Top 4 Telugu Kathalu ! తెలుగు నీతి కథలు

Hii Friends నా పేరు Neha ఈ రోజు నేను మీ కోసం Top 4 Telugu Kathalu ! తెలుగు నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయం కామెంట్ చేసి తెలియచేయండి

1. తెలివైన జింక ! Moral Stories In Telugu

అనగనగ అడవిలో ఒక జింక ఉండేది దాని పేరు చున్నీ, చున్నీ ఇంటి పక్కన ఒక పెద్ద నది ఉండేది ఆ అడవి లో ఉన్న జంతువులూ ఆ నది దగ్గరికి ఎవ్వరు వెళ్లేవారు కాదు ఎందుకంటె జంతువులూ అందరు నది లో దయ్యం ఉంది అని భావించేవారు, ముఖ్యంగా చీకటి పడ్డాక నది దగ్గరికి ఎవరైనా వెళ్తే తిరిగి రారు అని అనేవారు, అదే అడవిలో ఒక కుందేలు కూడా ఉండేది ఆ కుందేలు పేరు జోలీ,

Top 4 Telugu Kathalu ! తెలుగు నీతి కథలు
Top 4 Telugu Kathalu

జోలీ మరియు చున్నీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఒక రోజు చున్నీ ఇంట్లో ఫంక్షన్ ఉందని చున్నీ అడవిలోని అన్ని జతువులకు తన ఇంటికి ఆహ్వానించింది, జ్నతువులు అందరు చున్నీ ఇంటికి చేరుకున్నారు అందులో చున్నీ ఫ్రెండ్ ఐన కుందేలు {జోలీ} కూడా వచ్చింది అందరు కలిసి బాగా ఎంజాయ్ చేసారు, ఫంక్షన్ పూర్తీ అయ్యింది ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు అప్పుడు చున్నీ తన ఫ్రెండ్ జోలీ తో అన్నది ఈ రోజు రాత్రి నువ్వు ఇక్కడే ఉండిపో పొద్దున్నే వెల్దువు అని అన్నది

జోలీ సరే అని ఆ రాత్రి చున్నీ ఇంట్లో ఉండిపోయింది ఇద్దరు పడుకున్నారు అప్పుడు జోలీ కి బాగా దాహం వేసింది జోలీ కి ఆ దయ్యలా నది గురించి తేలికపోవడం వల్ల, నీళ్ల కోసం అది నది దగ్గరికి వెళ్ళింది అంతలో ఆ నది లో ఒక పెద్ద మొసలి తన వైపు వస్తుంది, జోలీ పరిగెత్తుకుంటూ చున్నీ దగ్గరికి వచ్చింది అప్పుడు చున్నీ జోలీ తో ఏమైంది నువ్వు ఎందుకు ఆలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అన్నది, అప్పుడు జోలీ నేను నీళ్ల కోసం నది దగ్గరికి వెళ్ళాను అందులో ఒక పెద్ద మొసలి నా వైపు

వస్తుంది నేను భయపడి పరిగెత్తుకుంటూ వచ్చాను అని అన్నది, అప్పుడు చున్నీ అంటుంది అయ్యో నేను నీకు చెప్పడం మర్చి పోయాను ఆ నది లో ఒక పెద్ద రాక్షసి ఉంటుంది అక్కడికి వేళ్ళ కూడదు అని అనగా, జోలీ లేదు లేదు అందులో రాక్షసుడు లేదు ఒక పెద్ద మొసలి ఉంది అని అంటుంది, వెంటనే చున్నీ అడవిలోని అన్ని జంతువుల దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి వలందరిని నది దగ్గరికి తీసుకెళ్లి చూడగా నది లో ఏమి కనిపించదు,

అప్పుడే ఒక కోతి కి మొసలి కనిపిస్తుంది కోతి అక్కడ మొసలి ఉంది అని గట్టిగ అరుస్తుంది, వాళ్ళ అరుపులకు మొసలి నీళ్లలో నుంచి బయటకు వచ్చి హ హ హ అంటూ నవ్వుతు నేను మీ అందరిని తినేస్తాను అని అంటుంది, మొదట మొసలి ఒక ఎలుక ను పట్టుకుంటుంది, అప్పుడు జింక మొసలి రాజా మొసలి రాజా అది ఒక చిన్న ఎలుక దాన్ని తింటే మీ కడుపు ఎలా నిండుతుంది కావాలంటే మీరు నన్ను తినండి అని అంటుంది కానీ ఇదంతా జింక Plan, వెంటనే మొసలి ఎలుక ను వదిలేస్తుంది

జింక మొసలి దగ్గరికి వెళ్లి మీరు నన్ను తినాలంటే ముందుగా మీ పరిచేయం ఇవ్వండి అని మాటల్లో పెడుతుంది, మొసలి కూడా జింక యొక్క మాటల్లో పడిపోతుంది, అప్పుడు ఒక పావురం ఎగురు వచ్చి మొసలి కళ్ళల్లో పొడుస్తుంది అందువల్ల మొసలి కి కళ్ళు కనిపించవు అది గుడ్డిది అయిపోతుంది, అప్పుడే అన్ని జంతువులూ కలిసి మొసలి పై దాడి చేస్తాయి, మొసలి కి ఏమి తోచక తోక ముడుచు కుంటూ నీళ్ళలోకి నీళ్ళలోకి వెళ్ళిపోయుంది, మల్లి తిరిగి ఎప్పుడు రాదు అడవిలో జంతువులూ ఏ భయం లేకుండా తమ జీవనాన్ని గడుపుతారు

Moral Of The Story : అందరు కలిసి చేస్తే ఏ పని అయిన సాధ్యమే !

2. పిరికి రాయి ! Neethi Kathalu

ఒక ఊర్లో ఒక శిల్పాలు చెక్కే వాడు ఉండేవాడు, శిల్పాలు చెక్కడానికి అతనికి మంచి రాయి కావాలని అతను మంచి రాయి వెతుకుంటూ ఒక అడవిలోకి వెళ్ళాడు, బాగా వెతికాక అతనికి ఒక మంచి రాయి కనిపించింది ఆ రాయి ని చూడగానే శిల్పకారుడు అబ్బా ఈ రాయి ఎంత బాగుంది దీనితోనే నేను శిల్పాలు చెక్కుతాను అని ఆ రాయి ని తన సంచిలో వేసుకొని వస్తున్నాడు, అతనికి దారిలో ఇంకో రాయి కనిపించింది చూడటానికి ఆ రాయి కూడా బానేవుందని ఆటను ఆ రాయి ని కూడా తన సంచి

Top 4 Telugu Kathalu ! తెలుగు నీతి కథలు
Top 4 Telugu Kathalu

లో వేసుకుని ఇంటికి వచేసాడు, ఇంటికి వచ్చి ఆ రెండు రాళ్లను తీసి ఒక రాయి పై శిల్పం చెక్కడానికి సుత్తి తో ఒక చిన్న దెబ్బ కొట్టేడు అప్పుడు ఆ రాయి వామ్మో నొప్పి నువ్వు సుత్తి తో కొడుతూఉంటే నాకు చాల నొప్పి పెడ్తుంది దయ చేసి నన్ను వదిలేయి, ని దగ్గర ఇంకో రాయి ఉంది కదా దాన్ని చెక్కు అని అంటుంది, అప్పుడు శిల్పకారుడు కి జాలి వేసి సరే అని దాన్ని వదిలేసి ఇంకో రాయి తీస్కొని దాన్ని చెక్కడం మొదలుపెడతాడు ఆ రాయి ఏమి అనదు, శిల్పకారుడు ఆ రాయి ని బాగా చెక్కి ఒక దేవుడి విగ్రహం చేస్తాడు

అప్పుడు ఊర్లో వాళ్ళు ఆ దేవుడి విగ్రహం చూసి దీన్ని ఇంట్లో కాదు గుడి లో పెడితే పుణ్యం ఉంటుంది అని ఆ రాయి ని తీసుకెళతారు, దానితో పాటు ఆ పిరికి రాయి ని కూడా టిస్కెల్లి గుడి బయట పెడతారు లోపలున్న రాయికి ప్రతి రోజు పాలతో స్నానం చేపించి పూజ చేసేవారు, బయటున్న రాయి పై కొబ్బరికాయలు కొట్టేవారు, అప్పుడు ఆ పిరికి రాయి వామ్మో నూపి వామ్మో నొప్పి అని యెంత అరిచినా దాని అరుపులు ఎవ్వరికి వినపడవు, ఆలా జీవితాంతం అది నొప్పి భరిస్తూ ఉంటుంది

Moral Of The Story : ఏది జరిగిన మన మంచి కోసమే జరుగుతుంది, దాన్ని మనం మార్చే ప్రయాతం చేయకూడదు

3. వజ్రాలు ! Neethi Kathalu In Telugu Small Stories

అనగనగ ఒక ఊర్లో రైతు ఉండేవాడు అతని పేరు రాము, రాము చాలా కష్ట జీవి రోజంతా తన పొలం లో పని చేసేవాడు, రాము ఇంట్లో తన భార్య తో పాటు అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, కానీ నలుగురు కొడుకులు ఏమి పని చేసేవారు కాదు కనీసం వాళ్ళ నాన్నకు పొలం పనిలో సహాయం కూడా చేసేవారు కాదు, రాము తన భార్య తో మన నలుగురు కొడుకులు ఏ పని చేయరు వాళ్ళ భవిషత్తు ఏమైపోతుంది అని అలోచించి బాధ పడేవాడు, రాము భార్య బాధపడకండి అని రాము తో చెప్పేది

అనుకోకుండా రాము కి ఒంట్లో బాగాలేక పొలం లో పని కి వెళ్లడం మానేసాడు అప్పుడు రాము భార్య తన కొడుకులతో ఒరేయ్ బాబు మీ నన్ను కు ఒంట్లో బాగాలేక అయన పొలం లో పనికి వెళ్లడం మానేశారు, మీ నలుగురు వెల్లులి పొలం లో పని చేయండి అని అంటుంది, అప్పుడు ఆ నలుగురు కోపం తో వాళ్ళ తల్లి గాసిరేస్తారు, ఆమె ఏడుచుకుంటూ వెళ్లి తన భర్త రాము తో జరిగిందంతా చెప్తుంది, రాము బాధ పడకు అని తన భార్య తో అంటాడు, అప్పుడే నలుగురు కొడుకులకు కేకేసి పిలుస్తాడు నలుగురు వస్తారు, రాము అంటాడు ఒరేయ్ బాబు నాకు ఒంట్లో బాగా ఉండడం లేదు నేను ఎక్కువ

Top 4 Telugu Kathalu ! తెలుగు నీతి కథలు
Top 4 Telugu Kathalu

రోజులు బ్రతకను కానీ నేను చచ్చే ముందు మీకు ఒక రహస్యం చెప్పాలి అంటాడు, నలుగురు కొడుకులు ఏంటి ఆ రహస్యం చెప్పు అని అనగా, రాము అంటాడు ఒరేయ్ బాబూ నేను మన పొలం లో వజ్రాలు దాచి పెట్టాను నేను చనిపోయాక మీ నలుగురు కలిసి మన పొలం లో తవ్వి ఆ వజ్రాలను తీస్కొని హాయ్ గా బ్రతకండి అని అంటాడు, ఈ మాట వినగానే నలుగురు బాగా సంతశోష పడతారు కొన్ని రోజుల తరవాత రాము చనిపోతాడు, ఇక నలుగురు కొడుకులు పొలానికి వెళ్లి వజ్రాల కోసం

పొలం లో తవ్వుతూ ఉంటారు ఉదయం నుండి రాత్రి వరకు తవ్వుతూ ఉన్టారు యెంత తవ్వినా వాళ్లకు వజ్రాలు దొరకవు, వెళ్లి వాళ్ళ తల్లి తో అమ్మ మేము నలుగురం పొలం అంత తవ్వేశాము కానీ మాకు వజ్రాలు దొరకలేదు నాన్న మన తో అబధం చెప్పేడు అని అంటారు, అప్పుడు తల్లి ఒరేయ్ బాబు మీ నాన్న పొలం లో ఏమి దాచి పెట్టలేదు, ఇప్పుడు ఎలాగో పొలం తవ్వేరు కదా ఈ విత్తనాలు తీసుకెళ్లి పొలం లో చల్లండి అని నలుగురు చేతికి విత్తనాలు ఇస్తుంది వాళ్ళు విత్తనాలు తీసుకెళ్లి పొలం లో చల్లుతారు, కొన్నాళ్ళకు పంట వస్తుంది, ఆ పంట తో వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు వాళ్ళ జీవితం సుఖంగా గడుపుకుంటారు

Moral Of The Story : కష్టపడితేనే సుఖం అనుభవిస్తావు

4. కష్టజీవి ! Friendship Moral Stories In Telugu

అనగనగ ఒక ఊర్లో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు, ఒకరి పేరు రామ్ ఇంకోడి పేరు శ్యామ్, రామ్ దైవం గల మనిషి ఇంకో పక్క శ్యామ్ కష్టజీవి రామ్ రోజు గుడి కి వెళ్లి పూజలు చేసేవాడు శ్యామ్ పొలంలోకి వెళ్లి కష్టపడేవాడు, ఇద్దరు కలిసి ఒక ఎకరం పొలం కొన్నారు ఆ పొలం లో చెరుకు పండించారు, రోజు లాగే రామ్ గుడికి వెళ్లి పూజలు చేసేవాడు శ్యామ్ పొలం లో బాగా కష్టపడుతున్నాడు ఆలా చూస్తూ చూస్తూ పంట చేతికి వచ్చింది రామ్ మరియు శ్యామ్ ఇద్దరు కలిసి బజారు కి వెళ్లి తమ

Top 4 Telugu Kathalu ! తెలుగు నీతి కథలు
Top 4 Telugu Kathalu

పంట అమ్మి డబ్బులు ఇంటికి తెచ్చుకున్నారు, ఇప్పుడు రామ్ అంటున్నాడు ఒరేయ్ ఈ డబ్బు లో 75% నాకు కావలి ఎందుకంటె నేను రోజు గుడి కి వెళ్లి మన పంట కోసం దేవుడిని కోరుకున్నాను అని అంటాడు, అప్పుడు శ్యామ్ అంటాడు ఒరేయ్ నేను రాత్రి పగలు కష్ట పడితే ఈ పంట వచ్చింది 75% నాకు కావలి అని అంటాడు, కానీ ఎవ్వరు ఒప్పుకోరు అందుకని ఇద్దరు కలిసి నేరుగా ఆ ఉరి సరాపంచు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు ఇద్దరి మాటలు విని సరాపంచు ఇద్దరికీ ఒకో బియ్యం సంచి ఇస్తాడు అందులో సగం రాళ్ళూ సగం బియ్యం ఉంటాయి, ఇచ్చి ఇంటికి వెళ్లి ఈ బియ్యం లో నుండి రాళ్లు

వీరి రేపు పొద్దున్న నా దగ్గరికి రండి అని పంపించేస్తాడు, శ్యామ్ రాత్రంతా మేలుకొని బియ్యం లో నుండి రాళ్లు వెరీ తీస్కొని వస్తాడు ఇది చూసి సరాపంచు బాగా సంతోష పడతాడు, సరాపంచు ఇక రామ్ సంచి విప్పి చూడగా బియ్యం లో రాళ్లు అలాగే ఉంటాయి అప్పుడు సరాపంచు ఏంటి రామ్ నువ్వు రాళ్ళ వేరలేదా అని అడుగుతాడు రామ్ అంటాడు సర్పంచు గారు నేను బియ్యం సంచి టిస్కెల్లి గుడి లో పెట్టి దేవుడి తో రాళ్ళూ ఏరి పెట్టు అని అన్నాను కానీ దేవుడు నాకు సహాయం చేయలేదు అని అంటాడు, అప్పుడు సర్పంచ్ చూడు రామ్ దేవుడు కూడా కష్టపడే వాళ్లకే సహాయం చేస్తాడు అని అంటాడు

Moral Of The Story : మనం మన కష్టాన్నే నమ్ముకోవాలి

Alos Read These Stories : Top 6 Moral Stories In Telugu ! నీతి కథలు

Top 3 Motivational Moral Stories In Telugu ! నీతి కథలు

 Top 5 Small Stories In Telugu ! నీతి కథలు

Top 15 Moral Stories In Telugu ! 15 నీతి కథలు

Telugu Kathalu ! తెలుగు కథలు

Leave a Comment

%d bloggers like this: