Hii Friends నా పేరు Jasmine ఈ రోజు నేను మీ అందరి కోసము Top Best Moral Telugu Stories ! Akbar Birbal Stories ఫ్రెండ్స్ మనము అందరం అక్బర్ మరియు బీర్బల్ కథలు చాలా విన్నాము కదా, ఈ రోజు నేను మీకు అందులోనే ఒక మంచి కథ చెప్పబోతున్నాను ఐతే ఇంకా ఆలస్యము చేయకుండా స్టార్ట్ చేద్దాము
1. పచ్చని గుర్రం ! Moral Telugu Stories
ఒక రోజు అక్బర్ తన సలహాదారుడైన బీర్బల్ తో పచ్చని గడ్డి లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు, ఆ పచ్చని గడ్డిని చూసి అక్బర్ బీర్బల్ ని ఆటపట్టిస్తూ బీర్బల్ ఈ గడ్డి ఎంత పచ్చగా ఎంత బాగుంది కదా, ఈ పచ్చని గడ్డి లో ఒక పచ్చని గుర్రం పై తిరగాలని నా కోరిక, “పచ్చని గుర్రం ఎక్కడ ఉండదని అక్బర్ కి తెలుసు” ఐన కానీ కావాలని బీర్బల్ తో నాకు అక్బర్ నాకు వారం రోజుల్లో ఒక పచ్చని గుర్రం కావాలి అని అంటాడు, ఇది విని బీర్బల్ అక్బర్ తో మహారాజు గారు ఈ ప్రపంచము లో పచ్చని గుర్రం ఎక్కడ
ఉండదు అని అంటాడు, అక్బర్ కోపం తో నువ్వు ఎక్కడి నుండి తెస్తావో నాకు తెలీదు కానీ నాకు ఒక్క వారం లో పచ్చని గుర్రం కావాలి లేకపోతె జీవితం లో నువ్వు నాకు ని మొకం చూపించకు అని అంటాడు, బీర్బల్ కొంచం సేపు ఆలోచించి సరే మహారాజు గారు ఒక వారం లోపు నేను మీ కోసము పచ్చని గుర్రం తెస్తాను అని అంటాడు, ఇది విని అక్బర్ లోలోపలే నవ్వుతు సరే వేళ్ళు అని అంటాడు బీర్బల్ ఇంటికి వెళ్లి ఆ రోజు రాత్రి అంతా పడుకోకుండా మహారాజు కోసం పచ్చని గుఱ్ఱము ఎక్కడి
నుండి తీస్కొని రావాలి అని ఆలోచిస్తాడు, ఆలా చూస్తూ చూస్తూ తెల్లారిపోతుంది బీర్బల్ పొద్దున్నే ఊరంతా పచ్చని గుర్రం కోసం వెతుకుతాడు కానీ అతనికి ఎక్కడ పచ్చని గుర్రం కనపడదు, నిరాశ తో సాయంత్రము ఇంటికి చేరుకుంటాడు, అప్పుడు బీర్బల్ భార్య ఏమైంది మీరు ఎందుకల ఉన్నారు అని అంటుంది అప్పుడు బీర్బల్ తన భార్య తో జరిగిందంతా చెప్తాడు, చెప్పిందంతా విని బీర్బల్ భార్య విని, ఏవండీ మన ఊర్లో ఎక్కడ పచ్చని గుర్రం లేదు కావున మీరు వేరే ఊర్లకు వెళ్లి ఒక సారి వెతకండి

అని సలహా ఇస్తుంది, పచ్చని గుర్రం ఎక్కడ ఉండదని బీర్బల్ కి కూడా తెలుసు ఐన కానీ తన భార్య మాట కాదనకా రెండవ రోజు చుట్టూ పక్కల అన్ని ఊర్లకు వెళ్లి పచ్చని గుర్రం కోసం వెతుకుతాడు అక్కని ఎక్కడ దొరకదు, బిర్బాల్ సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేస్తాడు తన భార్య తో నేను చుట్టూ పక్కల అన్ని ఊర్లు తిరిగాను కానీ నాకు ఎక్కడ పచ్చని గుర్రం కనిపించలేదు అని అంటాడు, ఆల చూస్తూ చూస్తూ వారం గడిచి పోతుంది, అప్పుడు అక్బర్ తన సైనికులను బిర్బాల్ ఇంటికి పంపి
బీర్బల్ ని పిలిపిస్తాడు, బిర్బాల్ అక్బర్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు అక్బర్ బిర్బాల్ తో బీర్బల్ నీకు ఇచ్చిన వారం గడిచింది నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నాకు పచ్చని గుర్రం తెస్తన్నాను అని అన్నావు కదా, నా పచ్చని గుర్రం తెచ్చావా? అని అడుగుతాడు ఇది విని బీర్బల్ తన తెలివి తేటలు ఉపయోగించి మహారాజు గారు నేను మీ పచ్చని గుర్రం కోసం చాలా వెతికాను చివరికి నాకు ఒక ఊర్లో గుర్రం దొరికింది, కానీ ఆ గుర్రం యొక్క యజమాని నాకు గుర్రం ఇవ్వన్నన్నాడు అని అంటాడు ఇది
విని అక్బర్ కి చాలా కోపం వస్తుంది, అప్పుడు అక్బర్ కోపం తో గట్టిగ అరుస్తూ ఎవడు వాడు నాకు వాడి పేరు చెప్పు నేను ఇప్పుడే నా సైనికులను పంపించి వాడి తల నరికేస్తాను అని అంటాడు, ఇది విని బీర్బల్ నవ్వుతు మహారాజు గారు వాడు నాకు గుర్రం ఇవ్వను అని అన్నాడు కానీ మీరు స్వయం వెళ్లి అడిగితె మీకే ఇస్తాను అని అన్నాడు కావున మీరే వెళ్లి పచ్చని గుఱ్ఱము తెచ్చుకోండి అని అంటాడు, అప్పుడు అక్బర్ సరే నేను స్వయం వెళ్లి గుర్రం తెచ్చుకుంటాను ఎప్పుడు వెళ్ళాలి అని అంటాడు
అక్బర్, బీర్బల్ బాగా అలోచించి మహారాజు గారు, వాడు మీకు వారంలోని రెండవ సోమవారం రోజు రమన్నాడు అప్పుడు మీకు గుర్రం ఇస్తానని చెప్పాడు అని అంటాడు, ఇది విని అక్బర్ ఆశ్ఛరము తో బీర్బల్ నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? వారం లో ఒకే సోమవారం ఉంటుంది కదా నీకు ఆ మాత్రమూ తెలివి లేదా అని అంటాడు, అప్పుడు బీర్బల్ పక పక నవ్వుతు మహారాజు గారు వారం లో ఒకే సోమవారం అసాధ్యము అలాగే ఈ భూమి మీద పచ్చని గుర్రం కూడా అసాధ్యము అని అంటాడు, ఇక అక్బర్ బీర్బల్ తెలివి తేటలకు మెచ్చుకొని బీర్బల్ ను వజ్రాల హారం తో సన్మానిస్తాడు.
Moral Of The Story : మనకున్న తెలివి తేటలను ఉపయోగించుకొని మనము ఎలాంటి పారిస్తుతుల నుండి ఐన బయట పడవచ్చు.
2. భార్యా భయము ! Telugu Stories
ఒక రోజు సాయంత్రం అక్బర్ మరియు బీర్బల్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, అప్పుడు బీర్బల్ మహారాజు అక్బర్ తో మహారాజా గారు ఈ ప్రపంచము లో అందరు తమ భార్యలతో భయపడతారు అని అంటాడు, అప్పడు అక్బర్ బీర్బల్ తో నువ్వు ఎం మాట్లాడుతున్నావు అసలు నీకు బుర్ర ఉందా ? అప్పుడు బీర్బల్ నేను చెప్పేది నిజమే మహారాజు గారు అని అంటాడు, కానీ అక్బర్ బీర్బల్ మాటలను నమ్మాడు నువ్వు ఎలా నిరూపించగలవు అని అంటాడు, బీర్బల్ అంటాడు
మహారాజు గారు రేపు పొద్దునే మీరు మన రాజ్యము లో ఒక ప్రచారం ఏంటంటే మన రాజ్యము లో ఎవరైతే తమ భార్యలతో భయపడతారో వాళ్ళు రాజు దగ్గరికి ఒక కోడి ని తెచ్చి బలి ఇవ్వాలి అని అంటాడు, మహారాజు బీర్బల్ చెప్పినట్టే ప్రచారం చూపిస్తాడు ప్రచారం చేసిన వెంట నే ఊర్లో ఉన్న మగాళ్లు వందల సంఖ్యలో కోడ్లు తెచ్చి మహారాజు దగ్గర కోడ్లను బలి ఇస్తారు అప్పుడు బీర్బల్ మహారాజు తో చూసారా మహారాజా ఎంత మంది తమ భార్యలతో భయపడతారో అని అంటాడు, కానీ
అక్బర్ చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోతాడు ఆలా చూస్తూ చేస్తూ రాజభవనం లో కోడ్లు నిండిపోతాయి, బీర్బల్ వెంటనే అక్బర్ దగ్గరికి వెళ్లి మహారాజు గారు మన రాజభవనం లో కోడ్లు నిండిపోతున్నాయి మీరు వెంటనే ఈ ప్రచారము ఆపేయండి అని అంటాడు, అక్బర్ తన సైనికులను పిలిచి తానూ చేసిన ప్రచారము రద్దు చూపిస్తాడు, ఇక బీర్బల్ మహారాజు గారు ఇప్పుడైనా ఒప్పుకుంటారా మన రాజ్యలో ఎంత మంది మగాళ్లు తమ భార్యలతో భయపడతారో అని అంటాడు, కానీ అక్బర్ ఇప్పుడు కూడా నేను

ఒప్పుకోను నువ్వే వెళ్లి మన రాజ్యములో యేవో మాయమాటలు చెప్పి ఉంటావు అందువల్ల అందరు వచ్చి ఇక్కడ కోడ్లు బలి చేస్తున్నారు అని అంటాడు, అప్పుడు బీర్బల్ బాగా అలోచించి మహారాజు గారు మన పక్క రాజ్యము లో ఒక రాజకుమారి చాలా అందంగా ఉంది మీరు ఆజ్ఞ ఇస్తే నేను వెళ్లి మీ పెళ్లి విషయాలు ఆ రాజకుమారి తో మాట్లాడుతాను అని అంటాడు, అక్బర్ ఆశచేర్యం తో ఓయ్ బిర్బాల్ నీకు ఏమైనా మతి పోయిందా? నాకు ఈ వయసులో పెళ్లేంటి అసలు నువ్వు ఏమి మాట్లాడుతున్నావు నీకు
అర్ధం అవుతుందా అని అంటాడు, బిర్బాల్ నవ్వుతు మహారాజు గారు మీరు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవొచ్చు మీరు ఈ రాజ్యానికి రాజు మీకు ఎదురు చెప్పే దేర్యం ఎవ్వరికి లేదు అని అంటాడు, అప్పుడు అక్బర్ సరే బీర్బల్ నాకు కొంచం సమయము కావలి నేను రాత్రంతా అలోచించి నీకు రేపు పోదున్నే చెప్తాను అని అంటాడు, బీర్బల్ సరే మహారాజా అంటూ తన ఇంటికి వెళ్ళిపోతాడు, ఇక రాజు రాత్రంతా ఆలోచిస్తాడు ఆలా తెల్లారిపోతుంది, పొద్దున్నే బిర్బాల్ అక్బర్ దగ్గరికి వచ్చి మహారాజు గారు
నేను చెప్పిన దాని గురించి ఆలోచించారా అని అడుగుతాడు, అక్బర్ అంటాడు బిర్బాల్ నేను రాత్రంతా నిద్ర పోకుండా నా పెళ్లి గురించి బాగా ఆలోచించాను కానీ నేను ఈ పెళ్లి చేసుకోలేను అని అంటాడు, అప్పుడు బిర్బాల్ ఆశచేర్యము తో ఏమైంది మహారాజు గారు రాజకుమారి చాలా అందంగా ఉంది మీకు అడ్డు ఎవరు నాకు చెప్పండి నేను వెళ్లి మాట్లాడుతాను అని అంటాడు, ఇది విని అక్బర్ బీర్బల్ ను ఒక గదిలోకి తీసుకెళ్లి బీర్బల్ నాకు ముందే ఇద్దరు భార్యలు ఉన్నారు వాళ్లకు నా మూడవ
పెళ్లి గురించి తెలిస్తే నన్ను వాళ్ళు బ్రతకనివ్వరు నన్ను మన్నించు నేను ఈ పెళ్లి చేసుకోలేను అని అంటాడు, ఇక బీర్బల్ గట్టిగ నవ్వుతు మహారాజు గారు అంటే మీరు కూడా మీ భార్యలతో భయపడతారు అని అర్ధం అంటు అక్బర్ తో అంటాడు, అక్బర్ కూడా నవ్వుతు అవును బిర్బాల్ నేను కూడా నా భార్యలతో భయపడతాను, నిన్ను ఓడించడము నా వల్లకాదు అని అంటాడు.
Moral Of The Story : ఈ కథ ద్వారా మను ఏం నేర్చుకున్నాము? మనకు మాట్లాడే తెలివి ఉంటే ఎవ్వరితో అయినా మనము గెలవొచ్చు
Also Read These Stories : Top Neeti Kathalu in Telugu
Top 3 Best Moral Stories In Telugu
Top 4 Best Moral Stories In Telugu