Hii Friends నా పేరు శ్రీదేవి ఈ రోజ్ నేను మీ అందరి కోసం Top 3 Neethi Kathalu In Telugu ! మంచి నీతి కథలు కావలి అనే కథలు తీస్కొని వచ్చాను నీతి కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయంకామెంట్ చేసి తెలపండి
1. ఏనుగు మరియు టైలర్ ! Moral Stories In Telugu
చాల ఏళ్ళ క్రితం రామాపురం అనే ఒక ఊర్లో కృష్ణ అనే ఒక పూజారి ఉండేవాడేను, అయన గుడిలో పూజారిగా పని చేసేవాడు కృష్ణ దగ్గర ఒక ఏనుగు ఉండేది దాని పేరు గజరాజు, పూజారి తన ఏనుగు ని చాల బాగా చూసుకునేవాడు ఊర్లో వాళ్లందురు కూడా ఏనుగును చాల ప్రేమగా చూసేవారు పూజారి పార్టీ రోజు తనతో పాటు ఏనుగుని కూడా గుడికి తీస్కొని వచ్చేవాడు, ప్రతి రోజు సాయంత్రం పూజారి తన పని ముగించుకొని గుడికి తాళం వేసి ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆ ఏనుగు ని ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లి చెరువులో స్నానం చేయించి ఇంటికి తీసుకెళ్లే వాడు, ఆలా ఇంటికి వెళ్లే దారి ఒక టైలర్ షాప్ ఉండేది ఆ టైలర్ ప్రతి రోజు ఏనుగుకి ఒక అరటి పండు పెట్టేవాడు ఆలా ప్రతి రోజు దానికి అలవాటు అయ్యింది

రోజు లాగే పూజారి తన ఏనుగుని చెరువులో స్నానం చేయించి ఇంటికి తీస్కొని వెళ్తున్నాడు ఏనుగు నేరుగా టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళింది ఆ టైలర్ ఏనుగు ని చూడగానే ఈ రోజు ఏనుగు తో ఒక ఆట ఆడుకుందాము అని ఒక చేతి లో అరటిపండు పట్టుకొని ఇంకో చేతులో సూది పెట్టుకొని ఏనుగు దగ్గరికి వెళ్ళాడు, ముందు ఏనుగుకి అరటి పండు పెట్టాడు ఏనుగు అరటి పండు తింటూ ఉండగా ఇంకో చేతిలో ఉన్న సూది తీస్కొని ఏనుగు తొండం లో గుచ్చాడు ఆ టైలర్, ఏనుగు నొప్పి తో అరుస్తుంది పూజారి కూడా అక్కడే ఉన్నాడు కానీ అసలు ఏమయ్యిందో ఆయనకు అర్ధం కాలేదు, పూజారి తన ఏనుగు తీసుకుని అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోయాడు
రెండవ రోజు కూడా పూజారి తన ఏనుగుని తన పాటు గుడికి తీసుకెళ్లాడు రోజు లాగే చెరువు కి వెళ్లి ఏనుగు ని స్నానం చేయించి ఇంటికి తిరిగి వస్తున్నాడు అప్పుడు అయన నీళ్ల కోసం ఆగేడు, ఏనుగు నేరుగా ఆ టైలర్ షాప్ కి వెళ్లి నిలబడింది, టైలర్ ఏనుగు ని చూడగానే నవ్వుతు మళ్ళి వచ్చావా? ఈ రోజు ని పని చేస్తాను అని లోపలికెళ్ళి దాన్ని గుచ్చడానికి సూది పట్టుకొని వచ్చాడు, కానీ ఈ సారి ఏనుగు తన తొండం లో బాగా బురద నింపుకొని వచ్చింది ఈ విషయము ఆ టైలర్ కి తెలీదు, ఏనుగు ని
సూది గుచ్చడానికి టైలర్ సూది బయటకు తీసాడు వెంటనే ఏనుగు తన తొండం లో ఉన్న బురద ఆ టైలర్ షాపులో చెల్లేసింది, ఇందువల్ల ఆ బురద టైలర్ మీద పాడడం తో పాటు షాప్ లో ఉన్న అన్ని బట్టల పైన పడింది, అప్పుడు ఆ టైలర్ కి తానూ చేసిన తప్పు అర్ధమయ్యింది వెంటనే ఏనుగు కాళ్లు పట్టుకొని హే గజరాజ నేను చేసింది చాలా పెద్ద తప్పు నన్ను మన్నించు అని ఏనుగుతో క్షమాపణలు అడుగుతాడు ఏనుగు తలా ఊపుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది
Moral Of The Story : మనము ఎలా చేస్తామో అలాగే అనుభవిస్తాము
2. సూర్యుడు మరియు గాలి ! Neethi Kathalu In Telugu
ఒక సారి సూర్యుడు మరియు గాలి గొడవ పడుతూ ఉంటారు, ఇద్దరిలో బలవంతులు ఎవరు అని గొడవ పడుతూ ఉంటారు సూర్యుడు నేను నీ కన్నా బలవంతుణ్ణి అని అంటాడు ఇంకో వైపు గాలి సూర్యుడి తో నేను ని కన్నా శక్తిశాలి నేను తలచుకుంటే నా గాలి ప్రవాహం తో పెద్ద పెద్ద చెట్లు పీకేస్తాను నాతొ పెట్టుకోకు అని గాలి సూర్యుడిని హెచ్చరిస్తుంది, అప్పుడు సూర్యుడి గాలి తో ఇంత పొగరు మంచిది కాదు అని అంటాడు, ఐన సరే గాలి తన గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడి నుండి

ఒక వ్యక్తి Coat వేసుకొని వెళ్తూ ఉంటాడు ఆ వ్యక్తి ని చూడగానే సూర్యుడు కి ఒక idea వస్తుంది, సూర్యుడు గాలి తో అదిగో ఒక వ్యక్తి Coat వేసుకొని వెళ్తున్నాడు వాడి ఒంటి మీద నుంచి ఆ Coat మన ఇద్దరిలో ఎవరు తియ్యగలరో వల్లే గెలిచినట్టు అని అంటాడు, గాలి నవ్వుతు ఇంతేనా ? ఐతే నేను ముందు ప్రయత్నిస్తాను అని ఒక్కసారిగా గట్టిగ గాలి ఆ వ్యక్తి దగ్గరికి వెళుతుంది కానీ వ్యక్తి Coat తియ్యడు, ఇలాగైతే లాభం లేదని గాలి తనకున్న బలం అంతా ఉపయోగించి ఇంకా గట్టిగా
పరవహిస్తుంది, కానీ ఆ ఆవ్యక్తి Coat తియ్యడు ఆ Coat ని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా గాలి ఆ వ్యక్తి ఒంటి మీద నుంచి ఆ coat తీయలేక తిరిగి సూర్యుడి దగ్గరికి వెళ్లి నేను యెంత ప్రయత్నం చేసిన వాడు coat తీయడంలేదు, వెళ్లి నువ్వు ప్రయత్నం చెయ్యి అని అంటుంది, సూర్యుడు వెళ్లి కాస్త ఎండ చేస్తాడు అందువల్ల వ్యక్తి coat కొంచం లూజు చేస్తాడు , సూర్యుడు ఇంకా గట్టిగ ఎండ వేస్తాడు అప్పుడు ఆ వ్యక్తి కి బాగా ఉబ్బరించి తాను వేసుకున్న coat తీసేస్తాడు, వెంటనే గాలి సూర్యుడి తో నాతొ తప్పు అయ్యింది నువ్వే గెలిచావు అని సూర్యుడి తో చెప్పి వెళ్ళిపోతుంది
Moral Of The Story : మనకున్న బలాన్ని చూసి మనం ఎప్పుడు గర్వపడకూడదు మనకన్నా బకవంతులు కూడా ఉంటారు
3. నక్క కథ ! Telugu Moral Stories For Project Work
అనగనగ ఒక నక్క ఉండేది నక్క ఒక రోజు షికారు చేసి తిరిగి వాస్తుండగా దారిలో బాగా వర్షం పడుతుంది అందువల్ల నక్క వెళ్లి ఒక చెట్టు కింద కింద నిలబడుతుంది, వర్షం బాగా గట్టిగ పడడం వల్ల నక్క కాలు జారీ ఒక గుంటలో పడుతుంది తలకు గాయం అవుతుంది, అందువల్ల నక్క తన ఇంట్లోనే పడి ఉంటుంది, షికారు కి వెళ్లడం కూడా మానేసింది, కడుపులో అన్నం లేక ప్రాణం పోయేటట్టు ఉంది అప్పుడే నక్క కి ఒక జింక కనపడుతుంది, నక్క ఆ జింకను చూడగానే హమ్మయ్య జింక కనపడింది ఈ

జింకను ఎలాగైనా సరే పట్టుకోవాలి బాగా ఆకలిగా ఉందని నక్క పరిగెత్తుకుంటూ జింక దగ్గరికి వెళ్తుంది జింక నక్కను చూడగానే అక్కడి నిండి పారిపోతుంది నక్క కూడా దాన్ని వెంబడిస్తుంది కానీ జింక నాకు కు చిక్కదు నక్క ఎంత ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోతుంది, నక్క బాధ పడుతూ తిరిగి వెళ్తుండగా దానికి ఒక ఊరు కనిపిస్తుంది, ఆ ఉరిని చూసి ఈ ఊర్లో నాకు ఒక కోడి దొరికిన చాలు ఈ ర్రోజు రాత్రి గడిచిపోతుందని అనుకుంటూ ఊర్లోకి వెళ్తుంది, కోడ్ల రాత్రంతా తిరుగుతుంది కానీ దానికి
ఒక్క కోడి కూడా కనిపించదు, పైగా ఆ ఊర్లో ఉన్న కుక్కలు నక్క వెంట పడతాయి తన ప్రాణాలు కాపాడుకోవడానికి నక్క పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక నీలి రంగు లో దాకుంటుంది కుక్కలు నక్క కోసం చాల వెతుకుతాయి కానీ వాటికి నక్క కనిపించక పోవడం వల్ల కుక్కలు తిరిగి వెళ్లిపోతాయి, పాపం నక్క రాత్రంతా ఆ నీలి రంగులోనే దాకొని తన ప్రాణాలు కాపాడుకుంటుంది, తెల్లారి లేచి అడవి వైపు వెళ్తుండగా తన నీడ ఒక చెరువులో చూసుకొని అబ్బా నా రంగే మారిపోయూయింది నేను నక్క ను అని
నన్ను ఎవ్వరు గూతుపట్టలేరు అని అడవికి వెళ్లి అన్ని జంతువులను పిలిచి, నా రంగు ఎలాగుందో చెప్పండి అని అంటుంది జంతువులూ అందరు మీ రంగు నీలంగా ఉంది, అసలు మీరు ఎవరు నీలి రంగు జంతువూ మేము ఎప్పుడు చూడలేదు అని , అప్పుడు నక్క కు అర్థమైతుంది నన్ను ఎవ్వరు గుర్తు పట్టలేదని అప్పుడు నక్క తన తెలివి ఉపయోగనుంచి నన్ను దేవుడు పంపించాడు మీ అందరి సహాయం కోసం అని అంటుంది, జంతువులూ కూడా నక్క మాటలు నమ్మేస్తాయి, నక్కను దేవుడిలా
పూజిస్తారు జంతువులన్నీ నక్కను మంచి మంచి షికార్లు చేసి దానికి తెచ్చి ఇచ్చేవారు నక్క బాగా సంతోష పడుతూ తినేది, కానీ ఒక రోజు వర్షం బాగా పడుతుంది అందువల్ల నక్క బాగా తడిసిపోతుంది నక్క తడవగానే దానికి అంటిన నీలి రంగు నీళ్ళ ద్వారా కదిగిపోతుంది, రంగు అంతా పోయాక అది ఒక సదాహరణ నక్క లాగే కనపడనుండి, అప్పుడు అడవిలో ఉన్న జంతువులందరికి నక్క నిజ స్వరూపం తెలిసిపోతుంది అందువల్ల అందరు కలిసి నక్క మీద దాడి చేస్తారు, దాన్ని బాగా కుమ్మి అడవిలో నించి బయటకు గెంటేస్తారు
Moral Of The Story : మనము ఎలాంటి పరిస్థితి లో చిక్కుకున్న అబద్దాలు ఆడకూడదు ఏదో ఒక రోజు నిజం బయటకు తప్పకుండ వస్తుంది
Soo Friends ఇది మన ఈ రోజీ Top 3 Neethi Kathalu In Telugu ! మంచి నీతి కథలు కావలి, మీ అందరికి నచ్చాయి అనుకుంటాను మీ అమూల్యమైన అభిప్రాయము కామెంట్ చేసి తెలపండ, ఇంకో మంచి నీతి కథ తో రేపు మల్లి మీ ముందు ఉంటాను, ఇట్లు మీ ఫ్రెండ్ శ్రీదేవి Bye And Take Care
Also Read These Stories : Telugu Neeti kathalu ! మంచి నీతి కథలు
Top 2 Friendship Moral Stories In Telugu