Hii Friends నా పేరు Neha ఈ రోజు నేను మీ అందరి కోసం Top 6 Moral Stories In Telugu ! నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయం కామెంట్ చేసి తెలియ చేయండి
1. చీమ మరియు పావురము ! Telugu Moral Stories On Friendship
అనగనగ ఒక చీమ దాహం వేసి నీళ్ళు కోసం అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది దానికి ఎక్కడ నీళ్ళు దొరకవు అల వెళ్తూ వెళ్తూ దానికి ఒక నది కనిపిస్తుంది నది ని చూడగానే చీమ హమ్మయ్య నీళ్ళు దొరికాయి ఇక నా దాహం తీరిపోయింది అని పరిగెత్తుకుంటూ నది వైపు వెళ్తుంది, నీళ్ళు త్రాగి తిరిగి వస్తుండగా చీమ కాలు జారీ నది లో పడిపోతుంది, నీళ్ల ప్రవాహం బాగా ఉండడం వల్ల చీమ నీళ్లలో కొట్టుకొని పోతుంది అప్పుడు ఒక పావురం చెట్టు పై కూర్చొని ఏడాదంతా గమనిస్తూ ఉంటుంది పావురం వెంటనే వెళ్ళి నది లో ఒక ఆకు వేస్తుంది చీమ ఆ ఆకు పట్టుకొని బయట పడుతుంది

అప్పుడు చీమ మరియు పావురం ఇద్దరు మంచి స్నేహితులు అయిపోతారు, ఒక రోజు వేటగాడు అడవిలోకి వేట కోసం వస్తాడు వచ్చి పావురం నీ తన వలలో వేసుకుంటాడు, అప్పుడు పావురము నన్ను కాపాడండి అని గట్టిగ అరుస్తుంది ఆ అరుపులు విని చీమ పరిగెత్తు కుంటు వచ్చి వేటగాడి యొక్క చెవిలో పోతుంది వేటగాడు వల వదిలేసి వామ్మో నా చెవిలో ఏమో వెళ్ళింది అని తన చెవులు దులుపుకుంటు ఉంటాడు ఈ లోపే పావురం వల లో నుంచి తప్పించుకొని ఎగిరిరిపోతుంది
Moral Of The Story : మనం మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది
2. అబద్ధాలు ! Telugu Short Stories With Moral
అనగనగ ఒక అబ్బాయి ఉండేవాడు అతని పేరు రాము, రాము ఒక మంచి అబ్బాయి కానీ వాడి దగ్గర ఒక చెడు అలవాటు ఉండేది ఆ చెడు అలవాటు ఏంటంటే వాడు అబద్ధాలు బాగా చెప్పేవాడు ఒక రోజు పొలం లో పని చేస్తుండగా వామ్మో పులి వచ్చింది పులి వచ్చింది అని గట్టిగ అరిచాడు, ఇది విని చుట్టూ పక్కన పొలం లో పని చేస్తున్న వారు అందరూ పరిగెత్తుకుంటు రాము దగ్గరికి వచ్చారు వచ్చి చూస్తే అక్కడ పులి లేదు, అందరూ రాము తో అన్నారు ఒరేయ్ పులి పులి అని అరిచావు కదా ఎక్కడ ఉంది పులి అని అనగా రాము అన్నాడు పులి లేదు ఏమి లేదు నేను ఏదో సరదాగా అన్నాను అని అన్నాడు

అందరూ తిగిరి వెళ్ళిపోయారు, కాసేపు అయ్యాక రాము మళ్లీ వామ్మో పులి వచ్చింది పులి వచ్చింది అని గట్టిగ అరిసాడు, చుట్టూ పక్కన పొలం లో పని చేస్తున్న వారు అందరూ విన్నారు కానీ ఈ సారి ఎవ్వరూ వెళ్ళలేదు, అప్పుడు అందులో ఒక్కొడు అన్నాడు రాము మళ్లీ మనని ఆట పట్టిస్తున్నాడు ఈ సారి ఎవ్వరూ వెళ్ళకూడదు అని అంటాడు, రాము గట్టిగ అరుస్తూ ఈ సారి పులి నిజంగానే వచ్చింది అని అంటాడు కానీ వాడి మాటలు ఎవ్వరూ నమ్మరు, కానీ ఈ సారి పులి నిజంగానే వచ్చి రాము నీ తినేస్తుంది
Moral Of The Story : మనము ఒక్కసారి అబద్ధాలు చెబితే ఇంకో సారి నిజం చెప్పినా మాట మాట ఎవ్వరూ నమ్మరు, అందుకే అనవసరంగా అబద్ధాలు చెప్పి మన మాట విలువ పోగొట్టుకోకుడడు
3. తెనాలి రామ కథలు ! Small Moral Stories In Telugu
చాలా సంవత్సరాలు క్రితం విజయనగరంలో ప్రతి రోజూ దొంగతనాలు జరిగివే, అప్పుడు అక్కడి రాజు కృష్ణదేవరాయ ఆ రాజ్యం లో ప్రజలందరూ ప్రతి రోజూ రాజు దగ్గరికి మా ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేవారు ఇదంతా చూసి రాజు కి కూడా ఏమి చేయాలో అర్థం కాలేదు, ఒక రోజు రాజు తన అందరూ మంత్రుల భేటీ అయ్యి మన రాజ్యం లో ఈ మధ్య బాగా దొంగతనాలు జరుగు తున్నాయి ఎలాగైనా సరే ఈ దొంగతనాలు ఆపాలి అని మంత్రులందరికి చెప్పాడు, ఆ మంత్రుల్లో తెనాలి రామ ఒకడు

ఈ మాట విని తెనాలి రామ చాలా చింత లో పడ్డాడు ఎలాగైనా సరే దొంగలను పట్టుకోవాలి అని ఆలోచించి ఇంటికి వెళ్ళాడు, అతని ఇంట్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది దాని వెనక ఇద్దరు దొంగలు గుస గుసలు మాట్లాడుతున్నారు, తెనాలి రామ కి అర్థమైంది విల్లే దొంగలని అప్పుడు తెనాలి రామ తన భార్య తో దొంగలు వినేటట్టుగా గట్టిగ మన రాజ్యం లో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి నీ నగలు ఇంట్లో పెట్టడం మంచిది కాదు, నీ నగలు మనం ఒక ఇనుప డబ్బాలో వేసి మన బావిలో వేసేస్తే దొంగలు అనుమానం రాదు నీ నగలు భద్రంగా కూడా ఉంటాయి అని ఒక పెద్ద రాయి బావిలో వేశాడు వేసి ఇంట్లో కి వెళ్లిపోయినట్లు
నట్ఇంచి నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి రాజు నీ వెంట పెట్టుకొని వచ్చాడు, ఈ లోపు దొంగలు బావిలో దిగి నగల కోసం వెతుకుతున్నారు రాజు వెంటనే తన సైనికులతో విల్లని పట్టుకుంది ఆని ఆదేశించాడు, సైనికులు వాళ్ళను పట్టుకొని బంధించారు, రాజు తెనాలి రామ తెలివి తేటలు మెచ్చుకొని ఆయనకు బహుమతి గా ఒక గుర్రం ఇచ్చాడు
Moral Of The Story : పరిస్తుతులు ఎలా ఉన్నా సరే మనము శాంతించి ఆలోచిస్తే మనకు దాని పరిష్కారం దొరుకుతుంది
4. కలలు ! Panchatantra Stories In Telugu With Moral
ఒక ఊర్లో కమల అనే మహిళ ఉండేది, ఆమె దగ్గరా నాలుగు బర్రెలు ఉండేవి ఆ బర్రెలు ప్రతి రోజూ పది లీటర్లు పాలు ఇచ్చేవి, కమల ప్రతి రోజూ బజారు కి వెళ్లి పది లీటర్ల పాలు అమ్మి డబ్బులు సంపాదించేది ఒక రోజు కమల మనసు లో ఇంక ఎన్నాళ్ళు నేను ఇలా పాలు అమ్ముతూ బ్రతకాలి నేను కూడా పెద్ద ఇంట్లో మహారాణి లా ఉండాలి నా దగ్గర కూడా కార్లు ఉండాలని కోరిక పుట్టింది, కమల ఆ రోజు రాత్రంతా పడుకోలేదు ఎలాగైనా సరే నేను బాగా డబ్బులు సంపాదించాలి అన్న కోరిక తనలో పొంగిపోయింది

పొద్దున్నే లేచి కమల తన బర్రెల దగ్గరికి వెళ్ళి పాలు తీసింది బజారుకు వెళ్తుండగా దానికి ఒక బుర్ర లేని idea వచ్చింది ఆ idea ఏంటంటే, ఇంకా ఎన్నాళ్ళు నేను ఇలా పది లీటర్లు పాలు అమ్మి బ్రతకాలి ఒకే సారి బర్రెల్లో ఉండే పాలు మొత్తం తీసేసి అమ్మితే నాకు బాగా డబ్బులు వస్తాయి నేను త్వరగా ఇల్లు నగలు కొనుకుంటాను అని ఆశపడి ఆ బర్రెలను తీసుకెళ్లి ఒక కతికేవాడికి ఇచ్చి అన్న దీని కడుపులో పాలు మొత్తం ఒకేసారి తియ్యి అని అన్నది వాడు కూడా దానిలాగే బుర్ర లేనివాడు వాడు ఆ నాలుగు బర్రెలను కోసి చూడగా అందులో పెండ తప్ప పాలు లేవు
Moral Of The Story : ఎక్కువగా ఆశ పడితే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది
5. బంగారు కొంగ ! Telugu Moral Stories For kids
అనగనగా ఒక ముసలమ్మా ఉండేది ఆమెకు ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు, వాళ్ళు చాలా పేదవాళ్ళు ఒక పుట తింటే ఇంకో పుట తినడాకి ఏమి ఉండకపోయేది, ఒక రోజు వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక కొంగ ఎగురుకుంటూ వచ్చింది ఆ కొంగ ప్రత్యేకత ఏంటంటే దానికి బంగారు రెక్కలు ఉండేవి, కొంగ ఆ ముసలమ్మా మరియు తన అమ్మాయిలా పేదరికం చూసి జాలిపడి వాళ్లకు తన బంగారు రెక్కలల్లో నుండి ఒక పూసూరు తీసి ఇచ్చింది , ఆ రెక్క పూసూరు తీస్కెళ్ళి బజారు లో అమ్మి మీకు కావాల్సిన వస్తువులు కొనుకోండి అని కొంగ అన్నది, ముసలమ్మా ఆ బంగారు రెక్క తీసుకెళ్లి బజారులో అమ్మి బాగా డబ్బులు తెచ్చింది, ఆలా ఆ కొంగ ప్రతి రోజు ఒక బంగారు రెక్క ఇచ్చేది చూస్తూ చూస్తూ ఆ ముసలమ్మా

దగ్గర బాగా డబ్బు అయిపోయింది కానీ ఆమె కు ఆశ తీరలేదు, ఆమె తన అమ్మాయిలతో అన్నది ఈ రోజు కొంగ మన ఇంటికి వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని ఈ సారి మొత్తం రెక్కలు పీకేసుదాము మనకు ఒకే సారి చాలా డబ్బులు వస్తాయి అని అన్నది, ప్రతి రోజు లాగే కొంగ వచ్చింది ప్రతి రోజులాగే వాళ్లకు ఒక బంగారపు రెక్క ఇచ్చి వెళ్తుండగా వెనక నుండి ముసలమ్మా కొంగను గట్టిగ పట్టుకొని గట్టిగ దాని రెక్కలు పీకడం మొదలుపెట్టింది, కానీ రెక్కలు బంగారని కి బదులు మాములు కొంగ రెక్కలు గా మారిపోయాయి, ముసలమ్మా వచ్చెర్యం తో కొంగ వైపు చూస్తూ ఇదేంటి ని బంగారపు రెక్కలు ఏం అయిపోయాయి అని అంటుంది, కొంగ నవ్వుతూ అంటుంది నీలో ఆశా ఎక్కువ అయ్యింది అందువల్లే నా బంగారపు రెక్కలు మాములు రెక్కలుగా మారాయి అని ఎగిరిపోతుంది
Moral Of The Story : ఉన్న దాంట్లోనే సద్దుకోవాలి ఎక్కువగా ఆశ పడితే, దురాశ తప్ప ఏమి మిగలదు
6. ఏనుగులు ! Telugu Moral Stories For Project Work
ఒక ఊర్లో సర్కస్ జరుగుతుంది ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి సర్కస్ చూడడానికి వెళ్లారు అక్కడ వాళ్ళు రక రకాల ఆటలు చూసారు, చివరికి ఒక ఏనుగుల గుంపు తమ ఆటలు చూపించింది ఆ ఏనుగుల ఆటను చూసి ఊర్లో వీళ్లంతా బాగా ఆనంద పడ్డారు అందరు చప్పట్లు కొట్టేరు, ఆట గూగిసింది అందరు తమ తమ ఇళ్లకు బయలు దేరారు, అప్పుడు ఆ సర్కస్ మాస్టర్ తన ఏనుగులను టిస్కెల్లి ఒక సన్న తాడు తో కడతాడు అప్పుడు ఆ ఊరు సరాపంచు వెళ్లి ఆ సర్కస్ మాస్టర్ తో బాబు నువ్వు ఇంత పెద్ద పెద్ద ఏనుగులను ఇంత సన్న తాడు తో కడితే ఏనుగులు ఈ తాడు తెంపుకొని పారిపోతే ఎలా అని అంటాడు

అప్పుడు సర్కస్ మాస్టర్ అంటాడు సర్పంచు గారు ఈ ఏనుగులు ఎక్కడికి వెళ్లవు ఎందుకంటె ఇవి చిన్నగా ఉన్నపుడు వీటి ని ఇదే తాడు తో కట్టేవాళ్ళం ఇవి చిన్నగా ఉన్నపుడు ఈ సన్న తాడుని తెంపడానికి బాగా ప్రయత్నం చేశాయి కానీ సన్న తాడు తెగ లేదు అందువల్ల వాటికి ఈ తాడు మేము తెంపలేము అని అర్ధం అయిపోయింది, ఇప్పుడు ఈ ఏనుగులు తలచుకుంటే దీనికన్నా లావు తాడు ని తెంపేస్తాయి కానీ ప్రయత్నం చేయవు అని అంటాడు
Moral Of The Story : ప్రయతనం చేస్తే నే నీకు ఫలితం దక్కుతుంది, నువ్వు ప్రయతనం చేయకుండానే ఓడిపోతే అది నీలో ఉన్న లోపం
Also Read These : Top 3 Motivational Moral Stories In Telugu ! నీతి కథలు
Top 5 Small Stories In Telugu ! నీతి కథలు
Top 15 Moral Stories In Telugu ! 15 నీతి కథలు
Telugu Stories With Moral ! నీతి కథలు తెలుగు