంటాడు అప్పుడు బిర్బాల్ తన తెలివిని ఉపయోగించి మహారాజా నిన్న నేను లెక్కపెట్టను మీకు నా మీద నమ్మకం లేకపోతె మీరు మీ సైనికులను పంపి లెక్కపెట్టిన్చుకొంది అని అంటాడు, మూడు లక్షల తొంబై వేల మూడు వందల పది కాకులను లెక్కపెట్టడం అసంభవం అది అక్బర్ కి కూడా తెలుసు, అక్బర్ నవ్వుతు బీర్బల్ బిజూజమ్ పై చెయ్యి పెట్టి బీర్బల్ నిన్ను ఓడించడం నా వల్ల కాదు అని బీర్బల్ ని బంగారు నాణేలతో సన్మానిస్తాడు
Moral Of The Story : ఈ కలం లో తెలివిగా మాట్లాడం నేర్చుకోవాలి, లేదంటే బ్రతకడం చాలా కష్టం
14. ఆశ దురాశ ! Motivational Short Moral Stories in Telugu
అనగనగా ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు చాలా అత్యాశకరమైన మనిషి అతనికి డబ్బు బంగారం అంటే చాలా ఇష్టం, ఒక రోజు అతను పొలం లో వెళ్తుండగా అతనికి ఒక సాధు బాబా కింద పడి కనిపిస్తాడు అతను దాహం తో నీళ్లు నీళ్లు అని అరుస్తూ ఉంటాడు అప్పుడు ఆ వ్యక్తి ఆ బాబా దగ్గరికివెళ్ళి మీరు ఎవరు మీకు ఏమి కావలి అని అంటాడు, అప్పుడు ఆ బాబా అంటాడు నేను ఒక మాయ పకీరుని నేను మంత్రాలతో అన్ని సృశిటించగలను అని అంటాడు, అప్పుడు ఆ వ్యక్తి కి అత్యాశ పుట్టుకు వస్తుంది వాడు బాబా తో అంటాడు బాబా నేను నీకు నీళ్లు తెచ్చిస్తాను మరి నాకు నువ్వు ఏం ఇస్తావు అని అడుగుతాడు
బాబా అంటాడు నీకు ఏం కావలి చెప్పు నీకు తప్పకుండా ఇస్తాను అని అంటాడు, వ్యక్తి బాగా అలోచించి బాబా నేను ముట్టుకుండల్లా బంగారం అయిపోవాలి అని అంటాడు బాబా నీళ్లు తాగి తధాస్తు అని వెళ్ళిపోతాడు, ఆ వ్యక్తి ఒక రాయి పట్టుకుంటాడు వెంటనే రాయి బంగారం గా మారిపోతుంది ఆనందం తో ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి తన బిడ్డను పట్టుకుంటాడు తన బిడ్డ కూడా బంగారం గా మారిపోతుంది, అప్పుడు ఆ వ్యక్తి తన తప్పు ని స్వీయకరించి ఏడుసుకుంటూ బాబా దగ్గరికి వెళ్తాడు కానీ అప్పటికే బాబా అక్కడినుండి వెళ్ళిపోతాడు
Moral Of The Story : అతిగా ఆశా మనిషి కి హాని చేస్తుంది
15. నక్క మరియు కొంగ కథ
అనగనగా ఒక అడవిలో ఒక కొంగ ఒక నక్క ఉండేవాళ్ళు, వాళ్లిద్దరూ మంచి స్నేహితుతులు ఒక రోజు నక్క కొంగ తో, కొంగ కొంగ ఈ రోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది నువ్వు తోఁప్పకుండా రవళి అని అంటుంది, కొంగ చాల సంతోషం తో నక్క ఇంటికి వెళ్తుంది, కానీ నక్క తన తోంది బిద్ధి చూపిస్తుంది, నక్క ఒక పెద్ద గిన్నె వేడి వేడి soup తీసుకొచ్చి కొంగ తో ఈ soup మనం ఇద్దరం కలిసి తాగుదాము అని అంటుంది soup వేడి గా ఉండడం వల్ల కొంగ తన చిన్న నాలుక తో తాగాలని చాల ప్రయత్నిస్తుంది కానీ దాని వల్ల కాలేదు ఇంకో పక్క నక్క తన పెద్ద నాలుక తీసి పట పట soup తాగేస్తుంది, కొంగ కి కోపం వచ్చి నక్క తో రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది నువ్వు తప్పకుండ రావాలి అని అంటుంది
నక్క కూడా కొంగ ఇంటికి వెళ్ళిపోతుంది, కొంగ తనకు జరిగిన అన్యాయం గుర్తు పెట్టుకొని ఏ సారి, కొంగ soup తెస్తుంది ఆ soup ఒక గ్లాసు లో పోసుకొని తెస్తుంది గ్లాసు పొడవుగా సన్నగా ఉండడం వాళ్ళ నక్క నాలుక soup దాకా వెళ్ళాడు ఇంకో పక్క కొంగ తన పొడవైన మూతి గ్లాసు లో పెట్టి పట పట soup తాగేస్తుంది
Moral Of The Story : ఎదుటి వాళ్లతో మనం ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు కూడా మన తో అలాగే ప్రవర్తిస్తారు
Soo friends ఇవి మన 15 moral stories ! నీతి కథలు మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను
Also Read These Stories : Telugu Kathalu ! తెలుగు కథలు
Telugu Stories With Moral ! నీతి కథలు తెలుగు
Friendship Moral Stories In Telugu ! Friendship నీతి కథల
Neethi Kathalu In Telugu ! నీతి కథలు తెలుగులో
Moral Stories In Telugu 2 {Part 2} తెలుగు నీతి కథలు 2