Hii Friends నా పేరు స్వాతి ఈ రోజు నేను మీ కోసం Top 2 Neeti Kathalu In Telugu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పుర్తిగా చదివి మీ అభిప్రాయము కామెంట్ చేసి తెలియచేయండి
1. ఒంటె మరియు నక్క కథ ! Neeti Kathalu In Telugu
అనగనగ ఒక అడవిలో ఒంటె మరియు నక్క ఉండేవారు, వాళ్ళు ఇద్దరు మంచి స్నేహితులు ప్రతి రోజు సాయంత్రము ఇద్దరు ఒక నది పక్కన కూర్చొని మాట్లాడుకునే వారు, నక్క బాగా తెలివైంది ఒంటె చాల మంచిది, ప్రతి రోజు లాగే ఇద్దరు నది పక్కన కూర్చొని మాట్లాడుకుని చీకటి అయ్యేసరికి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు, నక్క ఇంటికి వెళ్ళగానే ఒక కుక్క నక్క ఇంటికి వచ్చి నక్క నక్క పక్క ఊర్లో ఒక పొలం లో మంచి పుచ్చకాయలు పండాయి నీకు పుచ్చకాయలు అంటే బాగా ఇష్టం కదా వెళ్లి తిని అని అంటుంది, కుక్క మాట వినగానే నక్క కు ఆ పుచ్చకాయలు ఎలాగైనా సరే తినాలని ఆశ పుట్టింది కానీ ఆ ఉరికి వెళ్లంటే నది దాటి వెళ్ళాలి నక్కకు ఈత రాదు నక్క బాగా అలోచించి పోదున్నే ఒంటె దగ్గరికి వెళ్ళింది, ఒంటె నక్కను చూసి ఏంటి నక్క గారు మనము సాయంత్రం కలుస్తాము కదా ఏంటి పోదున్నే

వచ్చేసారు అని అడుగుతుంది, నక్క తన తెలివి ఉపయోగించి ఏమి లేదు ఒంటె గారు పక్క ఊర్లో ఒక పొలం లో మంచి పుచ్చకాయలు పండాయి అంట మీకు పుచ్చకాయలు అంటే బాగా ఇష్టం కదా వెళ్లి తినిరండి పొలానికి వెళ్లాలంటే నది దాటి వెళ్ళాలి నాకు ఎలాగో ఈత రాదు వెళ్లి మీరు తినిరండి అని అంటుంది, ఒంటె అయ్యో అవునా నక్క గారు మీరు బాధపడకండి నేను మీకు నా వీపు మీద కూర్చోపెట్టుకొని తీసుకెళ్తాను అని నక్కను ఒంటె తన వీపు మీద కూర్చోపెట్టుకొని నది దాటుకొని పొలం లోకి వెళ్తుంది, అక్కడికి వెళ్లి కడుపునిండ పుచ్చకాయలు తింటారు నక్క బాగా తిని ఆనందం తో భౌ భౌ అని గట్టిగ అరుస్తుంది అప్పుడు ఒంటె నక్క ఆలా అరవకు ని అరుపులు విని ఎవరైనా వస్తారు అని అంటుంది
అనుకున్నట్టే నక్క అరుపులు విని ఒక రైతు పరిగెత్తుకుంటూ పొలం లోకి వస్తాడు రైతుని చూడగానే నక్క పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక చెట్టు వెనక దాచుకుంటుంది, కానీ పాపం ఒంటె శరీరం పెద్దగా ఉండడంవల్ల అది పరిగెత్తకుండా అక్కడే నిలబడిపోతుంది అందువల్ల రైతు కర్ర తీస్కొని ఒంటెను ఇష్టం వచ్చినట్టు కొడతాడు, ఇదంతా చూసి నక్క లో లోపలే బాగా నవ్వుతు ఉంటుంది, పాపం ఒంటె ఎలోగోల తప్పించుకొని తప్పించుకొని బయటపడుతుంది మళ్ళి ఇద్దరు నది దగ్గర కలుస్తారు, అప్పుడు ఒంటె నక్క తో అంటుంది ని వల్లే నాకు దెబ్బలు పడ్డాయి అసలు నువ్వు ఎందుకు అరిచావు అని అంటుంది, అప్పుడు నక్క నేను కడుపు నిండా తిన్నాక అరవకపొతే నాకు తిన్నది జీర్ణం కాదు అని ఒంటెను ఎగతాళి చేస్తుంది, ఒంటె ఏమి అనకుండా మల్లి నక్కను తన వీపు మీద కూర్చోపెట్టుకొని
నది దాటుతుండగా ఒంటెకు నక్క పై బాగా కోపం వచ్చి నది లోకి వెళ్ళగానే ఒంటె మునగడం మొదలు పెడ్తుంది, నక్కా భయం తో ఒంటెగారు ఎందుకలా మునుగుతున్నారు అసలే నాకు ఈత రాదు నదిలో పడితే నేను చచ్చిపోతాను అని అంటుంది, అప్పుడు ఒంటె నక్క వైపు చూస్తూ నక్క గారు మీకు తిన్న తరువాత అరవకపోతే మీకు జీర్ణం ఎలా కాదో, నాకు కూడా తిన్న తరువాత నదిలో మునగకపోతే తిన్నది జీర్ణం కాదు అని అంటుంది, అప్పుడు నక్క తాను చేసిన తప్పు గుర్తుచేసుకొని ఒంటె తో ఒంటె గారు నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అంటూ ఒంటె తో నక్క క్షమాపణ కోరుతుంది
Moral Of The Story : అమాయకుల మీద ఎక్కువ తెలివి తేటలు ఉపయోగించ కూడదు కొన్ని సార్లు అవి మనకే కష్టాన్ని తెచ్చి పెట్టుతాయి
2. ముసలి డేగ ! Small Moral Stories In Telugu
చాలా ఏళ్ళ క్రితం ఒక అడవిలో ఒక డేగల గుంపు ఉండేది ఆ డేగల గుంపులో దాదాపు 20 డేగలు ఉండేవి, అది వేసవి కాలం కావున అడవిలో తినడానికి ఏమి లేదు కనీసం త్రాగడానికి నీళ్లు కూడా లేవు అడవిలోని అన్ని చెరువులు ఎండి పోయాయి, డేగలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనుకున్నాయి ఒక రోజు డేగలు ఆ అడవిలో నుంచి ఎగురుకుంటూ వేరే అడవిలోకి వెళ్లిపోయాయి అక్కడ వాళ్లకు ఒక నది కనిపించింది వాళ్ళు వెంటనే నది దగ్గరవెల్లి ఉండడం మొదలు పెట్టారు, అక్కడ వాళ్లకు తినడానికి నదిలో చాపలు కప్పలు త్రాగడానికి పుష్కలంగా నీళ్లు కూడా ఉన్నాయి, ఇవన్నీ చూసి డేగలు బాగా సంతోష పడ్డాయి వాళ్ళు ఏ కష్టం చేయకుండా కడుపు నిండా తిండి దొరకడం వల్ల అవి ఎక్కడికి వెళ్లడం లేదు, ఇక మన జీవితాంతం మనం ఇక్కడే ఉండాలి

అని నిర్ణయించాయి, ఆ డేగల గుంపులో ఒక మొసలి డేగ కూడా ఉండేది ఆ మొసలి డేగ ముసలి డేగలను చూసి బాగా చింతించేది, ఇలాగె ఒకే దగ్గర కూర్చొని ఉంటె డేగలు ఎగరడం మర్చిపోతాయని ఒక రోజు మొసలి డేగ మిగితా డేగలను తన దగ్గర పిలిచి మనం ఇక్కడ వేసవి కాలం లో వచ్చాము ఇప్పుడు వర్ష కాలం వచ్చేసింది కావున ఇప్పుడు మనము తిరిగి మన అడవిలోకి వెళ్లిపోదాము మనకు మన పాత అడవిలో కూడా ఆహరం పుష్కలంగా దొరుకుతుంది ఇలా మనం ఒకే దగ్గర కూర్చుంటే మనము ఎగరడం కూడా మర్చిపోతాము అని అంటుంది, ఇది విని మిగితా డేగలన్నీ ఆ మొసలి డేగపై నవ్వుతాయి, నువ్వు బాగా మొసలిదానివి ఐపోయావు అందువల్ల నీకు బుర్ర పని కూడా పని చేయడం లేదు, ఇక్కడ అన్ని సఉపాయాలు ఉన్నాయి మాకు తిండి కోసం ఎక్కడికి వెల్లసిన అవసరం లేదు
ఇవన్నీ వదిలేసి మల్లి ఎగురుకుంటూ పాత అడవిలోకి మేము రాము కావాలంటే నువ్వు వెళ్ళిపో అని మొసలి డేగను ఎగతాళి చేస్తాయి, మొసలి డేగ ఎగురుకుంటూ పాత అడవిలోకి వెళ్ళిపోతుంది మిగితా డేగలు అక్కడే ఉండిపోతాయి, మొసలి డేగ తన పాత అడవిలోకి వెళ్లి అక్కడే బాగా తినుకుంటు ఉంటుంది, కొన్ని రోజుల తరవాత మొసలి డేగకు తన మిత్రులు గుర్తుకు వస్తారు, అందువల్ల మొసలి డేగ వెళ్లి తన మిత్రులను కలవాలని ఎగురుకుంటూ వాళ్ళదగ్గరికి వెళ్తుంది, కానీ అక్కడికి వెళ్ళగానే మొసలి డేగ ఒక్క సారిగా షాక్ అయిపోయుంది, అక్కడ తన మిత్ర డేగళాన్ని చచ్చి పడిఉంటాయి డేగ తన మిత్రులను చూసి బాగా ఏడుస్తుంది, అప్పుడు ఒక మూలాన ఒక డేగ గాయపడి ఉంటుంది దాన్ని చూసి మొసలి డేగ వెంటనే దాని దగ్గరికి వెళ్లి అసలు ఇదంతా ఎలా జరిగింది అని అంటుంది అప్పుడు గాయపడిన డేగ రెండు రోజుల క్రితం ఒక నక్క ఇక్కడికి వచ్చింది వచ్చి మా మీద దాడి చేసి వెళ్ళిపోయింది
అని అంటుంది అప్పుడు మొసలి డేగ అంటుంది ఆ నక్క దాడి చేసినప్పుడు మీరు ఎగిరి వెళ్ళిపోతే మీకు ఇలా జరిగేది కాదు కదా అని అంటుంది, గాయపడిన డేగ మేము ఎగరాలని చాలా ప్రయత్నించాము కానీ చాలా రోజులుగా మేము ఎగరకుండా ఒకే దగ్గర కుర్చిన్నాము అందువల్ల నక్క వచ్చినప్పుడు మేము ఎగరాలని యెంత ప్రయత్నం చేసిన మా రెక్కలు మాకు సహకరించలేదు అందువల్ల నక్క మా మీద దాడి చేసింది అని చెప్పి చివరికి గాయపడిన డేగ కూడా చచ్చి పోతుంది మిగిలింది మొసలి డేగ ఒక్కటే పాపం ఆ డేగ ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది
Moral Of The Story : ఎక్కవ సుఖానికి అలవాటు పది మనము మన కార్త్వయానికి మర్చిపోకుడు
Soo friends ఇది ఈ రోజీ మన Top 2 Neeti Kathalu In Telugu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు పూర్తిగా చదివినందుకు పేరు పేరునా నా కృతఙ్ఞతలు రేపు మళ్ళి మంచి నీతి కథలతో మీ ముందు ఉంటాను ధన్యవాదములు
Also Read These Stories : Top 2 Friendship Moral Stories In Telugu ! మంచి నీతి కథలు
Top 3 Telugu Moral Stories ! మంచి నీతి కథలు
Top 4 Telugu Short Stories With Moral ! తెలుగు నీతి కథలు
Top 4 Telugu Kathalu ! తెలుగు నీతి కథలు
Top 6 Moral Stories In Telugu ! నీతి కథలు