Hii Friends నా పేరు Yamini నేను మీ అందరి కోసం ఈ రోజు Top 2 Telugu Moral Stories On Friendship ! Telugu Moral Stories తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ ఫ్రెండ్స్ తో Share చేస్తారని ఆశిస్తున్నాను
1. అందమైన జింక ! Telugu Kathalu
అనగనగ ఒక అడవిలో రురు అనే ఒక అందమైన జింక ఉండేది, అది చూడటానికి చాలా అందంగా దాని రంగు బంగారం లాగా దాని కళ్ళు నీలి రంగులో ఉండేవి దాన్ని ఎవరు చూసిన అల చూస్తూ ఉండిపోయే వారు, కానీ ఆ జింక ఎవ్వరితో మాట్లాడేది కాదు ఒక రోజు సాయంత్రం జింక ఒక నది పక్కన కూర్చొని ఉంటుంది, అప్పుడు దానికి ఒక మనిషి కేకెల వినబడతాయి అది పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తుంది, నది లో ఒక మనిషి కొట్టుకొని పోతు ఉంటాడు, జింక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ మనిషి
ప్రాణాలు కాపాడడానికి నదిలో దుకుతుంది, అల ఈత కొట్టుకుంటూ మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు భయపడకు నేను నీ ప్రాణాలు కాపాడుతాను నువ్వు నా కాలు పట్టుకో అని జింక ఆ వ్యక్తి తో అంటుంది, కానీ అతను కాలు పెట్టుకోకుండా ఎగిరి జింక విపు పై కూర్చుంటాడు అయిన జింక ఏమి అనకుండా వాడి బరువు మొస్కుంటు వడ్డు దగ్గరికి తెచ్చి నేను కాలు పట్టుకో అంటే నువ్వు నా వీపు పై ఎందుకు ఎక్కి కూర్చున్నావు? అని అడుగుతుంది అప్పుడు వాడు నాకు బాగా భయం వేసింది అందువల్ల నేను నీ విపు పై
ఎక్కి కూర్చున్నాను నన్ను మన్నించు అని అంటాడు, జింక సరే వేళ్ళు కానీ నేను నీ ప్రాణాలు కపడినట్టు ఎవ్వరికీ చెప్పకు అని అంటుంది, మనిషి ఆశ్చర్యం తో నువ్వు నా ప్రాణాలు కాపాడేవు అందువల్ల నీ మంచితనం అందరికీ తెలియాలి కావున నేను వెళ్లి అందరికీ నీ మంచితనం గురించి చెప్తాను అని అంటాడు, అప్పుడు జింక ఒక వేళ నువ్వు నా గురించి అందరికీ చెప్తే వాళ్ళందరూ వచ్చి నన్ను పట్టుకొని పోతారు కావున దయ చేసి ఎవ్వరికీ చెప్పద్దు అని అంటుంది, అప్పుడు మనిషి కూడా సరే నేను ఎవ్వరికీ

చెప్పాను అని తన ఇంటికి వెళ్ళిపోతాడు, కొన్ని రోజులు గడిచాక ఆ రాజ్యం లోని మహారాణి ఇందుమతి ఒక వస్తుంది ఆ కల ఏంటంటే ఆమె కలలో రూరు జింక ను చూస్తుంది, తెల్లారి రాజు దగ్గరికి వెళ్లి రాజు గారు రాజు గారు నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది కలలో నేను ఒక జింకను చూసాను ఆ జింక చాలా అందంగా ఉంది నాకు ఆ జింక మాంసం తినలని ఉంది అని అంటుంది, రాజు వెంటనే ఊర్లో ప్రచారం చేసి ఎవరైతే ఆ జింకను తీస్తారో వాళ్లకు వంద బంగారు నాణేలు ఇస్తాను అని అంటాడు, ప్రచారం విని ఆ వ్యక్తి రాజు దగ్గరికి
వెళ్లి రాజు గారు ఆ జింక ఎక్కడుందో నాకు తెలుసు మీరు వంద నాణేలు ఇస్తే నేను చెప్తాను అని అంటాడు, రాజు అతనికి వంద నాణేలు ఇచ్చేస్తాడు ఇక రాజు ఆ వ్యక్తి తో పాటు అడవిలోకి జింక వేటకు వెళ్తాడు అక్కడ వాళ్లకు రురూ జింక కనిపిస్తుంది, జింకను చూసి రాజు వెంటనే బాణం తీసి జింక పై గురి పెడతాడు జింక తన పై గురిని చూసి రాజు గారు దయ చేసి నన్ను చంప వద్దు, నేను ఎవ్వరికీ హాని చేయలేదు దయ చేసి నన్ను వెళ్లనివ్వండి అని అంటుంది ఇది విని రాజు జింక తో ఒసేయ్ జింక వంద నాణేలు ఇస్తే నీ గురించి
నాకు తెలిసింది నిన్ను ఎలా వదిలేయాలి అని అంటాడు, జింక ఆశ్చర్యం తో రాజు గారు నా గురించి మీకు ఎవరు చెప్పేరు అని అడుగుతుంది అప్పుడు రాజు ఆ వ్యక్తి నీ చూపిస్తాడు, జింక ఆ వ్యక్తిని చూసి బాగా ఏడుస్తూ మీరు మనుషులు ఎప్పటికీ మారారు అని గట్టిగ కేకలు పెట్టీ ఏడవడం మొదలుపెడుతుంది, రాజు కూడా ఆశ్చర్యం తో అసలు ఏమైంది అని జింక తో అడుగుతాడు అప్పుడు జింక రాజు గారు కొన్ని రోజుల క్రితం ఈ వ్యక్తి నదిలో కొట్టుకొని పోతున్నాడు అప్పుడు నేను వెళ్లి ఇతని ప్రాణాలు కాపడెను కానీ ఈ రోజు
ఇతనే నా ప్రాణాలు బలి తీయాలని చూస్తున్నాడు, సరే మీ మనుషులు ఇంతే కదా చేసిన మేలు మరిచి పోతారు, రాజు గారు మీ దగ్గరున్న బాణం తో నన్ను చంపి తీసుకెళ్లండి అని ఏడుస్తూ అంటుంది, జింక బాధ చూసి రాజు దాని మీద జాలి కలిగి రూరూ జింక నేను నిన్ను చంపాను నువ్వు వెళ్ళిపో అని జింక వదిలేస్తాడు, జింక రాజు కి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంద.
Moral Of The Story : ఎవరైనా మనకు మేలు
2. తెలివిగల నక్క ! Telugu Moral Stories
చాలా ఏళ్ల క్రితం ఒక అడవిలో ఒక సింహం, ఒక నక్క, ఒక చిరుత పులి ఉండేవి వాళ్ళు ముగ్గురూ చాలా మంచి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసి వెళ్ళేవారు, ఒక రోజు ముగ్గురు చెట్టు కింద కూర్చొని సరదాగ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్లకు ఒక కుందేలు కనిపిస్తుంది దాన్ని చూసి ముగ్గురు అబ్బా ఎంత బాగుంది ఈ కుందేలు దీన్ని తింటే చాల రుచగా ఉంటుంది అని అనుకుంటారు, కానీ నక్క తెలివి తో సింహం గారు ఈ కుందేలు చాలా చిన్నగా ఉండి మన ముగ్గురిలో ఎవరు తినాలి అని
అడుగుతుంది సింహం బాగ ఆలోచించి ఈ కుందేలు ను మనం ముగ్గురం కలిసి తినాలి అని అంటుంది సరే అని చిరుత మరియు నక్క ఒప్పుకుంటారు, అప్పుడు చిరుత సింహం మరియు నక్కతో, మీరు ఇద్దరు ఇక్కడే కూర్చోండి నేను వెళ్లి కుందేలు ను వేటాడి తీస్కొని వస్తాను అని అంటుంది, ఇద్దరు సరే వేళ్ళు అని అంటారు చిరుత నెమ్మదిగా కుందేలు దగ్గరికి వెళ్తుంది కానీ కుందేలు చిరుతను చూసి పారిపోతుంది చిరుత కూడా కుందేలు వెంటపడి దాన్ని చంపి సింహం మరియు నక్క దగ్గరికీ తీస్కొని వచ్చి పక పక నవ్వుతూ
చూసారా నా బలం అని అంటుంది, ఇక నక్క చిరుత తో మనము అనుకనట్టు దీన్ని మూడు భాగాలు చేసి తినాలి అని చిరుత కు సలహా ఇస్తుంది కానీ చిరుత కోపం తో నేను ఎంతో దూరం వెళ్లి దీన్ని వేటాడి తిస్కొచాను మూడు భాగాలు చెయ్యను, మీ ఇద్దరికీ కొంచం కొంచం ఇస్తాను అని అంటుంది ఇది విని సింహం కి కోపం వచ్చి చిరుత పై దాడి చేసి చిరుతను గాయపరుస్తుంది, అప్పుడు సింహం మూడు భాగాల చేస్తుంది ముగ్గురు సరి సమానంగా పంచుకుంటారు, కానీ నక్క సింహం తో సింహం గారు నాకు ఆకలిగా

లేదు నా వంతు కూడా మీరే తినేయండి అని అంటుంది సింహం సంతోషం తో నక్క వంతు కూడా తినేస్తుంది కొన్ని రోజులు అయ్యాక నక్కకు మళ్లీ ఒక కుందేలు దొరుకుతుంది నక్క సింహం మరియు చిరుత దగ్గరికి వచ్చి నేను ఈ రోజు కుందేలు వేట చేశాను మనం అనుకున్నట్టు ముగ్గురు కలిసి తినాలి అందుకని నేను ఈ కుందేలును మీ దగ్గరికి తెచ్చాను అని అంటుంది, ఇది చూసి సింహం మరియు చిరుత నక్కను మెచ్చుకుంటూ అబ్బా నువ్వు మంచి ఫ్రెండ్ నువ్వు చాలా న్యాయంగా ఉంటున్నవు అని అంటారు, ఈ సారి
కూడా నక్క ఏమి తినకుండా వెళ్ళిపోతుంది సింహం మరియు చిరుత ఇద్దరు కలిసి తినేస్తారు, అల చాల రోజులు గడిచిపోయాయి నక్క కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇక్కడ సింహం మరియు చిరుత అసలు నక్క ఎక్కడికి వెళ్లిపోయింది అంటూ దాన్ని వెతకడం మొదలు పెడతారు చాలా వెతికాక వాళ్లకు నక్క కనిపిస్తుంది ఇద్దరు నక్క దగ్గరికి వెళ్ళి అసలు ఎక్కడున్నావు మాతో ఎందుకు కలవడం లేదు అని అడుగుతారు అప్పుడు నక్క వాళ్ళతో నేను చాలా చిన్న జంతువుని మీరు ఇద్దరు చాలా బలశాలి
జంతువులు మీకు కోపం వొస్తే మీరు నన్ను కొట్టి చంపేస్తారు, అందువల్ల నేను మీకు దూరంగా ఉంటేనే మంచిదని మీకు దూరంగా వచ్చేసాను, ఇక నుండి నా బ్రతుకు నేను బ్రతుకుతాను దయ చేసి నన్ను వదిలేయండి నాకు మీ Friendship వొద్దు అని అంటుంది, ఇది విని సింహం మరియు చిరుత అక్కడి నుండి వెళ్ళిపోతారు.
Moral Of The Story : ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏమిటంటే, మనము చెడు స్నేహానికి దూరంగా ఉండాలి మనము కొంచం నష్టపోయిన పర్వాలేదు కానీ ఇలాంటి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
Soo Friends ఇది మన ఈ రోజు Top 2 Telugu Moral Stories On Friendship ! Telugu Moral Stories, మీ అందరికీ బాగా నచ్చాయి అని ఆశిస్తున్నాను, నా పేరు Yamini రేపు మరిన్ని నీతి కటలతో మళ్లీ మీ ముందు ఉంటాను ఇక సెలవు.
Also Read These Moral Stories : Best Neeti kathalu in Telugu