Hii Friends నా పేరు Navya ఈ రోజు నేను మీ అందరి కోసము Top 2 Best Telugu Moral Stories ! తెలుగు స్టోరీస్ నీతి కథలు చెప్పబోతున్నాను కథలు చాలా బాగుంటాయి పూర్తిగా చదివి comment చేసి మీ అభిప్రాయం తెలపండి.
1. తెలివిగల నక్క ! Top 2 Best Telugu Moral Stories
అనగనగ ఒక అడవిలో ఒక పెద్ద పులి ఉండేది అది ప్రతి రోజు ఇతర జంతువులను చంపి తినేది, అందువల్ల అడవిలోని అన్ని జంతువులు పులిని చూసి బాగా భయపడేవారు, ప్రతి రోజు లాగే పులి ఒక రోజు పొద్దునే వేటకు బయలుదేరింది కానీ ఆ రోజు పిలికి ఒక్క షికారు కూడా చిక్కలేదు, పులికి బాగా ఆకలి వేస్తుంది ఆలా చూస్తూ చూస్తూ చీకటి అయిపోయింది పులికి ఆకలి తో ప్రాణము పోయేటట్టు ఉంది, పులి నెమ్మదిగా తన ఇంటి వైపు తిరిగి వెళ్తుంది అప్పుడే దానికి ఒక గుహ కనిపించింది పులి ఆ
గుహను చూసి ఈ గుహలో తప్పకుండ ఏదో జంతువూ ఉంటుంది ఈ రోజు ఈ గుహలోకి వెళ్లి అక్కడ నా ఆకలి తీర్చుకుంటాను అంటూ పులి గుహ లోపలి వెళ్లి చూడగా గుహలో ఎవ్వరు ఉండరు, అప్పుడు పులి ఛి ఛి ఈ రోజు నా time బాగాలేదు ఈ రోజు నేను ఆకలి కడుపుతోనే పడుకోవాలి అంటూ గుహలో నుండి బయటకు వాస్తు ఉంటుంది అప్పుడే పులికి నక్క వెంట్రుకలు కనిపిస్తాయి ఆ వెంట్రుకలు చూసి పులి తప్పకుండా ఈ గుహలో నక్క ఉండే ఉంటుంది అందువల్ల నక్క వెంట్రుకలు ఇక్కడ పడి

ఉన్నాయి, నేను ఇక్కడే దాక్కొని నక్క కోసము ఎదురు చూస్తాను ఆ నక్క రాగానే దాన్ని చంపి తిని నా ఆకలి తీర్చుకుంటాను అంటూ పులి అక్కడే దాక్కొని కూర్చుంటుంది, ఆలా చాలా ఎంత సేపు గడిచిన గుహలోకి నక్క రాదు ఇంకో పక్క పులికి ఆకలితో ప్రాణం పోయేటట్టు ఉంది, చాలా సేపటి తరవాత నక్క పాటలు పాడుకుంటూ గుహ వైపు వాస్తు ఉంటుంది, నక్క పాటలు విని పులి హమ్మయ్య నక్క వస్తుంది అంటూ బాగా సంతోషపడింది, ఆలా నక్క వస్తు వస్తూ దానికి పులి కాళ్ళ అచ్చులు కనిపిస్తాయి ఆ
అచ్చులు చూసి నక్క బాగా భయపడి వామ్మో నా గుహలో పులి ఉన్నటు ఉంది, కానీ పులి ఉందొ లేదో ఎలా తెలుకోవాలి అని బాగా ఆలోచిస్తుంది నక్క అప్పుడు దానికి ఒక ఐడియా వస్తుంది, నక్క తన తెలివి తేటలు ఉపయోగించి గట్టిగ ఒసేయ్ గుహ నువ్వు ప్రతి రోజు నా తో మాట్లాడేదానివి ఈ రోజు ఏమైంది నీకు నువ్వు నాతొ మాట్లాడకపోతే నేను గుహలోకి రాను అంటూ గుహ బయటనుండి
అరుస్తుంది ఇది విని పులి oho ఈ గుహ మాట్లాడుతుంది అనమాట ఈ రోజు నేను ఉన్నాను అని భయం తో మాట్లాడడం లేదు కావున ఈ రోజు నేనే నక్క తో మాట్లాడి దాన్ని లోపలి పిలుస్తాను అంటూ పులి కూడా నక్క రాజు గారు లోపలి రండి నేను మీకోసం ఎదురు చూస్తునాను అని గట్టిగ అరుస్తుంది, ఇది వినగానే నక్క లోపల తప్పకుండ పులి నా కోసము ఎదురు చూస్తుంది నేను లోపలి వెళ్తే అది నన్ను చంపి తినేస్తుంది అంటూ అక్కడి నుండి పారిపోయి తన ప్రాణాలు కాపాడుకుంటుంది.
Moral Of The Story : ఈ కథ ద్వారా మనము నేర్చుకున్న నీతి ఏమిటంటే, పారిస్తుతులు ఎంత కఠినంగా ఉన్న సరే మనం మన బుర్ర పెట్టి అలోచించి కఠినమైన పారిస్తుతుల నుండి బయట పడవచ్చు.
2. పిచ్చి సన్నాసి ! తెలుగు స్టోరీస్ నీతి కథలు
రామాపురం అనే ఒక ఊర్లో రాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆటను టైలర్ పని చేసేవాడు ఆ ఊర్లో అతను ఒక్కోడే టైలర్ అందువల్ల ఆ ఊర్లో వాళ్ళందరూ రాజు కె బట్టలు కొట్టమని ఇచ్చేవారు, ఆలా రాజు ఊర్లో వాళ్ళందరి బట్టలు కుట్టి బాగా డబ్బులు సంపాదించేవాడు రాజు దగ్గరున్న బట్టలు కుట్టే machine చెక్కతో తయారు చేసుకుంటాడు, ఒక రోజు బాగా వర్షం పడడం వల్ల రాజు ఇంట్లో నీళ్లు వచ్చేస్తాయి రాజు ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని చెడిపోతాయి దాంతో పాటు రాజు యొక్క బట్టలు కుట్టే
machine కూడా చెడిపోతుంది రాజు తన machine ని చూసి బాగా ఏడుస్తూ నా బట్టలు కుట్టే machine చెడిపోయింది ఇప్పుడు నేను బట్టలు ఎలా కుట్టాలి అంటూ ఏడుస్తూ కూర్చుంటాడు అప్పుడే రాజు భార్య వచ్చి రాజు తో నువ్వు ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎలా ? వెళ్లి వేరే చెట్టు చెక్క తీసుకొచ్చి ఇంకో కొత్త machine తయారు చేస్కో అని సలహా ఇస్తుంది, అప్పుడే రాజు చెక్క కోసము అడవిలోకి వెళ్తాడు అతను మంచి చెక్క కోసము చాలా చెట్లు చూస్తాడు కానీ అతనికి మంచి చెట్టు కనిపించదు కానీ
రాజు ఆగకుండా ఇంకా అడవి లోపలి వెళ్తాడు అక్కడ అతనికి ఒక మంచి చెట్టు కనిపిస్తుంది రాజు ఆ చెట్టు దగ్గరికి వెళ్లి అబ్బా ఇంత వెతికాక నాకు మంచి చెట్టు దొరికింది దీన్ని నరికి దీని చెక్కతో నేను మళ్ళి ఒక మంచి కుట్టు machine తయారు చేసుకుంటాను అంటూ గొడ్డలి తీస్కొని చెట్టు కి ఒక దెబ్బ వేస్తాడు అవువుడే ఒక దేవత ప్రేత్యేక్షం అయ్యి ఓరి మానవుడా ఈ చెట్టు మీద నేను విశ్రాంతి చేస్తాను నువ్వు ఈ చెట్టుని నరకడం మంచిది కాదు అని అంటాడు, అప్పుడు రాజు దేవుడా నన్ను క్షమించు
నేను ఈ చెట్టుని నరక్క తప్పదు నేను ఈ చెట్టు యొక్క చెక్కతో నా కుట్టు machine తయారు చేసుకొంటాను అని అంటాడు అప్పుడు దేవుడు నువ్వు ఈ చెట్టును నరకకు దీనికి బదులుగా నీకు ఏదైనా వరదానము ఇస్తాను నీకు ఏమి కావాలో చెప్పు అని అంటాడు దేవుడు, ఇది విని రాజు కి ఏమి వరదానం అడగాలో అర్ధ కాక దేవుడు గారు నాకు ఒక రోజు సమయం ఇవ్వండి నేను ఇంటికి వేళ్ళి నా భార్య మరియు నా స్నేహితుడి తో మాట్లాడి రేపు వచ్చి మీకు చెప్తాను అని అంటాడు, దేవుడు సరే వేళ్ళు

అని అనుమతి ఇస్తాడు రాజు ఇంటి వైపు వెళ్తూ ఉంటాడు అప్పుడే అతనికి స్నేహితుడు కాలుస్తాడు అప్పుడు రాజు తన స్నేహితుడు జరిగిందంతా చెప్తాడు, కాసేపు రాజు స్నేహితుడు బాగా అలోచించి ఒరేయ్ రాజు నువ్వు రేపు వెళ్లి ఆ దేవుడితో నాకు ఒక రాజ్యంని అప్పగించండి నేను రాజుని అవుతాను అని వర్ధనం అడుగు అని అంటాడు, ఇది విని రాజు కాసేపు అలోచించి నువ్వు చెప్పింది బానేఉంది కానీ నేను ఒకసారి నా భార్య తో కూడా అడుగుతాను అని అంటాడు, అప్పుడు రాజు స్నేహితుడు రాజు
తో ఒరేయ్ ని భార్య కి అసలే బుర్ర తక్కువ దానికి చెప్పొడు అని సలహా ఇస్తాడు కానీ రాజు తన స్నేహితుడితో ఒరేయ్ ఎంతయినా అది నా భార్య దానికి ఒక మాట చెప్పాలి అంటూ వెళ్లి జరిగిందంతా చెప్తాడు, రాజు భార్య కూడా బాగా అలోచించి ని స్నేహితుడు చెప్పిన మాటలు విని నువ్వు రాజ్యం కావాలని దేవుడితో కోరుకోవొద్దు ఎందుకంటె రాజులు ఎప్పటికి సుఖంగా ఉండరు, అందుచేత నువ్వు నా మాట విని రేపు పొద్దునే వెళ్లి దేవుడుతో నాకు నాలుగు చేతులు కావాలని కోరుకో అని అంటుంది,
ఇది విని రాజు తన భార్య తో నీకు ఏమైనా పిచ్చ ? నాలుగు చేతులు తీస్కొని నేను ఏమి చేయాలి అని అంటాడు, అప్పుడు రాజు భార్య ఓరి నా పిచ్చి మొగుడా నీకు రెండు చేతులు ఉంటేనే నువ్వు బట్టలు కుట్టి ఎంత డబ్బు సంపాదించే వాడివి, అదే నీకు నాలుగు చేతులు ఉంటె నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తావో ఆలోచించు అని అంటుంది, రాజు కూడా తన భార్య మాటల్లో పడి పోదున్నే మళ్ళి అడవిలోకి వెళ్లి దేవుడి తో దేవుడా నాకు నాలుగూ చేతులు కావాలి అని అంటాడు, ఈ మాట విని దేవుడు
ఆశచేర్యం తో నాలుగు చేతులు ఎందుకు అని అంటాడు, అప్పుడు రాజు దేవుడితో తన భార్య చెప్పిన మాటలన్నీ చెప్తాడు రాజు చెప్పిన మాటలు మొత్తం విని దేవుడు నవ్వుతు తధాస్తు అంటూ వర్ధనం ఇచ్చేస్తాడు వెంటనే రాజుకి నాలుగు చేతులు వచ్చేస్తాయి తనకు నాలుగు చేతులు చూసి రాజు ఎంతో సంతోషపడి ఊర్లోకి వెళ్తాడు ఊర్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పిల్లలు రాజుని చూసి వామ్మో
దయ్యము దయ్యము అంటూ భయపడి పారిపోతారు ఊర్లో వాళ్ళందరూ రాజుని చూసి వీడు మన రాజు కాదు ఇది నాలుగు చేతుల దయ్యము అంటూ అందరు రాళ్లు తీస్కొని రాజు కి కొడతారు అందువల్ల రాజు అక్కడిక్కడే ప్రాణాలు వదిలేస్తాడు, అప్పుడే రాజు భార్య పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తను చూసి అయ్యో నా వల్ల ఎంత పని అయిపోయింది అంటూ కేకలు పెట్టి ఏడుస్తుంది కానీ ఏమి లాభం లేదు పోయే ప్రాణం పొయ్యింది.
Moral Of The Story : ఈ కథ ద్వారా మనము నేర్చుకున్న నీతి ఏమిటంటే, మనము గుడ్డిగా ఎవ్వరు చెప్పిన నమ్మకూడదు మనకు కూడా దేవుడు బుర్ర ఇచ్చాడు కదా దాన్ని వాడాలి.
Also Read These Telugu Moral Stories : Best Neethi Kathalu In Telugu
2 Best Moral Stories In Telugu
Top 2 Neethi Kathalu In Telugu