Top 3 Moral Stories In Telugu ! నీతి కథలు

Hii Friends నా పేరు Anjali ఈ రోజు నేను మీ కోసం Top 3 Moral Stories In Telugu ! నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయం Comment చేసి తెలియ చేస్తారు అని ఆశిస్తున్నాను

1. సాధు మరియు దొంగ కథ ! Telugu Stories

చాలా ఏళ్ళ క్రితం ఒక ఊరిలో ఒక సాధు ఉండేవాడు, అయన పేరు లింగప్ప ఆ ఊరిలో అయన ఒక్కొడే సాధు బాబా ఉండడం వల్ల ఊర్లో వాళ్లంతా ఆయనకే దానం చేసేవారు ఆ సాధు కూడా బాగా డబ్బులు సంపాదించుకున్నాడు, ఒక రోజు ఊర్లో ఇంకో సాధు బాబా వచ్చేశాడు ఇది చూసి లింగప్పా కు చాలా కోపం వచ్చింది, వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఓయ్ నేను ఈ ఊర్లో చాలా ఏళ్ళ నుంచి దానం అడుగుకుంటు

అన్నాను, ఈ ఊర్లో వాళ్లంతా నాకే దానం చేస్తారు ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉంటే నాకు దానం ఎవ్వరూ చేయరు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఆ కొత్త సాధు తో లింగాప్ప అంటాడు పాపం అయన అక్కడి నుండి వెళ్ళిపోతాడు, ఇక లింగాప్పా ఒక్కడే ఆ ఊర్లో దానం ఆడుకుంటూ ఉంటాడు అల చూస్తూ చూస్తూ ఆయన బాగా డబ్బులు సంపాదించుకుంటాడు కానీ ఆ ఊర్లో ఒక దొంగ ఉండేవాడు వాడి

Top 3 Moral Stories In Telugu ! నీతి కథలు
Top 3 Moral Stories In Telugu ! నీతి కథలు

పేరు రాజు, ఆ దొంగ సాధు కుడబెట్టుకున్న సొమ్ము పై కన్నేశాడు, ఎలాగైనా సరే సాధు దగ్గరున్న సొమ్మే దొంగలించలని ప్లాన్ వేసాడు ఒక రోజు సాయంత్రం సాధు దగ్గరికి వెళ్ళి బాబా నేను మీకు శిష్యుడి లా ఉంటాను, దయ చేసి నన్ను మీతో పాటు పెట్టుకోండి నేను మీకు బాగా సేవ చేస్తాను అని అంటాడు, మొదట్లో సాధు ఒప్పుకోడు కానీ ఆ దొంగ బాగా రిక్వెస్ట్ చేయడం వల్ల అయన సరే అని ఒప్పుకుంటాడు కొన్ని

రోజులు ఆ దొంగ సాధు కి బాగా సేవలు చేసేవాడు సాధు కూడా వాడు చేసిన సేవలను చూసి బానే సంతోషిస్తాడు, ఒక రోజు సాధు కి పక్క ఊర్లో పూజలు చేయాలి అని నిమంత్రణ వస్తుంది సాధు వెంటనే అతని శిష్యుడు తో అక్కడికి వేళ్ళని చెప్తాడు శిష్యుడు కూడా వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు, సాధు తన దగరున్న సొమ్మంతా ఒక మూటలో కట్టుకొని తన శిష్యుడి తో బయలుదేరుతాడు, అల ఇద్దరు కాస్త దూరం

వెళ్ళాక బాగా ఎండ ఉండడం వల్ల ఇద్దరు చెమట చెమట అయిపోతారు, అప్పుడు వాళ్లకు అక్కడ ఒక నది కనిపిస్తుంది ఆ నదిని చూడగానే సాధు తన శిష్యుడితో అంటాడు ఒరేయ్ శిష్యుడు నేను వెళ్లి నదిలో స్నానం చేసి వస్తాను, ఇదిగో నా సొమ్ము ఈ మూటలో ఉంది నువ్వు ఇక్కడే ఉండి నా సొమ్మును జాగ్రతగా పట్టుకో అని సొమ్ము ముట ను శిష్యుడి చేతికి ఇచ్చి సాధు నదిలో స్నానము కోసం నదిలో వెళ్తాడు, ఇక

శిష్యుడు అబ్బా నాకు కావాల్సింది కూడా ఇదే అని ఆ సొమ్ము మూటను తీస్కొని అక్కడి నుండి పరారు అయిపోతాడు, కాసేపు అయ్యాక సాధు స్నానం చేసి నదిలో నుండి బయటకి వచ్చి చూస్తే శిష్యుడు అయన మూట తీస్కొని వెళ్ళిపోతాడు, సాధు వాడి కోసం బాగా వేటుకుతాడు కానీ ఏమి ప్రయోజనం ఉండదు వాడు ఎక్కడికో పారిపోతాడు చేసేది ఏమీ లేక సాధు తన తల పట్టుకొని ఏడ్చుకుంటూ అక్కడే కూర్చుంటాడు

Moral Of The Story : మనము ఎప్పుడూ అత్యాశ పడకూడదు, కళ్ళు మూసుకొని ఎవ్వరికీ నమ్మరాదు

దోమ మరియు పెను కథ ! Small Stories In Telugu With Moral

అనగనగ అభిమన్యు అనే ఒక రాజు ఉండేవాడు, అయన మంచంలో ఒక పెను దక్కొన్ని ఉండేది ఆ పెను పేరు మని, తన మంచం లో పెను ఉన్న విషయం రాజు కి తెలీదు ప్రతి రోజు రాత్రి రాజు పడుకున్న తర్వాత పెను రాజు తలలో కి వెళ్ళి రాజు యొక్క రక్తం తాగేది అల ప్రతి రోజు చేసేది, ఒక రోజు రాత్రి ఆ గదిలోకి ఒక దోమ కూడా వచ్చింది, దోమను చూసి పెనుకు బాగా కోపం వచ్చీ దోమ దగ్గరికి వెళ్ళి ఓయ్ దోమ ఇక్కడి నుండి వెళ్ళిపో ప్రతి రోజూ రాజు రక్తం నేను త్రగుతాను ఇప్పుడు నువ్వు వొస్తే నాకు కూడా ఇబ్బాందే

వెళ్ళిపో అని గట్టిగ అరుస్తుంది, అప్పుడు దోమ పెను తో పెను గారు నేను తేలిక ఇక్కడికి వచ్చేసాను ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండడానికి అనుమతి యివండి బయట బాగా వర్షం పడుతుంది నా మీద జాలి చూపండి అని అంటుంది, పేనుకు దోమపై జాలి కలిగి సరే ఈ రోజు రాత్రి కి ఇక్కడే ఉండి పొద్దునే వెళ్లిపోవాలి అని అంటుంది, దోమ కూడా సరే నేను పొద్దున్నే వెళ్ళిపోతాను అని అంటుంది, అప్పుడు పెను

Top 3 Moral Stories In Telugu ! నీతి కథలు
Top 3 Moral Stories In Telugu ! నీతి కథలు

దోమతో ప్రతి రోజూ రాత్రి ఇక్కడ రాజు వచ్చి పడుకుంటాడు నువ్వు ఆయనను కరిచి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని అంటుంది, దోమ తన తెలివి ఉపయోగించి పెను గారు పెను గారు నేను మూడు రోజుల నుండి ఎవ్వరి రక్తం తాగలేదు నాకు బాగా ఆకలిగా ఉంది, మీరు ప్రతి రోజూ రాజు గారి రక్తం త్రాగుతారు కదా ఈ ఒక్క రోజు రాత్రి నేను రాజు గారి తియ్యని రక్తం తాగి వెళ్ళిపోతాను అని ఎంతో రిక్వెస్ట్ తో

అంటుంది, పెను దోమ యొక్క మాటల్లో పడిపోయి సరే ఈ రోజు రాత్రి నువ్వు రాజు రక్తం త్రాగు కానీ రాజు బాగా గాఢంగా నిద్ర పోయినప్పుడు వెళ్ళాలి అని అంటుంది, ఇక ఇద్దరు కలిసి రాజు కోసం ఎదురు చూస్తుంటారు కాసేపు అయ్యాక రాజు గదిలోకి వస్తాడు, రాజుని చూడగానే దోమ నోట్లో నీళ్ళు ఊరుతాయి ఇంక రాజు పడుకొక ముందే వెళ్లి రాజు కి దోమ వెళ్లి కరుస్తుంది రాజు నొప్పి తో అమ్మో దోమ కరిచింది అని

గట్టిగ అరుస్తాడు, వెంటనే సైనికులు గదిలోకి వచ్చేస్తారు అప్పుడు రాజు సైనికులకు నా గదిలో ఒక దోమ ఉంది అది నాకు కరిచింది వెంటనే ఆ దొమను వెతికి చంపేయండి అని అగ్నిస్తాడు సైనికులు గది మొత్తం వెతకడం మొదలుపెట్టారు వాళ్లకు రాజు మంచం కింద ఒక పెను కనపడుతుంది సైనికులు ఆ పెనును చంపేస్తారు, కానీ దోమ తప్పించుకొని అక్కడి నుండి పారిపోతుంది, ఎలా దోమ చేసిన తప్పు తో పాపం పెను ప్రాణం పోతుంది

Moral Of The Story : మనము ఎవరితో స్నేహం చేస్తున్నామో ఒక సారి వాళ్ల గురించి తెలుసుకోవడం మనకు చాలా అవసరం

తెలివి తక్కువ కోతి ! Small Moral Stories In Telugu Pdf

అనగనగ ఒక ఊర్లో గుడి కట్టుతు ఉంటారు గుడి కోసం కట్టెల అవసరం ఉంటుంది అందువల్ల కొందరు కట్టెలు కొట్టే వాళ్లు ఒక అడవిలో చెట్లు నరుకుతు ఉంటారు ప్రతి రోజూ మధ్యాహ్నం వాళ్ళు భోజనానికి వెళ్ళే వారు, గంట తర్వాత వచ్చ మళ్లీ పని మొదలు పెట్టేవారు ప్రతి రోజూ లాగే భోజనం సమయం అయ్యింది అందరూ భోజనం కోసం వెళ్తూ ఉంటారు అప్పుడు ఒక అయన సగం చెట్టు నరికి గొడ్డలి అందులోనే పెట్టీ వెళ్ళిపోతాడు, అప్పుడే అక్కడ ఒక కోతుల gang వస్తుంది, ఆ కోతుల gang లో

Top 3 Moral Stories In Telugu ! నీతి కథలు
Top 3 Moral Stories In Telugu ! నీతి కథలు

దాదాపు 20 కోతులు ఉంటాయి, వాళ్లకు ఒక రాజు కోతి ఉండేది ఆ కోతి అన్ని కోతులకు చెట్లు నరికే దగ్గరికి ఎవ్వరూ వెళ్లకూడదని హెచ్చరిస్తుంది కానీ ఆ కోతుల gang లో ఒక అల్లరి కోతి ఉంటుంది ఆ అల్లరి కోతి తన రాజు చెప్పిన మాటలు పట్టించుకోకుండా చెట్లు నరికే దగ్గరికి వెళ్తుంది, అక్కడికి వెళ్లి అన్ని కింద మీద చేస్తుంది చివరికి సగం నరికి ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మీద కూర్చొని సగం నరికిన చెట్టు ను బాగా వింతగా చూస్తూ అసలు ఈ గొడ్డలి సగం నరికి ఎలా ఎందుకు పెట్టారు అని బాగా

ఆలోచిస్తుంది, కోతి చెట్టు పై కూర్చొని గొడ్డలి నీ తిసెందు ప్రయత్నిస్తుంది బాగా ప్రయత్నం చేశాక చివరికి గొడ్డలి నీ తీసేస్తుంది కానీ దాని తోక వెళ్లి రెండు చెట్ల మధ్య ఇరుకొని పోతుంది అప్పుడు కోతి నొప్పి తో వామ్మో నా తోక వామ్మో నా తోక అని గట్టిగ కేకలు పెడ్తుంది, దాని కేకలు విని చెట్లు నరికే వాళ్ళందరూ అక్కడికి వస్తారు వాళ్ళను చూడగానే కోతి బాగా భయపడి ఒక్కసారిగా గట్టిగ తోకను లాగుతుంది అందువల్ల దాని తోక అక్కడే ఉండి పోతుంది ఆ కోతి తోక లేకుండానే పరిగెత్తు కుంటు వెళ్లి పోతుంది, ఇక మిగిలిన కోతులు దాన్ని చూసి బాగా నవ్వుతారు

Moral Of The Story : అతిగా అల్లర్లు చేస్తే మనకే ప్రమాదం

Also Read These Moral Stories : Top 2 Moral stories in Telugu ! తెలుగు నీతి కథలు

Neethi Kathalu In Telugu Small Stories ! తెలుగు స్టోరీస్ నీతి కథలు, 1 Best Story

Best Moral Stories In Telugu తెలుగు నీతి కథలు

Top 3 Neethi Kathalu In Telugu ! మంచి నీతి కథలు కావలి

Thanks For reading telugu moral stories keep visiting

Leave a Comment

%d bloggers like this: