Top 2 Telugu Neeti Kathalu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు

Hii Friends నా పేరు Divya ఈ రోజు నేను మీ అందరి కోసము Top 2 Telugu Neeti Kathalu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి కామెంట్ చేసి మీ అభిప్రాయము తెలపండి.

1.పేద బ్రాహ్మణుడు ! Telugu Neeti Kathalu

అనగనగ ఒక ఊర్లో రామ అనే ఒక బ్రహమణుడు ఉండేవాడు, ఆటను చాలా పేదవాడు ఇంట్లో తిండానికి సరిగ్గా అన్నము కూడా ఉండకపోయేది, ఊర్లో బిక్షం ఆడుకుంటూ తన జీవితం గడిపేవాడు ఆ ఊర్లో ఒక సర్పంచు ఉండేవాడు, ప్రతి రోజు లాగే రామ బిక్షం ఆడుకుంటూ వెళ్తున్నాడు అప్పుడు సర్పంచు రామ ని దగ్గరికి పిలిచి నువ్వు చాలా మంచి వ్యక్తివి నువ్వు ఇలా బిక్షం ఆడుకోవడం నాకు నచ్చలేదు, కావున నేను నాకు రెండు ఆవాలు ఇస్తాను వాటిని తీసుకెళ్ళు నువ్వు పాలు అమ్ముకొని బ్రతుకు అని సర్పంచు రామ కి సలహా ఇస్తాడు, రామ సంతోషం తో సర్పంచు కి ధన్యవాదాలు చెప్పి

రెండు ఆవులను తనతో పాటు ఇంటికి తీస్కెళ్ళిపోతాడు, ఆ ఆవులను రామ ఎంతో ప్రేమగా పెచుకుంటాడు ఆలా కొన్ని రోజులకు ఆ రెండు ఆవులు పాలు ఇవ్వడము మొదలుపెడతాయి ఇక రామ పాలను అమ్ముకుంటూ బాగానే డబ్బులు సంపాదిస్తున్నాడు, ఆలా చూస్తూ చూస్తూ రామ అమ్ముకుంటూ ధనవంతుడు అయిపోయాడు, అదే ఊర్లో జగ్గు అనే ఒక దొంగ ఉండేవాడు వాడు రామ యొక్క ఆవులను ఎప్పటికైనా దొంగలించాలని అనుకుంటున్నాడు ఒక రోజు అద్ద రాత్రి జగ్గు రామ

ఆవులను దొంగలించానే ఉద్దేశం తో బయలుదేరాడు, ఆలా కాస్త దూరం వెళ్ళాక అతనికి ఒక రాక్షుసుడు ఎదురుగా వచ్చి ఒరేయ్ జగ్గు ఈ సమయం లో ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది, అప్పుడు జగ్గు రాక్షసుడి తో రాక్షసు గారు నేను రామ ఆవులు దొంగిలించడానికి వెళ్తున్నాను అని అంటాడు ఇది విని రాక్షసుడు నేను కూడా అన్నము తిని చాలా రోజులైంది నేను రామ ని తినేస్తాను నువ్వు వాడి ఆవులు దొంగతనము చేస్కో అని అంటుంది ఇది విని జగ్గు కాసేపు అలోచించి సరే అని

Top 2 Telugu Neeti Kathalu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు
Top 2 Telugu Neeti Kathalu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు

ఒప్పుకుంటారు ఇద్దరు కలిసి రామ ఇంటికి వెళ్తారు, నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లి చూడగా రామ నిద్ర పోతూ ఉంటాడు అప్పుడు రాక్షసుడు జగ్గు తో ఒరేయ్ జగ్గు నేను ముందు రామ ని తినేస్తాను తరవాత నువ్వు వాడి ఆవులను తీస్కెల్లిపో అని సలహా ఇస్తుంది కానీ జగ్గు లేదు లేదు నేనే ముందు ఆవులను దొంగలించుకొని వెళ్ళిపోతాను తర్వాత నువ్వు రామ ని తిను అని అంటాడు, కానీ రాక్షసుడు ఒప్పుకోదు ఆలా కాసేపు అయ్యాక ఇద్దరు గట్టిగ అరవడం మొదలుపెడతారు వాళ్ళ అరుపులకు రామ నిద్ర లేచి బయటక వస్తాడు వాళ్లిదరిని చూసి రామ ఆశచేర్యం తో వాళ్ళ వైపు చూస్తూ ఈ సమయం లో మీరు నా

ఇంటికి ఎందుకు వచ్చారు అని అంటాడు, అప్పుడు జగ్గు రామ తో రామ గారు రామ గారు ఈ రాక్షసుడు మీకు తినాలని వచ్చాడు కానీ నేను మీకు తినొద్దు అని వీడికి చెప్తున్నాను అని అంటాడు. ఇది విని రాక్షసుడికి కోపం వచ్చి లేదు రామ గారు ఈ జగ్గు దొంగ మీ ఆవులను దొంగలించాలనే ఉద్దేశం తో మీ ఇంటికి వచ్చాడు కానీ నేను వీడికి ఆలా చేయడం తప్పని చెప్తున్నాను అని అంటాడు, కాసేపు రామ ఇద్దరి మాటలు వింటాడు అప్పుడు ఇద్దరు అబద్ధము చెప్తున్నారని అర్ధం అయిపోతుంది, అప్పుడు

రామ ఇద్దరి తో సరే మీరు ఇద్దరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్లి ఒక కర్ర తీసుకొస్తాడు ఆ కర్రను చూసి ఇద్దరు ఈ కర్ర ఎందుకు తెచ్చావు అని అంటారు, అప్పుడు రామ ఆ కర్రపై కొన్ని మంత్రాలు వేసి కర్రను వాళ్లపై విసురుతాడు ఆ కర్ర వెళ్లి జగ్గు మరియు రాక్షసుడి కి వెళ్లి బాగా కొడ్తుంది ఆలా కొడుతూ కొడుతు ఇద్దరినీ బయటకు తరిమేస్తుంది, ఇద్దరు భయపడి రామ ఇంట్లో నుండి పారిపోతారు.

Moral Of The Story : మనము పరిస్తుతులకు అనుకూలంగా పనులు చేయాలి, ఎంత కష్టం వచ్చిన భయపడకుండా వాటిని ఎదురించాలి, ఎదురించేవాడే గెలుస్తాడు భయపడేవాడు ఎప్పటికి భయపడే బ్రతుకుతాడు.

2.గాడిది మరియు నక్క కథ ! తెలుగు స్టోరీస్ నీతి కథలు

చాలా ఏళ్ళ క్రితం ఒక ఊర్లో సాకలివాడు ఉండేవాడు అతని దగ్గర ఒక గాడిది ఉండేది దానిపేరు మోతీ, సాకలివాడు చాలా జిడ్డుగల వాడు అందువల్ల సాకలివాడు తన గాడిది కి సరిగ్గా అన్నం పెట్టేవాడు కాదు పాపం గాడిది తిండి లేక చాలా Week అయిపోయింది, ఒక రోజు సాకలివాడు పడుకోవడం చూసి గాడిది అక్కడి నుండి పారిపోయింది ఆలా అడవిలో అన్నం కోసం వెతుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయింది కానీ దానికి ఎక్కడ అన్నం దొరకలేదు చేసేది ఏమి లేక గాడిది ఒక చెట్టు కింద కూర్చుంటుంది అప్పడే

అక్కడి నుండి ఒక నక్క వెళ్తూఉంటుంది అది గాడిదిని చూసి అయ్యో గాడిది గారు మీకు ఏమైంది మీరు ఇంత బలహీనంగా ఎందుకు ఉన్నారు అని అడుగుతుంది అప్పుడు గాడిది నక్క తో నేను ఒక సాకలివాడి దగ్గర పని చేసేదాన్ని వాడు నాతొ రోజు చాలా పనులు చేయించుకునేవాడు కానీ నాకు అన్నం పెట్టేవాడు కాదు అందువల్ల నేను ఇలా బలహీనంగా అయ్యాను అని అంటుంది గాడిది, ఇది విని నక్కకు గాడిది పై జాలి కలిగి గాడిది గారు మీరు భయపకండి ఇక్కడ ఒక తోట ఉంది ఆ తోటలో

రకరకాల పళ్ళు కూరగాయలు ఉన్నాయి మీరు నాతొ రండి నేను మీకు తీసుకెళ్తాను అని అంటుంది, గాడిది ఒక్క నిమిషము కూడా ఆలస్యము చేయకుండా నక్క తో తోటకు వెళ్ళడానికి సిద్ధం అవుతుంది ఇద్దరు కలిసి తోటకు బయలుదేరుతారు, తోట చాలా దూరం ఉండడం వల్ల అక్కడికి వెళ్తూ వెళ్తూ బాగా చీకటి అయిపోతుంది, తోట దగ్గరికి వెళ్ళగానే నక్క గాడిది తో గాడిది గారు ఇదే ఆ తోట నాతొ రండి నేను మీకు లోపలికి తీసుకెళ్తాను అంటూ నక్క గాడిదిని లోపలికి తీసుకెళ్తుంది లోపలికి వెళ్ళగానే నక్క

Top 2 Telugu Neeti Kathalu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు
Top 2 Telugu Neeti Kathalu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు

చెప్పినట్టు ఆ తోటలో రకరకాల పళ్ళు కూరగాయలు కనిపిస్తాయి, ఆ పళ్ళు కూరగాయలను చూసి గాడిది వామ్మో ఇన్ని పళ్ళు కూరగాయలు నా కోసమేనా అంటూ తోటలోకి వెళ్లి గబ గబ పళ్ళు తినేస్తుంది, బాగా కడుపు నిండ తిన్నాక గాడిది నక్క తో నక్క గారు మీరు చాలా మంచి వారు ఈ రోజు నేను కడుపు నిండా అన్నము తిన్నాను అని అంటుంది, ఆలా ఇద్దరు చాల మంచి ఫ్రెండ్స్ అయిపోతారు, ఇక నుండి ఇద్దరు ప్రతి రోజు తోట్లొకి వెళ్లి పళ్ళు కూరగాయలు తిని వాళ్ళ కడుపులు

నింపుకుంటున్నారు ఆలా తింటూ తింటూ గాడిది కూడా బాగా బలిసిపోయింది, ప్రతి రోజు లాగే ఇద్దరు కలిసి మళ్ళి తోటలోకి వెళ్లి పళ్ళు కూరగాయలు తిన్నారు ఆ రోజు గాడిది తన కడుపుకి మించి తినేసింది, బాగా తిని తిని అక్కడే పడిపోయింది, అప్పుడు నక్క గాడిది దగ్గరికి వచ్చి గాడిది గారు లేవండి ఇంటికి వెళదాము అని అంటుంది ఇది విని గాడిది నక్క గారు నేను బాగా తినేసాను ఇక నడవడం నా వల్ల కాదు కాసేపు ఇక్కడే కూర్చొని పాటలు పాడుదాము అని అంటుంది, అప్పుడు నక్క

గాడిది తో అయ్యో గాడిది గారు నాకు పాటలు రవండి అని అంటుంది, ఇది విని గాడిది పక పక నవ్వుతు ఒసేయ్ నక్క నీకు పాటలు రావని నాకు తెలుసు నేను పాడుతాను నువ్వు విను అని అంటుంది, నక్కకు కోపం వచ్చి ఒసేయ్ గాడిది నువ్వు పాటలు పాడితే ని గొంతు విని ఈ తోట యజమాని వస్తాడు వచ్చి మన ఇద్దరినీ తరిమి తరిమి కొడతాడు కావున నువ్వు నా మాట విని పాట పాడకు అని అంటుంది, గాడిది అంటుంది ఒసేయ్ నక్క నేను పాటలు పాడి చాలా రోజులు అవుతుంది ఈ రోజు నేను

తప్పకుండ పాటలు పాడుతాను నువ్వు నా పాటలు వినాలి అని అంటుంది, అప్పుడు నక్క ఎలాగైనా సరే ఈ గాడిదికి బుద్ధి చెప్పాలని తన మనసులో అనుకుంటూ సరే గాడిది గారు మీరు పాటలు గట్టిగ పాడండి నేను వెళ్లి మీ కోసము పులా దండ తీసుకొస్తాను కానీ పులా తోట చాలా దూరంగా ఉంది మీరు పాటలు గట్టిగ పాడండి మీరు పాడే పాటలు నాకు పులా తోటలో వినపడాలి అని అంటుంది, ఇది విని గాడిది సంతోషం తో సరే నక్క గారు నేను గట్టిగ పాడుతాను నువ్వు వెళ్లి నా కోసము పూలమాల తీస్కొని

రా అని అంటుంది, ఆలా నక్క నెమ్మదిగా తోటలో నుండి వెళ్ళిపోతుంది గాడిది గట్టిగ కేకలు పెడుతూ తన దారిద్రమైన గొంతులో పాటలు పాడడం మొదలు పెడుతుంది ఆలా కాసేపు పాటలు పాడేక గాడిది గొంతు విని ఆ తోట యొక్క యజమాని ఒక రాడ్డు తీసుకొచ్చి గాడిదిని చూసి ఓహో నువ్వేనా ప్రతి రోజు నా తోటలో పళ్ళు కూరగాయలు తినేస్తున్నావు ఈ రోజు నిన్ను వదలను అంటూ రాడ్డు తీస్కొని ఇష్టం వచ్చినట్టు గాడిదిని కొడతాడు గాడిది అక్కడే పడిపోతుంది ఇదంతా దూరంగా నిలబడి నక్క చూస్తూ

ఉంటుంది అప్పుడు నక్క నేను చెప్పిన మాట వింటే ఈ రోజు గాడిదికి ఈ గతి పట్టేది కాదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

Moral Of The Story : ఆశ పడడం మంచిదే కానీ అత్యాశ పడడము మంచిది కాదు, ఎవరైనా మనకు ఏమైనా చెప్తే వాలు వాళ్ళు చెప్పింది ఒక సారి ఆలోచించాలి.

Also Read These : Top 2 Telugu Neeti Kathalu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు Top 2 Neethi Kathalu In Telugu

Telugu Moral Stories

Neeti kathalu in Telugu

Top Telugu Moral Stories

Leave a Comment

%d bloggers like this: