Top 2 Moral stories in Telugu ! తెలుగు నీతి కథలు

Hii Friends నా పేరు Sandhya అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీ కోసం Top 2 Moral stories in Telugu ! తెలుగు నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయం కామెంట్ చేసి చెప్పండి

1. పులి మరియు నక్క కథ ! Telugu Moral stories On Friendship

అనగనగ ఒకరోజు అడవిలో ఒక పెద్ద పులి ఉండేది అది ప్రతి రోజూ జింకల షికారు చేసి వాటిని చంపి తినేది, ఇదంతా ఒక నక్క చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉండేది, పులి తిని వెళ్ళిపోయాక నక్క వెళ్లి ఏమైనా మిగిలితే తినేది, ప్రతి రోజు లాగే పులి షికారు చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా నక్క వెళ్లి పులి కాళ్ళ లో వెళ్లి పడిపోయి పులి తో “పులి రాజ పులి రాజ మీరు ఈ అడవికే రాజు నాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడిదింది అని అంటుంది, పులి ఎంటి నీ సమస్య చెప్పు అని అని అనగ అప్పుడు నక్క నేను ఎంత ప్రయత్నం చేసిన

నాకు షికారు చిక్కడం లేదు, మీరు రోజు షికారు చేస్తారు నన్ను కూడా మీతో పాటు పెట్టుకోండి నేను మి సేవ చేస్కుంటూ ఉంటాను మీరు షికారు చేసి తిన్న తరువాత మిగిలితే నేను తింటాను అని అంటుంది, పులి సరే అని ఒప్పుకుంటుంది, అల పులి మరియు నక్క మంచి స్నేహితులు అయిపోతారు పులి షికారు చేసి తిన్న తరువాత మిగిలింది నక్క తింటుంది అల నక్కకు ప్రతి రోజూ మంచి భోజనం దొరుకుతుంది అందువల్ల నక్క కూడా బాగా బలంగ తయారౌతుంది, ఒక రోజు నక్క పులి తో ఓయ్ పులి ఈ రోజు నేను

Top 2 Moral stories in Telugu ! తెలుగు నీతి కథలు
Top 2 Moral stories in Telugu ! తెలుగు నీతి కథలు

షికారు చేస్తాను నేను తిన్న తరువాత నువ్వు తినాలి అని అంటుంది, పులి ఆశ్చర్యం తో నువ్వు షికారు చేస్తావా అని అనగా, నక్క అవును ఈ రోజు నేను ఒక ఏనుగు కి షికారు చేస్తాను నేను దాన్ని చంపుతాను నేను తిన్న తరువాత నువ్వు తినాలి అని అంటుంది, పులి నవ్వుతూ నువ్వు ఏనుగు షికారు చేస్తావా అని పక పక నవ్వుతుంది నాకు కి కోపం వచ్చి ఓయ్ పులి ఎందుకు నవ్వుతున్నావ్? నేను బాగా తిని నికన్న

బలంగా తయారయ్యాను ఈ రోజు నికు చూపిస్తాను నా బలం అని అంటుంది, పులి సరే వేళ్ళు వెళ్లి ఏనుగు షికారు చెయ్యి నేను ఇక్కడే కూర్చొని చూస్తాను అని అంటుంది, నక్క వెళ్లి ఒక చెట్టు మీద కూర్చొని ఏనుగు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, చాలా సేపటి తర్వాత ఒక ఏనుగు అక్కడికి వస్తు ఉంటుంది, పులి ఏనుగు ను చూసి నక్క తో ఓయ్ నక్క అదిగో ఒక ఏనుగు వస్తుందని చుడు అని అంటుంది, నక్క గర్వంతో

నాకు తెలుసు నువ్వు నోరు ముయి అని అంటుంది పులి కి బాగా కోపం వస్తుంది కానీ అది ఏమి అనలేక అలాగే కూర్చుంటుంది, అల కాసేపు అయ్యాక ఏనుగు నక్క కూర్చున్న చెట్టు కిందికి వచ్చేస్తుంది, నక్క ఒక్కసారిగా ఏనుగు పైకి ఎగిరి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ గురి తప్పు వెళ్లి ఏనుగు కాళ్ళ దగ్గర వెళ్లి పడుతుంది నక్కను ఏనుగు తన కాళ్ళ దగ్గర వచ్చి పడగానే ఏనుగు కి బాగా కోపం వచ్చి ఏనుగు తన కాళ్ల తో నక్కను తొక్కేస్తుంది నక్క అక్కడికి అక్కడే తన ప్రాణాలు కోల్పోయింది,

Moral Of The Story: శక్తి కి మించిన పనులు చేయకూడదు, మన హద్దుల్లో మనం ఉండాలి మనమే తోపు అని అనుకోకూడదు

2. రెండు మేకల గొడవ ! Telugu Short Stories With Moral

చాలా ఏళ్ళ క్రితం ఒక అడవిలో రెండు మేకలు గొడవ చేస్కుంటూ ఉన్నాయి, వాళ్ళ గొడవలు కారణం ఏంటంటే మన ఇద్దరిలో ఎవరు ఎక్కువ బలవంతులు అని, రెండు మేకలు గొడవ పడుతుండగా అక్కడి నుండి ఒక సాధు వెళ్తూ ఉంటాడు అయన అల నిలబడి ఆ మేకలను చూస్తూ ఉంటాడు అల మేకల గొడవ ఇంక ఉద్రిక్తంగా మారి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు అప్పుడు అక్కడి నుండి ఒక నక్క వెళ్తూ ఉంటుంది

Top 2 Moral stories in Telugu ! తెలుగు నీతి కథలు
Top 2 Moral stories in Telugu ! తెలుగు నీతి కథలు

నక్క ఆ రెండు మేకలను చూసి దాని నోట్లో నీళ్ళ ఉరుతాయి అబ్బా ఎలాగైనా సరే ఈ మేకలను తిని నా ఆకలి తీర్చుకోవాలి అని నక్క అక్కడే ఉండి వాటిని చూస్తూ ఉంటుంది కాసేపు అయ్యాక మేకల గొడవ చాలా పెద్దగా అయ్యి ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఉంటారు అందువల్ల వాటికి రక్తం కారుతోంది, ఆ రక్తం కారి ప్రవహిస్తూ వెళ్లి నక్క కాళ్ళ దగ్గరికి వెళ్తుంది నక్క ఆ రక్తాన్ని నాకుతూ ఉంటుంది అందువల్ల నక్క ఆకలి ఇంక

పెరుగుతుంది, నక్క నెమ్మదిగా మేకల దగ్గరికి వెళ్ళి వాటిని తినేదాము అనే ఉద్దేశం తో మేకల దగ్గరికి వెళ్తుంది, మేకలు నక్కను వాళ్ళ దగ్గరికి వస్తుందని గమనించి వాళ్ళ గొడవ ఆపి రెండు మేకలు ఒక్కసారిగా నక్క పై దాడి కి సిద్ధమైతాయి, నక్క మేకల పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కానీ మేకలు ఒక్కసారిగా నక్క పైకే దాడి చేస్తాయి అందువల్ల నక్క కింద పడి గాయాల పాలు అవుతుంది మేకలు బాగా కోపం తో ఉండడం

వల్ల నక్కను ఇష్టం వచ్చినట్టు వాటి కొమ్ములతో పొడస్తాయి అందువల్ల నక్క తన ప్రాణాలు కోల్పోతుంది, సాధు భయపడి అక్కడి నుండి వెళ్లి వెళ్ళిపోతాడు,

Moral Of The Story : ఇతర గొడవల్లో అనవసరంగా తల దుర్చకొడడు

Soo Friends ఇది మన ఈ రోజు Top 2 Moral stories in Telugu ! తెలుగు నీతి కథలు

నేను రాసిన కథలు మీకు నచ్చాయి అని ఆశిస్తున్నాను కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి రేపు మరిన్ని మంచి నీతి కథలతో మళ్లీ మీ ముందు ఉంటాను, నా పేరు Sandhya Good Bye And Take Care

Also Read These Moral Stories : Neethi Kathalu In Telugu Small Stories

Best Moral Stories In Telugu తెలుగు నీతి కథలు

Top 3 Neethi Kathalu In Telugu ! మంచి నీతి కథలు కావలి

Telugu Neeti kathalu ! మంచి నీతి కథలు  

Leave a Comment

%d bloggers like this: