Hii Friends నా పేరు రమ్య ఈ రోజ్ నేను మీ కోసం Top 2 Friendship Moral Stories In Telugu ! మంచి నీతి కథలు చెప్పబోతున్నాను కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయాము కమ్మెంట్ చేసి తెలపండి
1. అందము లేని బాతు ! Friendship Moral Stories In Telugu
అనగనగ ఒక బాతు ఉంటుంది ఆ బాతు ఐదు గుడ్లు ఇస్తుంది, గుడ్లను చూసి తెగ మురిసిపోయి కొన్నాళ్ళు అయితే నాకు ఐదుగురు పిల్లలు వస్తారు అని ప్రతి రోజు గుడ్లకే చేస్తుండేది , కొన్ని రోజులు అయ్యాక ఐదు గుడ్లలో నుంచి నాలుగు గుడ్లు పగిలి అందులో నుండి పిల్లలు బయటకు వస్తాయి బాతు తన నలుగురు పిల్లలను చూసి బాగా సంతోషపడింది, కానీ ఇంకో గూడు పగలదు బాతు ఆ గుడ్డు ని చూసి ఈ గుడ్డు లో ఉన్న పిల్ల చాలా అందంగా ఉందేమో అందుకే ఇంకా బయటకు రాలేదు అని అని ప్రతి రోజు ఆ గుడ్డు కల్లా చుస్తూఉండేది, పది రోజుల తరవాత ఆ గుడ్డు కూడా పగులుతుంది అందులో నుండి Ugly {అందములేని} పిల్ల బయటకు వస్తుంది ఆ పిల్లును చూసి బాతు అయ్యో నా పిల్ల ఇలా ugly గా పుట్టిందని బాగా ఏడ్చింది,

ఆలా కొన్నాళ్ళకు ఐదుగురు పిల్లలు కాస్త పెద్దగా అవుతాయి ugly బాతు ని చూసి అందరు నవ్వేవారు, పాపం ఆ బాతు తో ఎవ్వరు ఆడేవారు కాదు,ugly బాతు బాగా బాధపడేది ఏడ్చుకుంటూ వెళ్లి తన తల్లి తో చెప్పేది కానీ పాపము తల్లి బాతు కూడా ఏమి అనేది కాదు, ఒక రోజు ugly బాతు కి కోపం వచ్చిన నేను మీతో ఉండను నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని వేరే అడవిలోకి వెళ్ళిపోతుంది, అక్కడ ఒక అది ఒక కోడి దగ్గరికి వెళ్లి నేను మీతో ఉంటాను నాకు ఎవ్వరు లేరు అని అంటుంది, కోడి కోపం తో ని మొకం చుస్తే నా పిల్లలు భయపడతారు నువ్వు ఇక్కడ ఉండటానికి విలేదు ఇక్కడి నుండి వెళ్ళిపో అని తరిమేస్తుంది, అప్పుడు బాతు తన జీవితం పై విరుక్తి కలిగి చచ్చి పోవాలని ఒక కుక్క దగ్గరికి వెళ్లి
కుక్క కుక్క నన్ను ఎవ్వరు ఇష్టపడట్లేదు నువ్వు నన్ను చంపి తినేయి అని అంటుంది కుక్క చి చి నువ్వు ఎంత దరిద్రంగా ఉన్నావు నేను నిన్ను ఎలా తినాలి అని కుక్క అక్కడి నుండి పారిపోతుంది అప్పుడు బాతు ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది అక్కడ ఒక చెట్లు నరికేవాడు బాతుని చూసి తన తో పాటు ఇంటికి తీసుకెళ్తాడు, ఆ వ్యక్తి ఇంట్లో ఒక పిల్లి ఉంటుంది ఆ పిల్లి బాతు ని అక్కడినుండి కూడా తరిమేస్తుంది, ఆలా చూస్తూ చూస్తూ చలి కాలం వచ్చేస్తుంది ఎక్కడ చుసిన అడవిలో మంచు కురుస్తూ ఉంటుంది, ఒక రోజు సాయంత్రం బాతు ఒక నది దగ్గర నుండి వెళ్తూ ఉంటుంది అప్పుడు దానికి ఒక రాజహంస కనపడుతుంది బాతు ఆ రాజహంస ను చూడగానే అబ్బా ఎంత అందంగా ఉంది రాజహంస అని దాంతో పెళ్లి చేసుకుపోవాలని అనుకుంటుంది కానీ నేను చాల ugly గా ఉన్నాను
అంత అందమైన రాజహంస నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటుందని బాధ పడుతూ తల కిందికి వేసి నదిలో చూస్తుంది, బాతుకు నదిలో కూడా ఒక రాజహంస కనిపిస్తుంది బాతు ఆశచేర్యం తో నీళ్లలో చూడాగా ఆ నీడ తనదే అని తెలుసుకుంటుంది, అప్పుడు బాతుకు అర్ధమవుతుంది ఆ రాజహంస ని నేనే అని, బాతు ఆనందం తో గంతులు వేసుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ నన్ను గుర్తుపట్టావా? అని అడుగుతుంది ఎంతైనా తల్లి తల్లే కదా తల్లి బాతు వెంటనే తన పిల్లను గుర్తుపట్టేసి కౌగిలించు కుంటుంది, అప్పుడు అడవిలో అన్ని జంతువులూ తల్లి బాతు తో నీపిల్లా ఎంత దరిద్రంగా ఉండేది ఇప్పుడు అందమైన రాజాహంసలా ఎలా మారింది అని అంటారు, అప్పుడు తల్లి బాతు రాజహంస పిల్లలు చిన్నగా ఉన్నపుడు వికారంగానే ఉంటాయి అవి పెద్దగా అయ్యాక అందంగా అవుతాయి అని అంటుంది
Moral Of The Story : కొన్నిసార్లు మనము అనుకున్నది మనకు దక్కలేదని మనము బాధ పడుతూ వుంటాము, కానీ అన్నింటికీ ఒక Time ఉంటుంది, దేర్యం కోల్పోయి బాధ పడకూడదు దాని Time వస్తే అదే నడుచుకుంటూ మీ దగ్గరికి వస్తుంది
కాకి పాము కథ ! Small Stories In Telugu
అనగనగా ఒక అడవిలో ఒక కాకి జంట ఉండేది ఆ రెండు కాకులు చెట్టు పై చాల సంతోషం తో తమ జీవనం గడుపుతు వుండేవారు, కానీ వాళ్ళ సంతోషమైన ఇంటిపై ఒక పాము కన్నేసింది కాకులు తమ గూడు లో గుడ్లు పెట్టి ఆహారం కోసం వేటుకుతుంటూ అడవిలో కి వెళ్ళేవి, కాకులు అటు వెళ్ళగానే పాము చెట్టు ఎక్కి కాకి గుడ్లను తినేసేది ఏమి తేలినట్టు అక్కడినుండి వెళ్లిపోయేది ప్రతి రోజు కాకులు వచ్చి చుడగా తమ గుడ్లు అక్కడినుండి మాయం ఐపోయేవి, కాకులు రోజు బాధ పాడేవి ఒకరోజు సాయంత్రం కాకులు ఇంటికి త్వరగా వచ్చేస్తాయి వచ్చి చూడగా పాము తమ గుడ్లను తింటూ ఉంటుంది, పాము ని చూసి కాకులు భయపడి అక్కడినుండి ఎగిరిపోతాయి మల్లి గుడ్లు ఇచ్చే Time అవుతుంది ఈ సారి కాకులు బాగా అలోచించి తమ గూడు పాముకి దూరంగా ఒక పెద్ద కొండా పై

కట్టుకోవాలని నిర్ణయిస్తాయి, అనుకున్నట్టే ఒక పెద్ద కొండా పైకి వెళ్లి కాకులు అక్కడ గూడు కడతాయి హమ్మయ్య ఇక్కడ పాము రాదు మన గుడ్లు ఇక్కడ భద్రంగా ఉంటాయని గూడు లో మల్లి గుడ్లు పెట్టి అడవిలోకి ఆహారం కోసం వెళ్తాయి సాయంత్రం తిరిగి వచ్చి చుస్తే గుడ్లు అలాగే భద్రంగా ఉంటాయి కాకులు చాలా సంతోష పడుతాయి ఇంకా మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు ఇక్కడ పాము కూడా రాదు అని అనుకుంటాయి, కొన్నాళ్ళకు గుడ్లు పగిలి పిల్లలు బయటకు వస్తాయి కాకులు తమ పిల్లలను చూసి బాగా సంతోషిస్తాయి, ఇప్పుడు ఏ భయం లేదని కాకులు మల్లి అడవిలోకి వెళ్తాయి కానీ పాము కాకులను వెతుకుతూ కొండా పై కూడా వచ్చేస్తుంది, పాము నేరుగా కాకుల గూడు లోకి వెళ్లి కాకి పిల్లలను తినేస్తుంది కాకులు వచ్చి చూడగా పాము వాళ్ళ గూడులో కనిపిస్తుంది పాపం కాకులు పాము
తో కొట్లాడలేక అక్కడి నుండి ఎగిరిపోతాయి, ఎగురుకుంటూ ఒక పెద్ద చెట్టు కొమ్మ పై వెళ్లి ఏడ్చుకుంటూ ఎలాగైనా సరే ఆ పాముకు బుధ్ధి చెప్పాలని నిర్ణయిస్తాయి అప్పుడు వాళ్ళు, మనము ఈ అడవిలో ఉంటె పాము మనకు కూడా తినేస్తుంది మనము వెళ్లి ఒక రాజభవనం లో గూడు కట్టుకొని ఉందాము అక్కడైతే పాము రాదు అని రెండు కాకులు కలిసి ఒక పెద్ద రాజభవనం లో గూడు కట్టుకొని ఉంటారు, అక్కడ రాజకుమారి ఆడుకుంటూ ఉంటుంది కాకి కి ఒక ఐడియా వస్తుంది, కాకి వెళ్లి రాజకుమారి మేడలో ఉన్న వజ్రాల గొలుసు ని అక్కడి నుండి ఎగిరిపోతుంది, రాజకుమారి అయ్యో నా వజ్రాల గొలుసు కాకి తీస్కెళ్లిపోతుంది అని గట్టిగ కేకలు పెడ్తుంది,
రాజు వెంటనే తన సైనికులను పిలిచి రాజకుమారి మేడలో నుంచి కాకి వజ్రాల గొలుసు తీస్కొని వెళ్తుంది వెళ్లి తీస్కొని రండి లేదంటే మీ ప్రాణాలు తీస్తాను అని అంటాడు, సైనికులు వెంటనే వాళ్ళ గుర్రాలు వేసుకొని కాకి వెంట పరిగెత్తుతారు కాకి చాలా దూరం ఎగిరి ఎగిరి ఆ వజ్రాల గొలుసుని తీసుకెళ్లి ఆ పాము పుట్టలో వేసేస్తుంది వేసి అక్కడినుండి ఎగురుకుంటూ వెళ్లి ఒక చెట్టు కొమ్మ పై వెళ్లి కూర్చుంటుంది, సైనికులు వజ్రాల గొలుసు కోసం పుట్టలో చెయ్యి పెట్టగ అందులో నుండి పాము బుసలు కొట్టుకుంటూ బయటకు వస్తుంది పాము ని చూడగానే సైనికులు తమ దగ్గరున్న కత్తులతో పాము పై దాడి చేస్తారు అందువల్ల పాము అక్కడికక్కడే చచ్చిపోతుంది, ఇలా చేసి కాకి తన పగ తీర్చుకుంటుంది
Moral Of The Story : బలహీనులపై ప్రతాపం చూపించకూడదు, ఆపద వచ్చినప్పుడు తెలివి తో అలోచించి పనులు చేయాలి
Soo Friends ఇది మన ఈ రోజీ Top 2 Friendship Moral Stories In Telugu ! మంచి నీతి కథలు మీ అందరికి నచ్చాయి అని అనుకుంటున్నాను మీ అభిప్రాయము కామెంట్ చేసి తెలియచేయండి రేపు ఇంకో మంచి నీతి కథ తో మల్లి మీ ముందు ఉంటాను ఇట్లు మీ ఫ్రెండ్ రమ్య
Also Read These Stories : Top 3 Telugu Moral Stories ! మంచి నీతి కథలు
Top 4 Telugu Short Stories With Moral
Top 6 Moral Stories In Telugu ! నీతి కథలు
Top 3 Motivational Moral Stories In Telugu