Top 3 Telugu Moral Stories ! మంచి నీతి కథలు  

Hii friends నా పేరు రమ్య ఈ రోజు నేను మీకోసం Top 3 Telugu Moral Stories ! మంచి నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయం తెలపండి, ఐతే లేట్ చేయకుండా మన తెలుగు నీతి కథలోకి వెళ్లిపోదాము

1. మంచి నీతి కథలు ! Telugu Moral Stories

అనగనగా ఒక ఊర్లో రాము మరియు పద్మ అనే దంపతులు ఉండేవారు, పెళ్ళైన రెండు ఏళ్లకు పద్మ ఇద్దరు కవల పిల్లలను జన్మనిచ్చింది, అందులో ఒక బాబు ఒక అమ్మాయి ఉంటారు, రాము కి అబ్బాయి అంటే చాలా ఇష్టం అమ్మాయి పై ప్రేమ ఉండకపోయేది, రాము అబ్బాయికి మంచి మంచి బట్టలు మంచి మంచి ఆట బొమ్మలు తెచ్చి ఇచ్చేవాడు, అమ్మాయిని తక్కువ చూపు చూడడం వల్ల పద్మ చాల బాధ పడేది, ఒక రోజు రాము పద్మ తో మన పేదరికం వల్ల నేను ఇద్దరు పిల్లను పోషించడం చాలా కష్టం అయిపోతుంది, నాకు శ్యామ్ అని ఒక మిత్రుడు ఉన్నాడు వాడి దగ్గర బాగా డబ్బు ఉంది కానీ వాడికి పిల్లలు లేరు, మన అమ్మాయిని వాడికి ఇచ్చేదాము, వాడు మన అమ్మాయిని మన కన్నా చాలా బాగా చూసుకుంటాడు అని అంటాడు కానీ పద్మ ఒప్పుకోదు,

Top 3 Telugu Moral Stories ! మంచి నీతి కథలు  
Top 3 Telugu Moral Stories

రాము బాగా రిక్వెస్ట్ చేయడం వల్ల సరే అని ఒప్పుకుంటుంది రాము తన ఫ్రెండ్ శ్యామ్ ని పిలిచి అమ్మాయి వాడికి అప్పచెస్తాడు, సహాయం అమ్మయిని తీసుకెళ్లి చాలా బాగా చూసుకుంటాడు బాగా చదివిస్తాడు, ఇక్కడ రాము కూడా వాడి అబ్బాయిని బాగా చూసుకుంటాడు వాడు అడిగిందల్లా తీసుకొచ్చి ఇస్తాడు, ఆలా చూస్తూ చూస్తూ ఇరవై ఏళ్ళు గడిచిపోతాయి పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోతారు రాము కొడుకు నాన్న నాకు బైక్ కావాలని అడుగుతాడు రాము దగ్గర అంత డబ్బు లేకపోయినా తన భార్య పద్మ నగలు అమ్మి కొడుకుకి బైక్ కొనిస్తాడు, కొన్నాళ్ళు అయ్యాక రాము

కొడుకు నాన్న నాకు మొబైల్ షాప్ కావాలి అని అంటాడు రాము తన పొలం అమ్మి కొడుకుకి మొబైల్ షాప్ కొనిస్తాడు, ఇక రాము ఒక మంచి అమ్మయిని చూసి తన కొడుకు కి పెళ్లి చేసేతాడు, కొడుకు కొన్నాళ్ళు బాగానే ఉంటాడు తర్వాత భార్య మాటల్లో పడి రాము మరియు పద్మని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు, అప్పుడు రాము మరియు పద్మ ఏడుచుకుంటూ ఒక గుడి దగ్గరికి వెళ్తారు తినడానికి అన్నం కూడా ఉండదు, గుడి లో ఇచ్చిన ప్రసాదం తింటూ తమ జీవితం గడుపుతూ ఉంటారు, ఒక రోజు సాయంత్రం రాము యొక్క మిత్రుడు శ్యామ్ తన అమ్మయి తో కలిసి గుడికి వస్తాడు శ్యామ్ రాముని గుర్తుపట్టి ఒరేయ్ రాము ఏంట్రా ని పరిస్థితి ఇలా అయిపోయిందని బాధ పడుతూ

అడుగుతాడు రాము జరిగిందంతా శ్యామ్ తో చెప్తాడు అప్పుడు శ్యామ్ తన అమ్మాయి ని దగ్గరికి పిలిచి ఇదిగో నువ్వు ఇచ్చిన అమ్మాయి అని అమ్మాయి ని తన తల్లి తండ్రులతో కలుపుతాడు అమ్మాయి రాము మరియు పద్మ ను చూసి బాగా ఏడ్చుకుంటూ అమ్మ నాన్న మీరు ఇలా బిచ్చం ఆడుకుంటు బ్రతకడం నాకు ఇష్టం లేదు, నేను pilot నా జీతం నెలకు పది లక్షలు మీరు నాతొ ఉండండి అంటూ అమ్మాయి వాళ్ళని తన ఇంటికి తీస్కెళి కంటి కి రెప్పలా కాపుడుకుంటుంది, రాము మిత్రుడు శ్యామ్ కూడా బాగా సంతోష పడతాడు అందరు కలిసి ఒకే ఇంట్లో తమ జీవితం గడుపుతారు

Moral Of The Story : అబ్బాయి అమ్మాయి అనే తేడా లేకుండా పిల్లలను పెంచుకోవాలి

2. తెలివిగల పూజారి ! Telugu Moral Stories For Project Work

ఒక ఊర్లో ఒక బాగా డబ్బుగల సేటు ఉండేవాడు ఎంత డబ్బు ఉన్న ఇంకా డబ్బు కావాలి ఇంకా డబ్బు కావలి అని దేవుడిని మొక్కేవాడు, ఒక రోజు గుడికి వెళ్లి డబ్బు కావాలని మొక్కి ఇంటికి తిరికి వస్తుండగా అతని కాలు జారీ నది లో వెళ్లి పడతాడు నది లో నీళ్ల ప్రవాహం బాగా ఉండడంవల్ల సేటు నీళ్ళల్లో పోతూవుంటాడు, అప్పడు ఆ సేటు దేవుడిని తలచుకుంటూ, ఓరి దేవుడా నన్ను కాపాడు నేను ఇంటికి వెళ్లి 101 పూజారులను భోజనం చూపిస్తాను అని మొక్కుకుంటాడు అప్పుడు నీళ్ల ప్రవాహం కాస్త తగ్గి సేటు నదిలో నుంచి కొంచం బయటకు వచ్చి, అయ్యో అనవసరంగా 101 పూజారులను భోజనం చూపిస్తాను, 51 పూజారులను భోజనం చూపిస్తే సరిపోతుంది లే అని అంటాడు, ఇంకా కాస్త నది లో నుండి బయటకు వస్తాడు ఈ సారి 51పూజారులను భోజనం అవసరం లేదులే 11 పూజారులను

Top 3 Telugu Moral Stories ! మంచి నీతి కథలు  
Top 3 Telugu Moral Stories

భోజనం చూపిస్తే సరిపోతుందిలే అని ఆలా అంటూ అంటూ చివరికి 1 పూజారిని భోజం చూపిస్తాను అని డిసైడ్ అవుతాడు, ఇక ఇంటికి వచ్చి ఊర్లో వెళ్లి తక్కువు అన్నం తినే పూజారి కోసం వెతుకుతాడు,ఒక పూజారి ఇంటికి వెళ్లి పూజారిగారు మీరు అన్నం ఎంత తింటారు అని అడుగుతాడు ఆ పూజారి కూడా బాగా తెలివైన వాడు, నేను ఒక్క రొట్టె తింటే నా కడుపు నిండి పోతుంది బాబు అని అంటాడు, ఇది వినగానే సేటు బాగా సంతోషపడి పూజారి గారు రేపు పొద్దున్నే 9 గంటలకన్నా ముందు మా ఇంటికి రండి నేను మీకు అన్నం పెడతాను అని వెళ్ళిపోతాడు, ఉదయం 9 గంటలకు సేటు పూజారి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ పూజారి రాడు, పూజారి కావాలనే ఆలస్యం చేస్తాడు

అప్పుడు సేటు తన భార్య తో ఒక పూజారి వస్తాడు వాడికి అన్నం పెట్టి పంపిచేయి నాకు కొంచం పని ఉంది నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు, సేటు వెళ్ళిపోయాక పూజారి ఇంటికి వస్తాడు సేటు భార్య అన్నం తీసుకొచ్చి పెడ్తుంది పూజారి కడుపునిండా అన్నం తింటాడు, అన్నం తిని పూజారి సేటు భార్య తో మీ అయన అన్నం పెట్టక నాకు 100 రూపాయలు ఇస్తాను అని అన్నారు అని అంటాడు, సేటు భార్య అయన బయటకు వెళ్లరు నేను ఇస్తాను అని 100 రూపాయాలు పూజారికి ఇస్తుంది, పూజారి కడుపు నిండా అన్నం తిని 100 రూపాయలు తీస్కొని తన ఇంటికి వెళ్ళిపోతాడు, ఇంటికెళ్లి జరిగిందంతా తన భార్య తో చేపట్టాడు,

ఇక్కడ సేటు తన ఇంటికి చేరుకొని పూజారి కి అన్నం పెట్టావా అని అంటాడు సేటు భార్య పూజారి గారు కడుపు నిండా అన్నం తిని 100 రూపాయలు కూడా తీసుకెళ్లారు అని అంటుంది, ఇది వినగానే సేటు కి కోపం వచ్చి 100 రూపాయలు ఎందుకు ఇచ్చావు అని అంటాడు, సేటు భార్య మీరే ఇస్తానని అన్నారంట అందుకే నేను ఇచ్చేసాను అని అంటుంది, సేటు కోప్మ తో పూజారి ఇంటికి వైపు వెళ్తాడు సేటు వస్తుండగా పూజారి చూసి తన భార్య తో సేటు నాకోసం వస్తున్నాడు వాడు వచ్చి పూజారి ఎక్కడ అని అడుగుతే, పోదున్నే మీ ఇంట్లో అన్నం తిని వచ్చాడు ఇంటికి రాగానే చనిపోయాడు అని

అంటాడు, చెప్పినట్టే పూజారి భార్య సేతు తో అంటుంది, సేటు భయపడతాడు అప్పుడు పూజారి భార్య అంటుంది మీ వల్లే నా భర్త చనిపోయాడు ఇప్పుడు ఆయనకు తగల పెట్టాలన్న నా దగ్గర డబ్బు లేదు అని అంటుంది, సేటు భయపడి ఇదిగో 2000 రూపాయలు మీ ఆయనకు టిస్కెల్లి తగల పెట్టు అని డబ్బులు ఇచ్చి భయపడుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోతాడు, సేటు వెళ్ళిపోయాక పూజారి మరియు అతని భార్య బాగా నవ్వుకుంటారు

Moral Of The Story : మనమే తెలివిగల వాళ్ళము అని ఎప్పుడు అనుకోకూడదు మన కన్నా మేధావులు కూడా ఉంటారు

3. అత్యాశ నీతి కథలు ! Friendship Stories In Telugu

ఒక అడవిలో ఒక కొండా పై కోతుల గ్యాంగ్ ఉండేది ఆ కొండా పై కోతులు వేరే జంతువులను రానిచ్చేవి కాదు, కానీ ఒక రోజు పెద్ద పులి తన బెస్ట్ ఫ్రెండ్ ఐన కొంగ తో ఆ కొండా పై ఉండడానికి వచ్చింది, కోతులు పులి మరియు కొంగ ను చూసీ చాలా భయపడ్డారు, భయపడుకుంటూ పులి దగ్గరికి వెళ్లి పులి రాజా పులి రాజా మేము చాలా సంవత్సరాలుగు ఈ కొండా పై ఉంటున్నాము ఇప్పుడు మీరు కూడా ఇక్కడే వచ్చారు మీకు చూస్తుంటే మాకు భయం వేస్తుంది అని కోతులు అంటాయి, అప్పుడు పులి నవ్వుతు భయపడకండి నేను మిమల్ని ఏమి అన్నాను వెళ్ళండి అని కోతులని పంపిచేస్తుంది,

Top 3 Telugu Moral Stories ! మంచి నీతి కథలు  

కోతులు తిరిగి వచ్చేస్తాయి, కానీ కోతులకు పులి కొండా పై ఉండడం నచ్చలేదు ఎలాగైనా సరే పులి ని కొండా మీది నుంచి తరిమేయాలి అని paln వేశారు, ఒక రోజు పులి తన గుహ లో అన్నం తింటూ తన ఫ్రెండ్ ఐన కొంగ తో నేను అన్నం తిన్న తరువాత నీళ్ల కోసం చెరువు దాకా వెళ్ళవలసి వస్తుంది ఇక మీదట నేను అన్నం తిని నీళ్ల కోసం చెరువు దగ్గరికి వేళ్లను నాకోసం నువ్వు ఒక గిన్నె లో నీళ్లు ఇక్కడే తీస్కొని వచ్చి పెట్టు అని అంటుంది, పులి అన్నట్టే కొంగ ఒక గిన్నె లో నీళ్లు తీసుకొచ్చి పెట్టు తుంది, అప్పుడు కోతులు పులి కి నీళ్లు కావలి లేకపోతె అది చనిపోతుంది అని అనుకుంటాయి, కొంగ నీళ్లు తెచ్చి బయట పెట్టింది, కోతులు ఆ నీళ్ళని కింద పాడేసి అక్కడినుండి వెళ్లిపోతాయి, పులి కొంగ

తో ఒసేయ్ కొంగ నేను నీకు నీళ్లు తీస్కోనిరా అని చెప్పను కదా నువ్వు నీళ్లను తీసుకోని రాలేదా అని కోపం తో అంటుంది, కొంగ పులి రాజా నేను మీ కోసం నీళ్లు తెచ్చాను కానీ బాగా ఎండ ఉండడం వల్ల నీళ్లు ఎండకి ఆవిరి అయిపోయాయి అనుకుంటాను, నేను మల్లి వెళ్లి నీళ్లు తెస్తాను అని అంటుంది, కొంగ మల్లి నీళ్లు తెచ్చి బయట పెడ్తుంది, కానీ మల్లి కోతులు వచ్చి నీళ్లను పాడేసి వెళ్లిపోతాయి ఈ సారి పులి నీళ్ల కోసం బయటకు వచ్చి చూడగా నీళ్లు నువ్వు పులి కి చాలా కోపం వస్తుంది వెంటనే కొంగను పిలిచి నీకు ఒక సారి చెప్తే అర్ధం కాదా నీళ్లు ఎందుకు తేలేదు అని గట్టిగ అరుస్తుంది, కొంగ పులి రాజా నేను మీకోసం నీళ్లు తెచ్చాను కానీ కావాలనే ఎవరో నీళ్లు పడేస్తున్నారు అని అంటుంది కొంగ ఇంకో

సారి నీళ్లు తెచ్చి బయట పెడ్తుంది కానీ ఈ సారి పులి మరియి కొంగ అక్కడే దాక్కొని చూస్తూ ఉంటారు, ప్రతి సారి లాగే కోతులు వచ్చి నీళ్లు పడేస్తూ ఉంటారు ఒక్క సారిగా పులి పరిగెత్తుకుంటూ వెళ్లి కోతులను పట్టుకుంటుంది కోతులు వేణూకుతూ పులి రాజా మమల్ని వదిలెయ్యి ఇంకో సారి మేము నీళ్లు పడేయము అని యెంత రిక్వెస్ట్ చేసిన పులి వాళ్ళను వదలదు, చివరికి పులి సరే నేను మిమల్ని వదిలేస్తానా కానీ నాది షరతు అని అంటుంది కోతులు ఏంటి ఆ షరతు అని అంటాయి, అప్పుడు పులి మీరు బ్రతికి ఉన్నత కాలం నాకు బానిసలుగా బ్రతకాలి అని అంటుంది, అటు మింగలేక ఇటు కక్కలేక కోతులు చచ్చి నట్టు ఒప్పుకొని జీవితాంతం పులికి బానిసలుగా బ్రతుకుతాయి

Moral Of The Story : న్యాయంగా బ్రతికే వాడికి బ్రతకనివ్వాలి లేందంటే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి

Also Read These Stories : Top 4 Telugu Short Stories With Moral ! తెలుగు నీతి కథలు

Top 4 Telugu Kathalu ! తెలుగు నీతి కథలు

Top 6 Moral Stories In Telugu ! నీతి కథలు

Top 3 Motivational Moral Stories In Telugu ! నీతి కథలు

 Top 5 Small Stories In Telugu ! నీతి కథలు

Leave a Comment

%d bloggers like this: