Top 2 Small Stories In Telugu ! మంచి నీతి కథలు కావాలి

Hii Friends నా పేరు Vidya అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని దేవుడి తో కోరుకుంటున్నాను, ఈ రోజు నేను మీ అందరి కోసం Top 2 Small Stories In Telugu ! మంచి నీతి కథలు కావాలి అనే కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి కామెంట్ చేసి మీ అభిప్రాయము తెలియచేయండి

1. మట్టి బొమ్మలు ! Small Stories In Telugu

అనగనగ ఒక పల్లెటూరి లో భీమా అని ఒక వ్యక్తి ఉండేవాడు, భీమా కుమ్మరోడు ఊర్లో ఉంటూ అతను మట్టి గిన్నెలు మట్టి బొమ్మలు తయారు చేసి వాటిని city కి తీసుకెళ్లి అమ్మి డబ్బులు సంపాదించేవాడు భీమా కి ముగ్గురు ఆడపిల్లలు ఆలా చూస్తూ చూస్తూ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, అతను రాత్రి పగళ్లు కష్టపడి బొమ్మలు తయారు చేసుకొని వాటిని అమ్మి డబ్బు తెచ్చేవాడు కానీ పిల్లలు పెద్దవాళ్ళు

అయిపోవడం వల్ల ఖర్చులు బాగా పెరిగాయి భీమా తెచ్చిన డబ్బులు సరిపోవడం లేదు, ఒక రోజు అతని భార్య భీమా తో మీరు ఇంకా ఎన్నాళ్ళు ఈ మట్టి బోమ్మలు అమ్ముతారు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు డబ్బులు సరిపోవడం లేదు, ఈ బాయమ్మల పని మానేసి సిటీ కి వెళ్లి ఏదో పని చేయండి మన బిడ్డలకు పెళ్లిళ్లు చేయాలి అని అంటుంది, భీమా కి తన మట్టి బొమ్మలు వృత్తి మానేసి

Top 2 Small Stories In Telugu
Top 2 Small Stories In Telugu

City కి వెళ్లి పని చేయడం ఇష్టం లేదు ఐన సరే తన పిల్లలకు పెళ్లిళ్లు చేయాలి కాబట్టి తన భార్య మాట విని భీమా city కి వెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీ లో పని చేయడం మొదలుపెట్టాడు కానీ అతనికి మాత్రం తన మట్టి బొమ్మల పని అంటేనే ఇష్టం, చేస్తుంది ఏమి లేక ఆలా కంపెనీ లో లెబోర్ పని చేస్తూ తనకు వచ్చిన జీతం ప్రతి నెల తన భార్య కు పంపించేవాడు, ఒక రోజు ఆ కంపెనీ యజమాని కొడుకు

Birthday కావడంవల్ల ఆ కంపెనీ యజమాని అందరికి తన ఇంటికి ఆహ్వానించాడు, భీమా కూడా వెళ్ళేడు birthday ఫంక్షన్ లో వచ్చిన వాళ్ళందరూ ఆ బాబు కి చాలా ఖరీదైన gifts ఇస్తున్నారు ఇది చూసి భీమా అయ్యో అందరు చాలా ఖరీదైన Gifts ఇస్తున్నారు కానీ నా దగ్గర Gift కి డబ్బులు లేవు అని బాధ పడుతూ ఒక పక్క నిలబడ్డాడు, అప్పుడు భీమా కి ఒక idea వచ్చింది ఆ idea ఏంటంటే నాకు

నాకు మట్టి బొమ్మలు చేయడం వచ్చు కదా నేను నా తరుపున ఒక మట్టి బొమ్మ తయారు చేసి ఇసాతాను అని వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి మట్టి తీస్కొని దాని తో ఒక గుర్రం బొమ్మ తయారు చేసుకొని వచ్చాడు అందరు gifts ఇస్తున్నప్పుడు భీమా కూడా వెళ్లి తానూ తయారు చేసిన మట్టి గుర్రం ఇచ్చాడు, కాసేపా అయ్యాక ఫంక్షన్ అయిపోయింది అప్పుడు ఆ బాబు gifts అన్ని

చూస్తున్నాడు, అందులో ఒక మట్టి తో చేసిన గుర్రం బొమ్మ కూడా ఉంది ఆ మట్టి బొమ్మను చూడగానే అక్కడున్న పిల్లలు అందరు బాగా సంతోషం తో అబ్బా ఎంత బాగుంది ఈ బొమ్మ ఈ బొమ్మ నాకు కావలి నాకు కావలి అని ఏడుస్తున్నారు, ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళనందరు తమ పిల్లలు ఏడవడం చూసి అసలు ఈ మట్టి బొమ్మ ఎవరు తెచ్చారు అని రెండు మూడు సార్లు అడిగారు

అప్పుడు భీమా ముందుకొచ్చి నేనే తెచ్చాను ఈ మట్టి బొమ్మ అని అన్నాడు, అందరు ఆశచేర్యం తో ఎక్కడ కొన్నావు చెప్పు మేము కూడా కొంటాము మా పిలల్ల కోసం అని అంటారు, అప్పుడు భీమా ఎక్కడ కొనలేదండి నేనే తయారు చేసాను అని అంటాడు, అందరు ఆశచేర్యం తో ఇంత మంచి పనోడివి ఇక్కడ కంపెనీ లో పని ఎందుకు చేస్తున్నావు అని అంటారు, అప్పుడు భీమా జరిగిందంతా చెప్తాడు,

భీమా మాటలు విని అక్కడున్న ఒక పెద్ద మనిషి భీమా భుజం పై చెయ్యి వీసీ బాబు నువ్వు ఇక్కడే city లో ఉంటూ బొమ్మలు తయారు చేయగలవా? నేను ఒక కంపెనీ పెట్టిసాతాను అని అంటాడు, ఇది వినగానే భీమా ఆనందం తో తప్పకుండ చేస్తాను సార్ అని అంటాడు, అన్నట్టే ఆ పెద్ద మనిషి భీమా కి డబ్బులు ఇచ్చి ఒక మట్టి బొమ్మల కంపెనీ పెట్టిస్తాడు, భీమా బాగా కష్టపడి తన కంపనీ లో పని చేసి మట్టి బొమ్మలు తయారు చేసి అమ్మడం మొదలు పెడతాడు చూస్తూ చూస్తూ భీమా అతి త్వరలోనే

బాగా డబ్బులు సంపాదించేస్తాడు ఊర్లో ఉన్న తన భార్య పిల్లను కూడా city కి పిలిచి అక్కడే ఉండడం మొదలుపెడతాడు, మంచి సంబంధాలు చూసి తన అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేస్తాడు మిగిలిన తన జీవితం సంతోషము తో గడుపుకుంటాడు

Moral Of The Story : భీమా ఒక కళాకారుడు తనకున్న కళను అతను గుర్తించలేక ఆగం అయ్యాడు కానీ చివరికి తన కళే తనకు దారి చూపించింది, అలాగే ప్రతి మనిషి లో ఏదో ఒక కళ ఉంటుంది కొన్ని సార్లు మనము దాన్ని గుర్తించలేక తిప్పలు పడతాము

2. పులి మరియు ఏనుగు కథ ! Small Stories In Telugu

అనగనగా అడవిలో పులి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది దానంట అది బాధ బాధపడుతూ, నన్ను అడవిలో అందరు అడవి రాజా అని పిలుస్తారు నాకు బలం కూడా బాగానే ఉంది నేను చాలా ఫాస్టుగా పరిగెత్తగలను ఐన ఈ అడవిలో జంతువులన్నీ నెమలి ని పొగుడుతారు నెమలి

ఎంత బాగుంది దాని రెక్కలు ఎంత అందంగా ఉన్నాయి అని అందరు దాన్నే ఇష్టపడతారు అని అనుకుంటుంది, “అసలు పులి నెమలి ని చూసి ఈర్ష పడుతుంది” అప్పుడు అక్కడినుండి ఒక ఏనుగు ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది పులి ఏనుగు ని చూసి నా బాధ ఏనుగు తో చెప్పుకుంటాను అని ఏనుగు తో ఓయ్ ఏనుగు ఎక్కడికి వెళ్తున్నావు? అని దాని దగ్గరికి వెళ్తుంది కానీ ఏనుగు ఏడుస్తూ ఉంటుంది దాన్ని చూసి పులి, అయ్యో ఏనుగు గారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది అప్పుడు

Top 2 Small Stories In Telugu
Top 2 Small Stories In Telugu

ఏనుగు నా సంగతి పక్కన పెట్టండి పులి రాజా మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది, కానీ పులి అడవికి రాజు కావడం వాళ్ళ నేను రాజు ని నేను అడిగిందాకి సమాధానం చెప్పు, నువ్వు ఇంత పెద్ద ఏనుగువి ని కంటే పెద్ద జంతువులూ మన అడవిలోనే లేరు నిన్ను ఎవరు కొట్టేరు అని గట్టిగ అడుగుతుంది, అప్పుడు ఏనుగు ఏడుస్తూ పులి రాజా నన్ను ఒక చీమ బాధపెడ్తుంది అందువల్ల నేను

ఏడుస్తున్నాను అని అంటుంది, పులి ఆశచేర్యం తో అడవిలో అన్నిటికంటే పెద్ద జంతువూ నువ్వు నిన్ను చీమ ఎలా బాధపెడ్తుంది ఐన ఒక చిన్న చీమ నిన్ను ఎలా ఏడ్పిస్తుంది అని అంటుంది, ఇదంతా విని ఏనుగు పులి రాజా రెండు రోజుల క్రితం ఒక చీమ నా చెవిలో దూరింది లోపలి వెళ్లి బాగా కరుస్తుంది ఆ నొప్పి భరించలేక నేను ఏడుస్తున్నాను అని అంటుంది

ఇది విని పులి కి నెమలి గుర్తుకొస్తుంది, ఇంత పెద్ద ఏనుగుని ఒక చిన్న చీమ ఏడ్పిస్తుంది నా పరిస్థి కూడా ఇంతే కదా నేను ఈ అడవికే రాజుని ఐన ఒక పక్షి నన్ను బాధపెడ్తుంది దేవుడు ప్రతి జీవికి కొన్ని బాలలు ఇస్తాడు కొన్ని లోపాలు ఇస్తాడు నెమలి అందాన్ని ఇచ్చాడు నన్ను బలశాలిని చేసాడు నా బలం నాకు దాని అందం దానికి అని మనసులోనే అనుకుంటూ నేను పై ఈర్షను తీసేస్తుంది పులి

Moral Of The Story : మనము ఎవ్వరిని చూసి ఈర్ష పడకూడదు వాళ్ళ దగ్గర అది ఉంది వాళ్ళ దగ్గర ఇది ఉంది అని వాళ్లపై ఏడ్చే బదులు మనము కూడా బాగా కష్టపడి ఏదైనా సాధించుకోవొచ్చు

Soo Friends ఇవి మన ఈ రోజీ Top 2 Small Stories In Telugu ! మంచి నీతి కథలు కావాలి, మీ అందరికి నచ్చాయి అని ఆశిస్తున్నాను మీ అభిప్రాయము కామెంట్ చేసి తెలియచేయండి ” రేపు ఇంకో కథ తో మల్లి మీ ముందు ఉంటాను నా పేరు Vidya, Bye And Take Care

Also Read These Stories : Top 2 Neeti Kathalu In Telugu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు

Top 2 Friendship Moral Stories In Telugu ! మంచి నీతి కథలు

Top 3 Telugu Moral Stories ! మంచి నీతి కథలు

Top 4 Telugu Short Stories With Moral ! తెలుగు నీతి కథలు

Leave a Comment

%d bloggers like this: