Hii Friends నా పేరు Varsha ఈ రోజు నేను మీకు Top 2 Moral Stories Telugu ! తెలుగు నీతి కథలు చెప్పా బోతున్న్నాను కథలు చాలా బాగుంటాయి పూర్తిగా చదివి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి
1. ఆవు మరియు పులి కథ ! Telugu Moral Stories
అనగనగ ఒక అడవిలో ఒక ఆవు ఉండేది దాని పేరు సీత, సీత చాలా మంచి ఆవు అడవిలోని ఇతర జంతువులతో కలిసి సీత ప్రతి రోజు గడ్డి తినడానికి ఒక కొండా పైకి వెళ్ళేది, మళ్ళి సాయంత్రము అయ్యే సమయానికి తిరిగి ఇంటికి వచ్చేసేది కానీ ఒక రోజు గడ్డి తింటూ తింటూ సీత ఒక పులి గుహలోకి వెళ్ళిపోయింది, పులి పడుకొని ఉంది సీత ఆలా నెమ్మదిగా గడ్డి తింటూ పిలి దగ్గరికి వెళ్ళిపోయింది అప్పుడే పులి నిద్ర లేచి సీతను చూసి అబ్బా నేను రెండు రోజుల నుండి ఏమి తినలేదు ఈ రోజు నిన్ను
తిని నా ఆకలి తీర్చుకుంటాను అని అంటుంది, అప్పుడు సీత ఏడుస్తూ పులి రాజా మీరు నన్ను తినవద్దు దయ చేసి నన్ను నా ఇంటికి వెళ్లనివ్వండి ఇంట్లో నా కోసము నా పిల్లవాడు ఎదురుచూస్తున్నాడు, నా పిల్లవాడు చాలా చిన్నవాడు నేను పాలు ఇస్తేగాని తాగుడు, వాడికి గడ్డి తినడం కూడా రాదు దయ చేసి నన్ను తినవద్దు అని బాగా ఏడుస్తుంది సీత, కానీ పులి మాత్రమూ ఒసేయ్ నేను రెండు రోజుల నుండి ఏమి తినలేదు నాకు బాగా ఆకలిగా ఉంది నిన్ను తినకపోతే
ఆకలితో నేను చచ్చిపోతాను అని అంటుంది, అప్పుడు సీత బాగా ఆలోచిని పులి రాజా ఇప్పుడు నన్ను నా ఇంటికి వెళ్లనివ్వండి నేను ఇంటికి వెళ్ళి చివరి సరిగా నా బిడ్డను పాలు ఇచ్చి ఒక రోజు నా బిడ్డతో పడుకొని తెల్లారి మళ్ళి ని దగ్గరికి వచ్చేస్తాను అప్పుడు నన్ను తిను అని అంటుంది, కానీ పులి పక పక నవ్వుతు ఒసేయ్ ఆవు నేను అంత పిచ్చివాడిలా కనిపిస్తున్నాన నీకు, నీవు ఇప్పుడు వెళ్లి మళ్ళి తిరిగి వచేస్తావు అంటే నేను నమ్మను కావున నిన్ను ఇప్పుడే తినేస్తాను అంటూ సీత వైపు పులి

పరిగెత్తుకుంటూ వస్తుంది, అప్పుడు సీత పులి రాజా నీకు కూడా ఒక తల్లే జన్మనిచ్చింది కదా, నేను కూడా ఒక తల్లినే నా బిడ్డను చివరి సారిగా చూసుకునే అవకాశం కూడా ఇవ్వవా అని అంటుంది, అప్పుడు పులి సీత మాటల్లో పడి సరే వేళ్ళు వెళ్లి ని బిడ్డను పాలు ఇచ్చి చివరి సరిగా చూసుకొని రా, ఒక వేళా నువ్వు రాలేదు అనుకో నేను ని ఇంటికి వచ్చి నీతో పాటు ని బిడ్డను కూడా తినేస్తాను అని అంటుంది ఇది విని సీత పులి కి ధన్యవాదాలు చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది, జరిగిందంతా తన
బిడ్డతో చెప్తుంది సీత బిడ్డ అమ్మ నువ్వు నన్ను వదిలి వెళ్ళొదు అంటూ బాగా ఏడుస్తుంది సీత తన బిడ్డకు పాలు ఇస్తుంది రాత్రంతా తన బిడ్డతో ఆడుకొని తెల్లారి తన బిడ్డను చివరిసారిగా ముద్దు పెట్టుకొని బాబు నేను వెళ్తున్నాను ఆరోగ్యం జాగ్రత అంటూ పులి దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ పాపం సీత బిడ్డ తన తల్లి వెళ్లపోయిందని బాగా ఏడుస్తూ ఉంటుంది, ఇంకో వైపు సీత పులి దగ్గరికి వచ్చి పులి రాజా నేను ఇచ్చిన మాట ప్రకారము నేను వచ్చేసాను రా వచ్చి నన్ను తిని ని ఆకలి తీర్చుకో అని అంటుంది
అప్పుడు పులి నెమ్మదిగా తన గుహలో నుండి బయటకు వచ్చి సీత ముందు నిలబడుతుంది, సీత కళ్ళు మూసుకొని రా ఇంకా ఆలస్యము చెయ్యకు నన్ను తినెను అని అంటుంది, కానీ పులి సీతకు తినకుండా సీత ఒక సారి ని కళ్ళు తెరిచి చూడు అని అంటుంది సీత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగా దానికి పులిలో దేవుడు కనిపిస్తాడు, ఆ దేవుడు సీతతో నేను నిన్ను పరీక్షా పెట్టాను నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు ఇక నువ్వు ని ఇంటికి వెళ్లి ని బిడ్డతో హాయిగా ఉండు అని అంటుంది, సీత ఆనందం తో దేవుడి కి దండం పెట్టి ఇంటికి వెళ్లి తన బిడ్డతో సుఖంగా ఉంటుంది.
Moral Of The Story : ఈ కథ ద్వారా మనము నేర్చుకున్న నీతి ఏమిటంటే, మన ప్రాణాలు తెగించైనా ఇచ్చిన మాట నిలపెట్టుకోవాలి
2. ఇత్తడి బింద ! Telugu Moral Stories
చాలా ఏళ్ళ క్రితము ఇత్తడి పురం అనే ఒక గ్రామము లో నరసింహ అనే ఒక వ్యక్తి ఉండేవాడు, అతని దగర రెండు ఎకరాల పొలము ఉండేది ఇంట్లో పరిస్తుతులు బాగా లేక అతను తన దగ్గరున్న రెండు ఎకరాల పొలము అమ్మి ఆ ఉరి సరపంచు పొలం లో పని కి వెళ్ళేవాడు, వచ్చిన డబ్బుతో తన ఇల్లు గడిపేవాడు కానీ పేదరికము బాగా పెరిగిపోయింది ఇంట్లో తినడానికి సరిగ్గా అన్నము కూడా ఉండకపోయేది ఒక రోజు నరసింహ సరాపంచు దగ్గరికి వెళ్లి అయ్యా నా ఇంట్లో తినడానికి ఏమి లేదు
నాకు కొన్ని డబ్బులు కావలి అని అడిగాడు కానీ సరపంచు నరసింహ తో నా దగ్గర డబ్బులు లేవు ఇక్కడి నుండి వెళ్ళిపో అని కోపం తో అన్నాడు, పాపము నరసింహ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రతి రోజు లాగే నరసింహ సరపంచు పొలం లో పనికి వెళ్ళాడు పపొలము లో గడ్డపార పెట్టి తొవ్వుతూ ఉన్నాడు అప్పుడు అతనికి ఒక ఇత్తడి బింద దొరికింది నరసింహ ఆ బిందను చూసి అబ్బా నాకు బంగారము బింద దొరికిందని సంతోషంతో దాన్ని బయటకయు తీసి బాగా పరిశీలించాడు కానీ అది
బంగారము బింద కాదు ఇత్తడి బింద అని తెలుసుకున్నాడు, ఛి నా అద్రుష్టము బాగాలేదు ఇది ఇత్తడి బింద కి బదులుగా బంగారము బింద ఉంటె ఎంత బాగుండేది అంటు బాధ పడుతూ ఆ ఇత్తడి బింద ని అక్కడే పాడేసి అందులో తన గడ్డదపారా వేసి అన్నము తినడానికి వెళ్ళిపోయాడు, కాసేపు అయ్యాక అన్నము తిని నరసింహ తిరిగి వచ్చి చూడగా ఆ ఇత్తడి బింద లో రెండు గడ్డపారలు ఉన్నాయి, నరసింహ ఆషెర్యము తో నేను ఒక గడ్డపార ఈ ఇత్తడి బింద లో వేసాను కానీ రెండు ఎలా అయ్యాయి
అని ఆలోచిస్తూ అతనికి అనుమానము వచ్చి తన దగ్గరున్న గంపను కూడా ఇత్తడి బింద లో వేశాడు వెంటనే రెండు గంపలు అయిపోయాయి ఇక నరసింహ ఆ ఇత్తడి బింద మామూలు బింద కాదు మాయల బింద అని తెలుసుకున్నాడు నరసింహ బాగా సంతోషపడి తన తో పాటు ఇత్తడి బింద ను ఇంయికి తీసుకొచ్చాడు, ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు ఇత్తడి బింద వేసేశాడు అన్ని రెండులా మారిపోయాయి ఆలా చేస్తూ చేస్తూ నరసింహ బాగా డబ్బుగల వాడు అయిపోయాడు సరపంచు దగ్గర

పనికి వెళ్లడం కూడా మానేసాడు, అప్పుడు సరాపంచు కి నరసింహ పై అనుమానము కలిగి నరసింహ ఇంటికి వెళ్లి చూడగా అసలు విషయము తెలిసింది, సరాపంచు కోపం తో రేయ్ నరసింహ ఈ ఇత్తడి బింద ఎక్కడ దొంగలించావు రా అని ఆకోపం తో అన్నాడు, నరసింహ భయపడుతూ నేను ఎక్కడ దొంగతనము చేయలేదు సార్ మీ పొలం లో పని చేస్తుండగా నాకు ఈ ఇత్తడి బింద దొరికింది అని అన్నాడు, సరాపంచు వెంటనే ఈ ఇత్తడి బింద నా పొలము లో దొరికింది కాబట్టి ఇది నాది అని ఆ
బిందను నరసింహ దగ్గరి నుండి లాక్కొని వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్లి సరాపంచు తన దగ్గరున్న అన్ని బంగారు వస్తువులు ఇత్తడి బింద లో వేసేశాడు అన్ని వస్తువులు రెట్టింపు అయిపోయాయి ఆలా చేస్త చేస్తూ సరాపంచు కూడా బాగా డబ్బులు సంపాదించేసాడు, ఈ విషేయము ఊర్లో వాళ్లందరికీ తెలిసిపోయింది ఊర్లో ఒకోడు వెళ్లి ఈ విషేయము రాజు కి చెప్పేసాడు రాజు వెంటనే తన సైనికులకు పంపించి సరపంచు దగ్గరి నుండి ఇత్తడి బింద ను తెప్పించుకున్నాడు, ఇక రాజు కూడా తన
దగ్గరున్న వస్తువులను ఆ ఇత్తడి బింద లో వెయ్యడమూ మొదలుపెట్టాడు ఆలా రాజు తన రాజ్యం లో అన్ని వస్తువులను బిందలో వేసేశాడు అవన్నీ రెట్టింపు అయిపోయాయి, రాజు బాగా ఆనందపడి తన దగ్గరున్న బంగారు నాణాలు వజ్రాలు అన్ని వేసేశాడు అన్ని రెట్టింపు కావడం తో రాజు కి పిచ్చి ఎక్కి ఒక రోజు తానె వెళ్లి ఇత్తడి బింద లో కూర్చున్నాడు అందువల్ల ఇద్దరు రాజులు అయిపోయారు, అందువల్ల ఇద్దరు నేను రాజు ని నేను రాజు ని కొట్టుకోవడం మొదలుపెట్టారు ఆలా చూస్తూ చూస్తూ
ఇద్దరు బాగా కుట్టుకుంటూ ఇద్దరు చనిపోయారు ఆ ఇత్తడి బింద కూడా పగిలిపోయింది అందువల్ల అందులో ఉన్న మాయలు అన్ని వెళ్లిపోయాయి, అప్పుడు నరసింహ మరియు సరపంచు ఇద్దరు వామ్మో ఈ బింద ఇంత ప్రమాదకరం అని తెలిసి ఉంటె నేను దీన్ని ముట్టుకునే వాడ్ని కాదు అంటూ ఒకొరికి ఒకరు సలహాలు ఇస్తూ ఇద్దరు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
Moral Of The Story : ఈ కథ ద్వారా మనము నేర్చుకున్న నీతి ఏమిటంటే, ఎప్పుడు ఎవ్వరికీ అన్యాయము చేయకూడదు, మన దగ్గర ఏదైనా వస్తువు ఉంటె దాన్ని వాడే విధానము తెలుసుకున్న తరవాతే దాన్ని వాడాలి.
Also Read These Moral Stories : Mowgli Moral Story In Telugu