Top 2 Best Moral Stories In Telugu ! తెలుగు నీతి కథలు

Hii Friends నా పేరు Anjali ఈ రోజు నేను మీ కోసం Top 2 Best Moral Stories In Telugu ! తెలుగు నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయం Comment చేసి తెలియచేయండి, ప్రతి సారి నేను రాసిన కథలు మీ friends కి share చేస్తారని ఆశిస్తున్నాను

1. అహంకారం ! Telugu Moral Stories On Friendship

అనగనగ ఒక రాజ్యం లో కుమార్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు, అందరూ ఆయనను చాలా తెలివిగల వాడు అని అనేవారు నిజానికి ఆయన తెలివి గల వాడే అయన తెలివితేటలు చూసి ఆ రాజ్యంలో ఉన్న రాజు ఆయనను పిలిచి నువ్వు బాగా తెలివి గల వాడివి నీలాంటి వాళ్ళు మన రాజ్యానికి చాలా అవసరం ఈ రోజు నుంచి నిన్ను నా మంత్రిగా పెట్టుకుంటున్నను నికు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పు అని అంటాడు, కుమార్ నవ్వుతూ రాజుగారు మీరు నన్ను మీ మంత్రిగా పెట్టుకుంటున్నారు అంతకన్నా మించి నాకు ఏం

కావాలి నేను తప్పకుండా మీకు మంత్రిగా ఉంటాను అని కుమార్ రాజు కి మత్రుగా ఉండిపోతాడు కొన్ని రోజుల తరువాత కుమార్ యొక్క అమ్మాయి పెళ్లి కుదురుతుంది, అప్పుడు కుమార్ రాజు తో సహా ఆ రాజ్యంలో ఉన్న మత్రులందరికి పెళ్లి కి ఆహ్వానిస్తాడు, రాజు తో సహా మంత్రులందూ వస్తారు కానీ రాజు తో సహా అయన దగ్గర పని చేసే ఒక సేవకుడు కూడా వస్తాడు, కుమార్ అతనికి ఆహ్వానించాడు అయిన కానీ అతను వస్తాడు, వచ్చి రాజు కోసం వేసిన కుర్చీ పై కూర్చుంటాడు, ఇది చూసి కుమార్ కి బాగా కోపం వచ్చి

Top 2 Best Moral Stories In Telugu ! తెలుగు నీతి కథలు
Top 2 Best Moral Stories In Telugu

అతని దగ్గరికి వెళ్ళి అసలు నికు బుద్ధి ఉందా? నిన్ను ఎవరు రమన్నరు వేస్తే వచ్చావు రాజు గారికి వేసిన కుర్చీలో కుర్చుంటావ? అని అందరి ముందు అతనికి అవమానించి అక్కడి నుండి తరిమెస్తాడుఆ సేవకుడు బాధ పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళి తనకు జరిగిన అవమానం గురించి తలుచుకొని బాగా ఏడుస్తాడు అప్పుడు ఎలాగైనా సరే కుమార్ తో పగ తీర్చుకోవాలి అనుకుంటాడు ఒక రోజు పడుకున్న గదిలో పని చేస్తున్నట్టు నటించుతు రాజు వినేలా తనలో తానే గట్టిగ ఈ కుమార్ మహారాణి గారికి

అవమానం చేయడం మంచిది కాదు అని గట్టిగ అనుకుంటూ ఉంటాడు, అప్పుడే రాజు నిద్ర లేచి ఓయ్ ఏమన్నవు కుమార్ మహారాణి గారిని అవమానం చేశాడా? ఎప్పుడు చేశాడు ఎలా చేశాడు నాకు చెప్పు నేను కుమార్ కి సిక్షిస్తాను అని అంటాడు, అప్పుడు ఆ సేవకుడు నటిస్తూ అయ్యో రాజు గారు నేను అల అనలేదు అని అంటాడు అని అక్కడి నుండి తన మనసులో నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ రాజు కి కుమార్ నిజంగానే నా మహారాణి నీ అవమానం చేశాడు నీ ఎక్కడో అనుమానం కలిగి, వెంటనే తన

సైనికులకు పిలిచి ఒకవేళ కుమార్ వొస్తే వాడికి లోపలికి అనుమతి ఇవ్వకూడది అని అంటాడు, రెండవ రోజు కుమార్ వస్తాడు కానీ సైనికులు అతనికి లోపలికి అనుమతి ఇవ్వరు ఇదంతా చూసి కుమార్ ఆశ్చర్యం తో అసలు ఏం జరిగింది నన్ను లో లోపలికి ఎందుకు రనివడం లేదు అని అంటాడు, అప్పుడే ఆ సేవకుడు అక్కడికి వచ్చి పక పక నవ్వుతూ కుమార్ గారు ఎలా ఉంది అని అని అయనకల్ల చూసి నవ్వుతాడు,

కుమార్ కి అర్ధం అవ్తుంది నేను వీడికి అవమానం చేశానని వీడు నాకు ఇలా చేశాడు అని, వెంటనే కుమార్ ఆ సేవకుడిని ఆయన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తాడు సేవకుడు కుమార్ ఇటింకి వెళ్తాడు అక్కడికి వెళ్ళాక కుమార్ ఎంతో మర్యాద తో నా వల్ల తప్పు అయ్యింది నేను మీకు అవమనిచను అని క్షమాపణ కోరుకుంటాడు

Moral Of The Story : మనము ఎవ్వరినీ అవమనించకుడడు సమయం వొస్తే వాళ్ళ కూడా మనకు అవమానం చేయడికి రెడీ గా ఉంటారు

2. పంతుల గారి కథ ! Telugu Short Stories With Moral

ఒక ఊర్లో పంతులు గారు ఉండేవారు అయన ప్రతి రోజూ పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసి తిని మళ్లీ పడుకునేవాడు, ఆయనకు పని చేయాలంటే బాగా యాష్టకు వచ్చేది ఆయన ఇంట్లో తన భార్య తో పాటు ఇద్దరు పిల్లలు ఉండేవారు, ఒక రోజు అయన ఇంట్లోనే పడుకొని ఉన్నారు అయన ఇంటి ముందు ఒక సాధు బాబా బిక్షం కోసం వచ్చారు, ఆ సాధు బాబాను చూడగానే పంతులు లేచి అయన దగ్గరికి వెళ్ళి అయన కాళ్ళకు మొక్కి ఆయనను లోపలికి ఆహ్వానించి సాధు గారికి బాగా సేవ చేశాడు పంతులు, ఆ సాధు బాగా

ఆనందించి వెళ్తూ వెళ్తూ పంతులు తో నికు ఏమి వర్ధనం కావాలి చెప్పు అని అంటాడు, పంతులు బాగా ఆలోచించి సాధు గారు నాకు పని చేయాలంటే బాగా యష్టకు వస్తుంది నేను కూర్చున్న దగ్గరే అన్ని పన్లు దానంతట అవే అయిపోయేలా వర్ధనం ఇవ్వడి స్వామి అని అంటాడు, అప్పుడు సాధు బాబా నవ్వుతూ సరే పంతులు గారు నేను మీకు ఒక ఆత్మ ను ఇస్తాను మీరు కూర్చున్న దగ్గరే కూర్చొని దానికి పన్లు చెప్పండి మొత్తం పన్లు అదే చేసుకుంటుంది కానీ దానికి ఎప్పుడు పని ఇస్తూనే ఉండాలి లేదంటే అది మీకు

Top 2 Best Moral Stories In Telugu ! తెలుగు నీతి కథలు

చంపేస్తుంది అని చెప్పి ఆ సదుగారు వెళ్ళిపోతాడు , కాసేపు అయ్యాక ఒక ఆత్మ పంతులు గారి దగ్గరికి వచ్చి పక పక నవ్వుతూ పంతులు గారు చెప్పండి నేను ఏం చేయాలి అని అంటుంది పంతులు మొదట్లో ఆత్మను చూసి భయపడతాడు కానీ నెమ్మదిగా దానికి ఒక పని ఇస్తాడు ఆ పని ఏంటంటే వెళ్లి నా పొలం దున్నిరా అని అంటాడు, ఆ ఆత్మ వెళ్లి ఒకే నిమిషంలో పొలం దున్ని వస్తుంది, వచ్చి ఇంక ఏం పని ఉంది చెప్పండి నాకు ఎల్లపుడూ పని ఇస్తూనే ఉండాలి లేదంటే నేను మీ ప్రాణాలు తీస్తాను అని అంటుంది

పంతులు బాగా ఆలోచించి వెళ్లి వెయ్యి మందికి భోజనాలు తయారు చెయ్యి అని అంటాడు ఆత్మ ఒకే నిమిషం లో వెయ్యి మంది కి భోజనాలు తయారు చేసి వస్తుంది, వచ్చి పంతులు నాకు ఇంకా పన్లు ఇవ్వు లేదంటే నీ ప్రాణాలు తీస్తాను అని అంటుంది పంతులు ఎంత ఆలోచించినా ఆత్మకు పన్లు ఇవ్వలేక పోతాడు ఉన్న పన్లు అన్ని అయోయయి, ఇక ఈ ఆత్మ నన్ను చంపేస్తుంది అని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు అప్పుడు పంతులు భార్య తన భర్త బాధ చూడలేక పంతులు దగ్గరికి వెళ్ళి ఇదంతా మీరు పనిదింగ ఉండడం వల్ల

అయ్యింది, నేను ఈ ఆత్మకు ఒక పని ఇస్తాను ఆ పని ఎప్పడికి పూర్తి కాదు కానీ మీరు ఇంకో సారి పనిదొంగ లా ఉండకుండా మీ పన్లు మీరు చేసుకుంటానని నాకు మాట ఇవ్వండి అని అంటుంది, అప్పుడు పంతులు తన ప్రాణాలు కాపాడేందుకు సరే నేను నికు మాట ఇస్తాను ఇక మీదట నా పన్లు నేను చేసుకుంటాను అని అంటాడు, అప్పుడు పంతులు భార్య ఆత్మతో మా ఇంట్లో ఒక కుక్క ఉంది దాని తోక ఎప్పటికీ వంకరగనే ఉంటుంది వెళ్లి మా కుక్క తోకను తున్నగ చెయ్యి అని ఆత్మకు పని ఇస్తుంది ఆత్మ వెళ్లి కుక్క తోక తిన్నగ

చేయడానికి ఎంత ప్రయత్నం చేసిన అది తిన్నగా అవ్వదు, ఇక ఆత్మ పంతులు దగ్గరికి వచ్చి ఈ కుక్క తోక తిన్నగా చేయాలంటే నా వల్ల కాదు, నన్ను మన్నించండి నేను వెళ్లి పోతున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది, ఇక మీదట పంతులు తన పన్లు తానే చేసుకుంటాడు

Moral Of The Story : మన పన్లు మనమే చేసుకోవాలి ఎవ్వరీ మీద ఆధారపడి ఉండకూడదు, లేదంటే పరిణామాలు చాల ఘోరంగా ఉంటాయి

Also Read These Moral Stories : Top 3 Moral Stories In Telugu

Top 2 Moral stories in Telugu

Neethi Kathalu In Telugu Small Stories 

Best Moral Stories In Telugu 

Leave a Comment

%d bloggers like this: