Top 4 Best Moral Stories In Telugu ! తెలుగు నీతి కథలు

Hii Friends నా పేరు Navya ఈ రోజు నేను మీ అందరి కోసం Top 4 Best Moral Stories In Telugu ! తెలుగు నీతి కథలు తీస్కొని వచ్చను మీరు కథలు పురిగా చదువుతారు అని ఆశిస్తున్నాను

1. మూడు చేపల కథ ! Moral Stories In Telugu

అనగనగ ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి, ఆ ముగ్గురు చాలా మంచి స్నేహితులు కానీ మూడవ చాప చాలా మొండిది, ఒక రోజు సాయంత్రం రెండు చాపలు చెరువు వడ్డున వెళ్లి మాట్లాడుకుంటూ కూర్చున్నాయి, అప్పుడే ఆ చెరువు దగ్గరికి ఒక చాపలు పెట్టేవాడు వచ్చాడు అతను చెరువుని చూసి అబ్బా ఈ చెరువు ఎంత బాగుంది ఇందులో చాపాలు కూడా చాలా ఉంటాయి రేపు పోదున్నే వచ్చి ఇందులో ఉన్న చాపలన్నిటి పట్టుకొని వెళ్తాను అంటూ తనలో తానె అనుకుంటూ ఉంటాడు, వాడి

మాటలు రెండు చాపలు వింటాయి విని పరిగెత్తుకుంటూ వెళ్లి మూడవ చాపతో చెప్తాయి, కానీ మూడవ చాప వాళ్ళ మాటలు విని పక పక నవ్వుతు మీ ఇద్దరికీ ఏమైనా పిచ్చి పట్టిందా? మనము ఈ చెరువులో పది సంవత్సరాల నుండి ఉంటున్నాము, ఇక్కడికి ఎప్పుడు ఎవ్వరు చాపలు పట్టడానికి రాలేదు ఐన ఎవరికో భయపడి మనము మన చెరువు వదిలేసి వేరే చెరువులోకి వెళ్లడం మంచిది కాదు నేను మీ తో రాను కావాలంటే మీరు ఈ చెరువు వదిలేసి వెళ్ళండి నా రక్షణ నేను చేసుకుంటాను అని

 Top 4 Best Moral Stories In Telugu ! తెలుగు నీతి కథలు
Top 4 Best Moral Moral Stories In Telugu

అంటూఉంది, రెండు చాపలు కలిసి మూడవ చాపకు మాతో నువ్వు కూడా వచ్చేయి అని చాల చెప్తారు కానీ మూడవ చాప మొండికేసి నేను రాను మీరు వెళ్ళండి అని అంటుంది, చేసేది ఏమి లేక రెండు చాపలు అదే రోజు రాత్రి ఆ చెరువు వదిలేసి వేరే చెరువులోకి వెళ్లి పోతాయి, ఆలా చూస్తూ చూస్తూ తెల్లారుతుంది, వేటగాడు వల తీస్కొని చెరువు దగ్గరికి వస్తాడు తన వలను చెరువులోకి విసురుతాడు చాప వాడి వలలో చిక్కుకుంటుంది, వేటగాడు కొద్దీ సేపటి తరువాత వలను లాగుతాడు అందులో చాప

చిక్కుకొని ఉంటుంది ఆ చాపను ను చూసి వేటగాడు అబ్బా ఎంత పెద్ద చాప దొరికింది ఈ రోజు ఊర్లో వాళ్లందరికీ నా తరుపున విందుకు ఆహ్వానిస్తాను అంటూ నవ్వుతు చాపాను తన భుజాలపై వేసుకొని ఇంటికి తిరిగి వెళుతుంటాడు అక్కడే పక్క చెరువులో నుంచి ఆ రెండు చాపలు దాన్ని చూసి అయ్యయ్యో మన ఫ్రెండ్ చనిపోయింది మన మాట వినివుంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు అంటూ బాగా బాధపడతాయి

Moral Of The Story : మొండితనం ఎప్పుడు పనికి రాదు, ఇతరులు చెప్పినప్పుడు ఒక సారి ఆలోచించాలి, నేనే పెద్ద నాకే అన్ని తెలుసు అని ఎప్పుడు గర్వపడకూడదు

2. మూడు ఎద్దులు మరియు పులి కథ ! Telugu Stories For Kids

ఒక అడవిలో మూడు ఎద్దులు ఉండెడివి ఆ మూడు ఎద్దులు చాలా మంచి ఫ్రెండ్స్ ప్రతి రోజు ముగ్గురు కలిసి అడవిలోకి వెళ్లి గడ్డి తిని తిరిగి తమ ఇంటికి వచ్చేవి, అదే అడవిలో ఒక పులి కూడా ఉండేది ఆ పులి ఎప్పుడినుండో ఎద్దులను చంపి తినాలని అనుకుంటుంది, చాలా సార్లు పులి ఎద్దుల పై దాడి కూడా చేసింది కానీ ముగ్గురు ఎద్దులు కలిసి పులికే తరిమి కొట్టేవారు, ఇందువల్ల పులికి ఒక విషయం అర్ధం అయ్యింది అదేంటంటే ఈ ముగ్గురు ఎద్దులు కలిసి ఉంటె నేను వీళ్ళను చంపి తినలేను కావున

నేను ఈ ముగ్గురిని ఏదో రకంగా విడకొట్టాలి అని ప్లాన్ వేసి, ఒక రోజు ఎద్దుల దగ్గరికి వెళ్లి నన్ను మన్నించండి నేను చాలా సార్లు మీ ముగ్గురిపై దాడి చేసాను ఇక నుండి నేను మారిపోయాను మనం ముగ్గురం కలిసి ఉందాము అని అంటుంది, ఎద్దులు కూడా పులి మాటల్లో పడి, పులి నిజంగానే మారిపోయింది అనుకొని పులి తో friendship చేసుకుంటారు కొన్నాళ్ళు పులి బనే ఉన్నట్టు నటిస్తుంది, కొద్దీ రోజులు అయ్యాక ముగ్గురిలో గొడవలు పెడ్తుంది, అందువల్ల ముగ్గురు కొట్లాడుకుంటారు ఇదంతా

Top 4 Best Moral Stories In Telugu ! తెలుగు నీతి కథలు
Top 4 Best Moral Moral Stories In Telugu

చూసి పులి అబ్బా నేను అనుకున్నట్టే జరుగుతుంది అనుకుంటూ మనసులోనే నవ్వుకుంటుంది ఆలా ముగ్గురు ప్రతి రోజు గొడవలు పడేవారు ఒకరిని ఒకరు కొట్టుకునేవారు ఒక రోజు ముగ్గురు బాగా కొట్లాడుకొని ఇక నుండి మన మధ్య ఎలాంటి friendship లేదు ఎవరి దారి వాళ్ళు చూసుకోండి అని అనుకుంటాయి పులికి కూడా కావాల్సింది అదే, ఇక నుండి ముగ్గురు విడి విడిగా గడ్డి తినడానికి అడవిలోకి వెళ్లడం మొదలుపెట్టారు, ఎద్దులన్నీ విడిపోయాయి కాబ్బటి పులి వెళ్లి ఒక్కో ఎద్దుని చంపి

తినడం మొదలుపెట్టింది ఆలా రెండు ఎద్దులను తినేసింది, చివరికి ఒక ఎద్దు మిగిలింది దానికి పులి ప్లాన్ అర్ధం అయ్యింది కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది పులి ఒక రోజు మిగిలిన ఒక ఎద్దు ని కూడా చంపి తినేసింది

3. పిల్లి మరియు ఎలుక కథ ! Telugu Stories

చాలా ఏళ్ళ క్రితం ఒక కొండా పై దాదాపు వంద ఎలుకలు ఉండేవి, వాళ్ళందరూ చాలా కలిసి మెసలి ఉండేవారు ఎక్కడికి వెళ్లిన అందరు కలిసి వెల్లేవారు అంతా బానేఉంది కానీ ఒక రోజు ఆ కొండా పై ఒక పిల్లి వచ్చేస్తుంది పిల్లి ని చూసి ఎలుకలన్నీ భయపడి తమ తమ ఇళ్లలోకి పారిపోతాయి పిల్లి ఆ ఎలుకలను చూసి వామ్మో ఇక్కడ ఎన్ని ఎలుకలు ఉన్నాయి నేను నా జీవితాంతం అంతా ఇక్కడే ఉంటూ ఈ ఎలుకను తింటూ ఉండవచ్చు అని అనుకుంటుంది, అనుకంట పిల్లి కి ఆకలి

వేసినప్పుడల్లా ఒక ఎలుకను చంపి తినేసేది, ఆలా కొద్దీ రోజులయ్యాక ఎలుకల సంఖ్యా దగ్గవుతుంది అందువల్ల మిగిలిన ఎలుకన్ని ఒక దగ్గరికి చేరి మనము ఇలాగె వదిలేస్తే పిల్లి మన అందరిని కూడా తినేస్తుంది కావున మనము మన ప్రాణాలు కాపాడుకోడానికి ఏదో ఉపాయము చేయని అనుకుంటునుంటారు, అల మాట్లాడుకుంటూ చాలా సమయము గడిసిపోతుంది కానీ ఒక్క ఎలుకకు కూడా ఉపాయము తోచదు, అప్పడు ఆ ఎలుకల గుంపులో నుండి ఒక మొసలి ఎలుక వచ్చి మనము

 Top 4 Best Moral Stories In Telugu ! తెలుగు నీతి కథలు
Top 4 Best Moral Moral Stories In Telugu

పిల్లు నుండి మన ప్రాణాలు కాపాడుకోవాలి అంటే నా దగ్గర ఒక ఉపాయము ఉంది అని అంటుంది ఏలికలందరు ఏంటి ఆ ఉపాయము చెప్పు చెప్పు అని ఆ మొసలి ఎలుకను అడుగుతారు, అప్పుడు ఆ మొసలి ఎలుక మనము ఆ పిల్లి నుండి మన ప్రాణాలు కాపాడుకోవాలి అంటే పిల్లి మేడలో ఒక గంట కట్టాలి అప్పుడు పిల్లి వస్తునప్పుడల్లా గంట మోగుతుంది, మనము పారిపోయి మన ప్రాణాలు కాపాడుకోవొచ్చు అని సలహా ఇస్తుంది, ఇది విని ఎలుకలందరు అబ్బా ఎంత మంచి సలహా ఇచ్చావ్

ఇక మనము పిల్లి నుండి మన ప్రాణాలు కాపుదుకోవోచ్చు అని ఆనందంతో ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు, అప్పుడే ఒక తెలివైన ఎలుక వచ్చి ఒరేయ్ ఆపండ్రా మీ డాంసులూ, ఐడియా బానేఉంది కానీ పిల్లి మేడలో గంట ఎవడు కడతాడు అని గట్టిగా అరుస్తుంది, అప్పుడు ఎలుకలన్నీ మౌనంగా నిలబడతాయి, తెల్ల మోకాలు వేసుకొని ఏరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు మల్లి పిల్లి వస్తుంది ప్రతి రోజు ఒక ఎలుకను తినేస్తుంది ఆలా తింటూ తింటూ అక్కడున్న ఎలుకన్నిటిని తినేస్తుంది

Moral Of The Story : కేవలం idea ఉంటే సరిపోదు దానికి తగట్టు తెలివి తేటలు కూడా ఉండాలీ

4. కోతులు మరియు వ్యాపారి ! Telugu Moral Stories On Friendship

అనగనగ ఒక ఊర్లో రాము అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను టోపీలు అమ్మేవాడు ఊర్లో వాళ్ళందరూ రాము ని చూసి ఎంత మంచివాడు బాగా కష్టపడి టోపీలు అమ్ముకుంటాడు, అని మెచ్చుకునేవారు, ప్రతి రోజు లాగే రాము తన టోపీలు తీస్కొని అమ్మడానికి బయలుదేరాడు అది ఎండా కాలం కాబట్టి రాము బాగా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు దగ్గరికి వెళ్లి తన టోపీలు బుట్ట పక్కకు పెట్టి కాసేపు ఆ చెట్టు కింద పడుకున్నాడు, కానీ ఆ చెట్టు పై కోతులు ఉన్న సంగతి రాముకి తెలీదు రాము పూర్తిగా

నిద్రపోయాక కోతులు ఒకదాని తరువాత ఒకటి కిందికి దిగి రాము టోపీలు బుట్ట నుండి అన్ని టోపీలు తీస్కొని చెట్టు మీదికి వెళ్లిపోయాయి, కాసేపు అయ్యాక రాము నిద్ర లేచి చూడగా అతని బుట్టలో నుండి టోపీలు మాయమైపోతాయి రాము కంగారుపడి అటు ఇటు చుస్తూ ఉంటాడు అప్పుడు అతను చెట్టు పైకి చూడగా అసలు విషయము అర్ధం అవుతుంది, ఏమి చేయాలో అర్ధంకాని పరిస్థితి, రాము బాధపడుతూ తల గోకుంటూ ఉంటాడు అది చూసి కోతులు కూడా తల గోక్కుంటాయి రాము కి కోపం

 Top 4 Best Moral Stories In Telugu ! తెలుగు నీతి కథలు
Top 4 Best Moral Moral Stories In Telugu

వచ్చి ఒక రాయి తీస్కొని కోతుల పైకి విసురుతాడు కోతులు చెట్టుకున్న పళ్ళు తెంపి రాము మీదకు విసురుతారు, ఇప్పుడు రాము కి తన టోపీలు కోతుల నుండి తిరిగి ఎలా తీసుకోవాలో అర్ధం అయ్యింది, ఈ సారి రాము తన తలకున్న టోపీ తీసి కింద పడేస్తాడు అది చూసి కోతులు కూడా టోపీలన్ని చెట్టు మీద నుంచి కిందికి పడేస్తాయి ఇక రాము తన టోపీలు తీస్కొని అక్కడినుండి వెళ్ళిపోతాడు

Moral Of The Story : ఈ కథ ద్వారా మనము ఏం నేర్చుకున్నాము అంటే పరిస్టులు ఎలాంటివైనా సరే భయపడకుండా తెలివి తో పనులు చేసుకోవాలి

Also Read These Moral Stories : Best 4 Moral Stories In Telugu

Top Moral Stories In Telugu

Rat And Mouse Telugu Moral Stories

Top Best Moral Stories In Telugu

Leave a Comment

%d bloggers like this: