Top 2 Neethi Kathalu In Telugu ! మంచి నీతి కథలు కావాలి  

Hii Friends నా పేరు Swathi ఈ రోజు నేను మీ అందరి కోసము Top 2 Neethi Kathalu In Telugu ! మంచి నీతి కథలు కావాలి అనే మంచి మంచి నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేస్కోండి

1. కుందేలు మరియు ఎలుక నీతి కథ ! Neethi Kathalu In Telugu

అనగనగా ఒక అడవిలో జోజో అనే కుందేలు ఉండేది దానికి ఏడుగురు పిల్లలు ఉండేవారు, జోజో తన పిల్లలను చాలా ప్రేమగా చూసుకునేది, కానీ ఆ అడవిలో ఇంకా పెద్ద పెద్ద జంతువులూ కూడా ఉండేవి ఆ పెద్ద జంతువులను చూసి జోజో పిల్లలు బాగా భయపడేవి జోజో తన పిల్లలకు దేర్యం చెప్పేది కానీ లోలోపలే జోజో కూడా బాగా భయపడేది, ఒక రోజు జోజో ఇంటి దగ్గరి నుండి కొన్ని గుర్రాలు వెళ్తూ ఉంటాయి వాటి శబ్దాలకు జోజో పిల్లలు భయపడి వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు, జోజో తన

పిల్లలను ఇంట్లోకి తీసుకెళ్లి దేర్యం చెప్పింది ఐన గాని పిల్లలు భయపడి కేకలు పెట్టి ఏడుస్తున్నారు ఆలా ఏడుస్తూ ఏడుస్తూ భయపడి నలుగురు పిల్లలు చనిపోయారు, చనిపోయిన తన పిల్లలను చూసి జోజో బాగా ఏడుస్తూ, దేవుడి తో ఓరి దేవుడా నువ్వు ఎంత అన్యాయము చేసావు నువ్వు మాకు ఇంత బలహీనంగా ఎందుకు పుట్టించావు అని బాధపడుతూ ఆ దేవుడి తో అన్నది, ఆలా కొన్ని రోజులు గడిచాయి మళ్ళి ఒక రోజు గుర్రాలు జోజో ఇంటి ముందు నుండి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి మిగిలిన

పిల్లలు భయపడి జోజో దగ్గరికి వెళ్లి అమ్మ అమ్మ గుర్రాలు మళ్ళి వస్తున్నాయి మాకు చాల భయంగా ఉంది మేము కూడా ఛహ్హ్యిపోతాము అని తల్లి తో అంటాయి, అప్పుడు జోజో తన పిల్లలను దగ్గరికి పిలిచి మనం ఇంకా ఎంత కాలం ఇలా భయపడుతూ బ్రతకాలి, మనం అందరం వెళ్లి ఒకేసారి ఒక నది లో దూకి ఆత్మహత్య చేసుకుందాము అని తన పిల్లలతో చెప్తుంది పాపం జోజో పిల్లలు కూడా తల్లి మాటలు విని సరే అమ్మ మనము అందరము వెళ్లి ఒకేసారి ఆత్మహత్య చేసుకుందాము అని అంటాయి

Top 2 Neethi Kathalu In Telugu ! మంచి నీతి కథలు కావాలి
Top 2 Neethi Kathalu In Telugu ! మంచి నీతి కథలు కావాలి

ఒక రోజు పోదున్నే జోజో తన పిల్లలను తీస్కొని నది దగ్గరికి వెళ్తుంది, ఆ నది దగ్గర కొన్ని ఎలుకలు కూడా ఉంటాయి, ఎలుకలు జోజో మరియు దాని పిల్లలను చూసి ఓయ్ ఇది మా ఏరియా మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్లిపోండి అని అంటాయి ఎలుకలు, అప్పుడు జోజో ఎలుక తో మేము ఇక్కడ ఉండడానికి రాలేదు నేను నా పిల్లలను తీస్కొని ఈ నదిలో దూకి ఆత్మహత్య చేసుకోడానికి వచ్చాను అని అంటుంది, ఇది విని ఎలుక అశ్చేర్యం తో జోజో ని ఒక చెట్టు కింద

కూర్చోపెట్టి అసలు ఏంటి విషయం నువ్వు ని పిల్లలతో చనిపోవాలని అనుకుంటున్నావు అని అంటుంది, అప్పుడు జోజో జరిగిందంతా ఎలుక తో చెప్తుంది జోజో చెప్పిన మాటలు ఎలుక బాగా శ్రద్దగా విని పక పక నువ్వుతుంది, ఎలుక నవ్వడం చూసి జోజో కి బాగా కోపం వచ్చి ఎలుక తో నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అంటుంది, అప్పుడు ఎలుక జోజో తో నువ్వు కుందేలువి కదా నేను ఎలుకని కదా శరీర ఆకారం లో నువ్వు నాకంటే పెద్దదానివి కదా, ఐతే ఇప్పుడు నేను నిన్ను చూసి భయపడి

ఆత్మహత్య చేసుకోవాలా? ఇలాగైతే మన లాంటి చిన్న జంతువులూ ఎలా బ్రతుకుతారు, నువ్వు అనవసరంగా భయపడి నీతో పాటు ని పిల్లల ప్రాణాలు తీస్తున్నావు, నా మాట విని మీ ఇంటికి తిరిగి వేళ్ళు ని పిల్లలను ఇంట్లోనే పెట్టకుండా వాళ్ళను బయట ప్రపంచం చూపించు వాళ్ళను ఇతర జంతువులను పరిచేము చెయ్యి, వాళ్ళు బ్రతకడం నేర్చుకుంటారు అని ఎలుక జోజోకి సలహా ఇస్తుంది, జోజోకి ఎలుక ఇచ్చిన సలహా బాగా నచ్చుతుంది అది తన పిల్లల దగ్గరికి వెళ్లి ఇక మనం

ఆత్మహత్య చేయకుండా దేర్యంగా బ్రతకాలి అంటూ జోజో తన పిల్లలను ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడు వెళ్లే దారిలో వాళ్లకు ఒక ఏనుగు కనిపిస్తుంది, ఆ ఏనుగు ని చూసి జోజో పిల్లలు బాగా భయపడతారు, కానీ జోజో దేర్యం చేసి తన పిల్లలను ఏనుగు దగ్గరికి తీసుకెళ్లి ఏనుగు గారు ఏనుగు గారు వీళ్ళు నా పిల్లలు అని పరిచేయము చేస్తుంది, ఏనుగు జోజో పిల్లలను చూసి అబ్బా ఎంత ముద్దుగా ఉన్నారు అంటూ వాళ్ళను ఎత్తుకుంటుంది మొదట్లో జోజో పిల్లలు భయపడతారు కానీ కొద్దీ సేపు

అయ్యాక ఏనుగు తో మంచి పరిచేయము చేసుకొని ఏనుగుతో ఆడుకుంటారు ఇది చూసి జోజో బాగా సంతోషపడి ఎలుక దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి నువ్వు చెప్పినట్టే నేను నా పిల్లలను పెద్ద జంతువూ తో పరిచేయము చేసాను వాళ్ళు మొదట్లో భయపడ్డారు కానీ నెమ్మది భయం పోయింది ఇప్పుడు నా పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు, నాకు దేర్యం చెప్పినందుకు నీకు ధన్యవాదాలు అని ఎలుక తో అంటుంది, ఇక జోజో తన పిల్లలతో సుఖంగా బ్రతుకుతుంది.

Moral Of The Story : మనము భయపడినంత కాలం మనకు భయపెట్టేవారు ఉంటారు, వాళ్లకు భయపడి మనము మనకు హాని చేసుకోవొద్దు.

2. నలుగురు స్నేహితులు ! Neethi Kathalu In Telugu

చాలా ఏళ్ళ క్రితము ఒక ఊర్లో నలుగురు స్నేహితులు ఉండేవారు, వాళ్ళు చాలా మంచి ప్రాణ స్నేహితులు అందులో ముగ్గురు బ్రాహ్మణులూ ఒకడు సాకలివాడు, ముగ్గురు బ్రాహ్మణులూ చాలా మంత్రం విద్యలు నేర్చుకున్న వారు, మిగిలిన సాకలివాడు వాడికి ఎలాంటి విద్యలు రావు కానీ బాగా తెలివిగలవాడు ఒక రోజు నలుగురు కలిసి ఒక దగ్గర కూర్చిని మనము ఈ ఊర్లో ఉంటూ మనకు వచ్చిన విద్యను దేనికి పనికి రాకుండా చేస్తున్నాము, కావున మనము పట్నానికి వెళ్లి మన విదిత్యతో బాగా

డబ్బులు సంపాదించవచ్చు అని అనుకుంటారు, అనుకున్నట్టే నలుగురు కలిసి పట్నం వైపు తమ ప్రయాణం మొదలుపెడతారు ఆలా వెళ్తూ వెళ్తూ ఒక బ్రాహామానుడు ఒరేయ్ మనకు ముగ్గురికి మాత్రమే మంత్రాలు వస్తాయి మనతో పాటు ఈ సాకలివాడు ఎందుకు దండగ, వీడు అవసరం లేదు మనం ముగ్గురం వెళ్లి బాగా డబ్బులు సంపాదించుకుందాము అని అంటాడు, అప్పుడు ఇంకో బ్రాహామానుడు కూడా నువ్వు చెప్పింది నిజమే ఈ సాకలివాడు అవసరం లేదు ఒరేయ్ నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపో

అని అంటాడు కానీ మిగిలిన ఇంకో బ్రాహామానుడు ఒరేయ్ మనము చిన్నపూడినుండి ఒకే దగ్గర ఆడుకొని పెరిగాము వీడు కూడా మన మిత్రుడే కావున వీడు కూడా మనతోనే వస్తాడు అని అంటాడు, కాసేపు ఇద్దరు బాగా ఆలోచించి సరే అని ఒప్పుకుంటారు ఆలా నడుస్తూ నడుస్తూ వాళ్లకు ఒక చనిపోయిన పులి కనిపిస్తుంది నలుగురు భయపడుతూ ఆ చనిపోయిన పులి దగ్గరికి వెళ్తారు అది చినిపోయిందిదని తెలుసుకుంటారు, అప్పుడు వాళ్ళు ఒరేయ్ మనకు ఉన్న విద్యలు ఉపయోగించి

Top 2 Neethi Kathalu In Telugu ! మంచి నీతి కథలు కావాలి
Top 2 Neethi Kathalu In Telugu ! మంచి నీతి కథలు కావాలి

దీనికి మళ్ళి ప్రాణాలు పోసుదాము అని అంటారు, ఇది విని సాకలివాడు ఒరేయ్ మీరు దీన్ని మళ్ళి ప్రాణాలు పోస్తే ఇది మనకే చంపి తినేస్తుంది రా అని అంటాడు, కానీ సాకలివాడి మాటలు ఎవ్వరు లెక్క చేయకుండా తమ దగ్గరున్న విద్యను ఉపయోగించి పులి శవం దగ్గర కూర్చొని మంత్రాలు చదవడం మొదలుపెడతారు కాసేపు మంత్రాలు చదివాక పులి నెమ్మదిగా తన కళ్ళు తెరుస్తుంది, ఇది చూసి ముగ్గురు బ్రహమణులు బాగా సంతోషపడి సాకలివాడి తో చూసావా మా విద్య అని అంటారు, కానీ

సాకలివాడు భయం తో ఒరేయ్ ఇది లేచిందంటే మన అందరిని తినేస్తుంది రా మనము వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అంటాడు, అప్పుడు ముగ్గురు బ్రహమణులు సాకలివాడి తో ఒరేయ్ పిరికి వాడ, నీకు అంత భయం వేస్తె ఇంటికి వెళ్ళిపో అని సలహా ఇస్తారు, బ్రాహామానుడు వెంటనే ఒక చెట్టు పైకి ఎక్కి కూర్చుంటాడు కాసేపు అయ్యాక పులి లేచి నిలబడుతుంది అప్పుడు ముగ్గురు బ్రహమణులు పులి తో ఒసేయ్ పులి నువ్వు చనిపోయి ఇక్కడ పడిఉన్నావు మేము ముగ్గురం కలిసి

నీకు ప్రాణం పోసాము అని అంటారు, పులి నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా వాళ్ళ ముగ్గురి పై దాడి చేసి వాళ్లకు చంపి తినేస్తుంది కానీ సాకలివాడు తన తెలివి ఉపయోగించి చెట్టు పైకి ఎక్కి కూర్చోడం వల్ల ప్రాణాలతో బయటపడతాడు, అప్పుడు సాకలివాడు తన ముగ్గురు మిత్రులను చూసి బాగా ఏడుస్తూ ఒరేయ్ నేను చిప్పింది వింటే మీరు కూడా ప్రాణాలతో ఉండేవారు కదా అని బాధ పడుతూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు.

Moral Of The Story : ఈ కథ ద్వారా మనము నేర్చుకున్న నీతి ఏమిటంటే, కేవలం బలం ఉంటె సరిపోదు బాలతో పాటు తెలివి తేటలు కూడా ఉండాలి లేకపోతె ఈ ప్రపంచం లో బ్రతకడం చాలా కష్టం.

Soo Friends ఇవి మన ఈ రోజీ Top 2 Neethi Kathalu In Telugu ! మంచి నీతి కథలు కావాలి మీ అందరికి నచ్చాయి అని ఆశిస్తున్నాను రేపు మరిన్ని telugu moral stories తో మల్లి మీ ముందు ఉంటాను, నా పేరు Swathi bye And Take Care.

Also Read These Moral Stories : Top 2 Telugu Moral Stories On Friendship

 Best Neeti kathalu in Telugu

Top Telugu Moral Stories

Top 2 Moral Stories Telugu  

Leave a Comment

%d bloggers like this: