Hii Friends నా పేరు Navya ఈ రోజు నేను మీ అందరి కోసము Top 2 Telugu Moral Stories For Kids !మంచి నీతి కథలు కావాలి అనే మంచి కథలు తీస్కొని వచ్చాను కథలు చాలా బాగుంటాయి అందుకని కథను పూర్తిగా చదివి మీ ఫ్రెండ్స్ తో కూడా share చేస్కోండి.
1. తాగుబోతు ! Telugu Moral Stories For Kids
చాలా ఏళ్ళ క్రితము ఒక ఊర్లో రమేష్ అనే ఒక కుమ్మరివాడు ఉండేవాడు, అతను రోజంతా కష్టపడి మట్టి కుండలు తయారు చేసి సాయంత్రము వాటిని బజారుకి తీసుకెళ్లి అమ్మేసేవాడు వచ్చిన డబ్బుతో బాగా మందు తాగి ఇంటికి వెళ్ళేవాడు ఆలా రమేష్ ప్రతి రోజు చేసేవాడు, ఒక రోజు రమేష్ బాగా తాగి ఇంటికి వెళ్తుండగా మందు ఎక్కువయ్యి కింద పడిపోతాడు అప్పుడు అతనికి మోకానికి ఒక రాయి తగిలి బాగా రక్తం పోతూ ఉంటుంది ఐన రమేష్ అలాగే లేచి ఇంటికి వెళ్ళిపోతాడు, పోదున్నే రమేష్ లేచి
చూడగా అతని మోకానికి పెద్దగా గాయం అయ్యిందని గమనించి వైద్యుడు దగ్గరికి వెళ్లి మందులు తీసుకుంటాడు, అప్పుడు వైద్యుడు ఆ గాయానికి చూసి రమేష్ నువ్వు ఈ మందులు వాడు నీకు నొప్పి తగ్గిపోతుంది కానీ ని మోకానికి అయిన గాయము ఎప్పటికి తగ్గదు అని అంటాడు, రమేష్ మందులు తీస్కొని ఇంటికి వచ్చేస్తాడు ఆలా చాల ఏళ్ళు గడిచిపోతాయి కానీ రమేష్ మోకానికి ఉన్న గాయము తగ్గదు అది అలాగే ఉండిపోతుంది, రమేష్ కూడా ఆ గాయానికి అలవాటు పడిపోతాడు, ఒక సారి ఊర్లో
బాగా వర్షాలు పడుతూ ఉంటాయి అందరి ఇల్లులు వర్షానికి కూలిపోతూ ఉంటాయి అందువల్ల అందరు ఆ ఊరు వదిలి వేరే ఊర్లకు వెళ్ళిపోతారు వాళ్లతో పాటు రమేష్ కూడా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, అందరికి ఏదొక పని దొరుకుతుంది కానీ రమేష్ కి మాత్రమూ ఏ పని దొరకదు రమేష్ పని కోసం చాలా ప్రయతనాలు చేస్తాడు కానీ వాడికి ఎక్కడ పని దొరకదు, అప్పుడు రమేష్ బాగా అలోచించి ఆ రాజ్యానికి చెందిన రాజు దగ్గరికి వెళ్లి రాజు గారు నాకు ఏదైనా పని ఇవ్వండి అని అంటాడు, రాజు కాసేపు రమేష్

మొకం చూస్తాడు అతని మోకానికున్న గాయం చూసి రాజు తన మనసులో విడి మోకానికి గాయం ఉంది వీడు ఏదైనా యుద్ధంలో యుద్ధము చేసి ఉంటాడు అనుదువల్ల ఈ గాయము అయ్యిందని అనుకోని, సరే నీకు నేను సేనాపతి పదవి ఇస్తాను ఈ రోజు నుండి నువ్వే మన రాజ్యానికి సేనాపతివి అని అంటాడు, ఈ మాట వినగానే సభలో ఉన్న అందరు మంత్రులకు కోపం వస్తుంది కానీ రాజు ముందు ఎవ్వరు ఏమి అనలేక పోతారు ఆలా కొన్నాళ్ళు గడిచాక ఒక రోజు ఇతర రాజ్యం రాజు తన సైన్యము తో
యుద్ధనికి వస్తాడు, అప్పుడే ఈ రాజ్యం రాజు రమేష్ దగ్గరికి వచ్చి రమేష్ ఇతర రాజ్యము వాళ్ళు మన రాజ్యం పై దాడికి వస్తున్నారు కావున నువ్వు కూడా మన సైన్యము తో యుద్ధనికి సిద్ధంగా ఉండు అని అంటాడు, రమేష్ ఏమి అనలేక ఆలా మౌనంగా నిలబడిపోతాడు రాజు కాస్త దూరం వెళ్లి మళ్ళి తిరిగి వచ్చి రమేష్ తో సేనాపతి గారు నేను మిమల్ని ఒక విషయము అడగడం మర్చిపోయాను మీ మోకానికి ఈ గాయము ఏ యుద్ధంలో అయ్యింది అని అంటాడు, అప్పుడు రమేష్ రాజు తో రాజు గారు ఈ
గాయము నాకు యుద్ధం చేసినప్పుడు తగలలేదు నేను బాగా తాగి కింద పడిపోయాను అప్పుడు నాకు ఒక రాయి తగిలి ఈ గాయము అయ్యింది అని అంటాడు, ఈ మాట వినగానే రాజు కి రమేష్ మీద బాగా కోపం వచ్చి తన సైనికులను పిలిచి వెంటనే వీడిని బంధించండి అంటూ గట్టిగ అరుస్తాడు సైనికులు వచ్చి రమేష్ ని పట్టుకొని బంధిని చేసి జీవిత ఖైదీ శిక్ష వేస్తారు ఇక చేసేది ఏమి లేక రమేష్ జీవితాంతం ఖైదీ లాగే ఉండిపోతాడు.
Moral Of The Story : ఈ కథ ద్వారా మనము నేర్చుకున్న నీతి ఏమిటంటే, ఒకరి గురించి మనము పూర్తిగా తెలుసుకోకుండా వాళ్లకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకూడదు.
2. తెలివి లేని యాదవ ! మంచి నీతి కథలు కావాలి
అనగనగ ఒక ఊర్లో లింగప్ప అనే వ్యక్తి ఉండేవాడు అతనికి చాలా పొలము ఉండేది కానీ అతని పొలము లో ఏమి పండేది కాదు అందువల్ల లింగప్ప నాకు ఎంత పొలము ఉన్న ఏమి లాభం లేదు అంటూ ప్రతి రోజు బాధ పడేవాడు ఒక రోజు లింగప్ప మాదేహానం సమయంలో తన పొలము లో ఒక చెట్టు కింద పడుకొని ఉన్నాడు అప్పుడు ఒక పాము వచ్చి లింగప్ప కాళ్ళ దగ్గర కూర్చుంటుంది కాసేపు అయ్యాక లింగప్ప నిద్ర లేచి చూడగా అతని కాళ్ళ దగ్గర పాముని చూసి భయపడి పారిపోతాడు, మళ్ళి
కాసేపు అయ్యాక వచ్చి చూడగా ఆ పాము అక్కడే ఆలాగే కూర్చొని ఉంటుంది ఆ పాముని చూసి లింగప్ప నెమ్మదిగా పాము దగ్గరికి వెళ్లి పాము తో నువ్వు మాములు పామువి కాదు నువ్వు దేవుడివి అందువల్లే నువ్వు నన్ను కురవలేదు అంటూ లింగప్ప వెళ్లి ఒక మట్టి గిన్నెలో పాముకి కొన్ని పాలు తెచ్చి పోస్తాడు పాము పాలు తాగేస్తుంది అప్పుడు లింగప్ప ఓ నాగ దేవత నాకు ఇంత పొలము ఉంది కానీ నా పొలము లో ఏమి పండదు నన్ను దీవించు అంటూ పాముతో అంటాడు పాము ఏమి
అనకుండా పాలు తాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది, ఇక సాయంత్రం అయ్యేసరికి లింగప్ప కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు, ప్రతి రోజు లాగే లింగప్ప తన పోలాకి వెళ్తాడు పాముకి పాలు పెట్టిన మట్టి గిన్నెలో లింగప్ప కు ఒక బంగారం నాణెము దొరుకుతుంది ఆ బంగారు నాణెము తీస్కొని లింగప్ప బాగా సంతోషపడి తన ఇంటికి వెళ్ళిపోతాడు, ఆలా లింగప్ప ప్రతి రోజు పాముకి మట్టి గిన్నెలో పాలు పోసేవాడు దానికి బదులుగా పాము లింగప్పకు ప్రతి రోజు ఒక బంగారం నాణెము ఇచ్చేది, కొన్ని
రోజులకే లింగప్ప బాగా డబ్బుగల వాడు అయిపోయాడు, ఒక సారి లింగప్పకు ఒక పెళ్లి కి వెళ్లాల్సి ఉంది అప్పుడు లింగప్ప తన కొడుకు ని దగ్గరికి పిలిచి ఒరేయ్ బాబు నేను పెళ్ళికి వెళ్తున్నాను రెండు రోజులు రాను అందువల్ల నువ్వు ప్రతి రోజు మన పొలానికి వెళ్లి పాముకి పాలు పోసిరా దానికి బదులుగా పాము ఒక బంగారు నాణెము ఇస్తుంది అని అంటాడు, లింగప్ప కొడుకు సరే నాన్న మీరు వెళ్లి రండి నేను పాముకి పాలు పోసి బంగారం నాణెం తీస్కొని వస్తాను అని అంటాడు, అనుకున్నట్టే లింగప్ప

కొడుకు పొలానికి వెళ్లి మట్టి గిన్నెలో పాలు పోసి ఇంటికి తిరిగి వచేసాడు మళ్ళి పోదున్నే వెళ్లి బంగారం నాణెం తీస్కొని ఇంటికి వచేసాడు, ఇక లింగప్ప కొడుకు కి ఆశ కలిగి ఈ పాము రోజు ఒకటే బంగారు నాణెము ఇస్తుంది అసలు ఈ పాము బంగారు నాణెం ఎక్కడి నుండి తెస్తుంది అని ఒక సారి పాము వెళ్తుండగా దాని వెనక వెళ్లి చూడగా అది ఒక పుట్టలోకి వెళ్ళిపోయింది అప్పుడు లింగప్ప కొడుకు ఆ పుట్టాను చూసి ఓహో ఇదా అసలు విషయము అంటే పాము ప్రతి రోజు బంగారు నాణెం ఈ పుట్టలో
నుండి తెస్తుంది అని అనుకుంటూ, రోజు ఒకే బంగారు నాణెం ఇస్తుంది అందువల్ల నేను వెళ్లి పుట్టలో చెయ్యి పెట్టి అందులో ఉన్న బంగారు నాణేలు ఒకే సారి తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడు, పోదున్నే లేచి లింగప్ప కొడుకు పాము పుట్ట దగ్గరికి వెళ్లి కాసేపు అటు ఇటు చూసి ఒక్కసారిగా పాము పుట్టలో చెయ్యి పెట్టి బంగారు నాణేల కోసం వెతుకుతున్నాడు అప్పుడు పాము పుట్టలోనే ఉంది పాము భయపడి ఒక్కసారిగా లింగప్ప కొడుకు చితికి కాటేసింది, అందువల్ల లింగప్ప
కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు అప్పుడు లింగప్ప వచ్చి తన కొడుకును చూసి బాగా బాధ పడుతూ ఏడ్చేశాడు.
Moral Of The Story : ఈ కథ ద్వారా మనము నేర్చుకున్నా నీటి ఏమిటంటే, అతిగా ఆశా పడినవాడు ఎప్పటికి బాగుపడలేడు, మన దగ్గర ఉన్న దాంట్లో మనము సరి పెట్టుకోవాలి అత్యాశ పనికి రాదు, లింగప్ప కొడుకు చేసిన తప్పు ఏంటి అంటే అతను ఆశకు గురయ్యి తన ప్రాణాలు కోల్పోయాడు, జీవితంలో మనకు ఇలాంటివి చాల ఎదురవుతాయి కావున మనము ఎప్పటికి లింగప్ప కొడుకు చేసిన తప్పులు చేయకుండా నీతిగా నిజాయతీగా అత్యాశ లేకుండా బ్రతకాలి.
Friends ఇది ఇవి మన ఈ రోజు Top 2 Telugu Moral Stories For Kids !మంచి నీతి కథలు కావాలి, అనే కథలు నేను చెప్పిన కథలు మీకు బాగా నచ్చాయి అని ఆశిస్తున్నాను, మీ అభిప్రాయం కింద కామెంట్ చేసి తెలపండి Soo నా పేరు Navya రేపు మరిన్ని మంచి మంచి తెలుగు నీతి కథలతో మళ్ళి మీ ముందు ఉంటాను అప్పటివరకు సెలవు, Bye And Take Care
Also Read These Moral Stories In Telugu : Top 2 Best Telugu Moral Stories
2 Best Moral Stories In Telugu
Top 2 Neethi Kathalu In Telugu