Top Best Telugu Moral Stories ! తెలుగు నీతి కథలు  

Hii Friends నా పేరు Nandini ఈ రోజు నేను మీ కోసం Top Best Telugu Moral Stories ! తెలుగు నీతి కథలు తీస్కొని వచ్చాను ప్రతిసారి లాగే ఈ సారి కూడా కథను చదివి కామెంట్ చేస్తారు అని ఆశిస్తున్నాను

1. కుమ్మరి వాడి కథ ! Top Best Telugu Moral Stories

అనగనగ రాంపురం అనే ఒక ఊర్లో గోపాల అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను కుమ్మరివాడు గిన్నెలు బిందెలు తయారు చేసి అమ్మేవాడు, కానీ పాపం అతను చాలా పేదవాడు అతనికి నలుగురు చిన్న చిన్న పిల్లలు ఉండేవారు, ఇంట్లో తినడానికి సరిగా అన్నము కూడా ఉండకపోయేది ఒకపూట అన్నము తిని ఇంకో పుట నీళ్లు తాగి పడుకునేవారు, పిల్లలు చిన్నగా ఉండడంవల్ల గోపాల ఒక్కోడే కష్టపడే వాడు ప్రతి రోజు లాగే ఉదయన్న లేచి గోపాల తన భార్య తో ఈ రోజు నేను వచ్చేసరికి బాగా అల్సయం

అవుతుంది మీరు అన్నము తిని పడుకోండి అంటూ కొంచం అన్నము ఒక బాక్స్ లో కట్టుకొని పనికి బయలుదేరాడు, ఆలా వెళ్తూ వెళ్తూ అతనికి ఒక సాధు బాబా ఏడుస్తుంటూ కనిపించాడు గోపాల వెంటనే సాధు బాబా దగ్గరికి వెళ్లి బాబా ఏమైంది మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు, అప్పుడు ఆ బాబా గోపాల తో నేను రెండు రోజుల నుండి అన్నం తినలేదు ఆకలి తట్టుకోలేక ఏడుస్తూనన్ను అని అంటాడు, ఇది విని గోపాల కి సాధు బాబా మీద జాలి కలిగి బాబా ఇదిగో అన్నం

Top Best Telugu Moral Stories ! తెలుగు నీతి కథలు  
Top Best Telugu Moral Stories

అంటూ తన బాక్సు అతనికి ఇచ్చేస్తాడు, అప్పుడు బాబా ఏ మాత్రమూ అల్సయం చేయకుండా గోపాల ఇచ్చిన అన్నం మొత్తం తినేసి హమ్మయ్య ఇప్పుడు కడుపు నిండిది, ని పేరు ఏంటి నువ్వు ఏం చేస్తుంటావు బాబు అని అడుగుతాడు, నా పేరు గోపాల నేను కుమ్మరి పని చేస్తాను అని గోపాల అంటాడు, అప్పుడు బాబా గోపాల కి సుత్తి ఇచ్చి ఈ సుత్తి తీస్కో నీకు ఎప్పుడన్నా ఏమైనా పని చేయాలంటే ఈ సుత్తితో చెయ్యి అని అంటాడు, అప్పుడు గోపాల నవ్వుతు బాబా నేను కుమ్మరి వాడిని

నా దగ్గరే చాలా సుత్తులు ఉన్నాయి ఈ సుత్తి తీస్కొని నేను ఏమి చేయాలి దీన్ని మీ దగ్గరే పెట్టుకోండి అని అంటాడు, ఇది విని బాబా గోపాల తో నాయన ఇది మాములు సుత్తి కాదు ఇది మాయల సుత్తి నా మాట విని నువ్వు దీన్ని తీసుకెళ్లి దింతో పని చేస్కో అని అంటాడు, సరేలే అంటూ గోపాల సుత్తి తీసుకొని వెళ్ళిపోతాడు, కానీ బాబా చెప్పిందంతా నమ్మకుండా ఆ సుత్తిని ఇంటికి తీసుకెళ్లి ఒక మూలానా పడేస్తాడు, ఏదైనా పని చేయనంటే తన దగ్గరున్న సుత్తులతోనే చేసేవాడు, ఒక రోజు అతని

సుత్తులు ఎవరో దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోతారు అప్పుడు తప్పని పరిస్థితిలో గోపాల బాబా ఇచ్చిన సుత్తిని బయటకు తీసి దాన్ని బాగా కడిగి పని మొదలు పెడ్తాడు, గోపాల కుమ్మరివాడు కావడంతో అతను ఆ రోజు బిందెలు తయారు చేస్తున్నాడు, అప్పుడు అతని దగ్గరికి ఒక కుక్క వచ్చి బౌ బౌ అని అరుస్తుంది, మొదట్లో గోపాల పట్టించుకోలేదు కానీ కుక్క అలాగే అరుస్తుంది గోపాల కి కోపం వచ్చి ఒక రాయి తీసుకోని కుక్క పైకి విసిరాడు కుక్క అక్కడినుండి వెళ్ళిపోయింది, గోపాల మళ్ళి తన పని

Top Best Telugu Moral Stories ! తెలుగు నీతి కథలు  
Top Best Telugu Moral Stories

మొదలుపెట్టాడు కాసేపు అయ్యాక అదే కుక్క మళ్ళి వచ్చి అలాగే అరుస్తుంది ఈ సారి గోపాల కి బాగా కోపం వచ్చింది అప్పుడు అతను సాధు బాబా ఇచ్చిన సుత్తి తీస్కొని కుక్క పైకి విసిరాడు సుత్తి నేరుగా వెళ్లి కుక్కకు తగిలింది, ఆ సుత్తి దెబ్బ కుక్కకు తగలాగానే కుక్క అక్కడే అలాగే ఒక బొమ్మలాగా నిలబడిపోయింది, కాసేపు అయ్యాక గోపాల తన సుత్తిని తిస్కోడానికి వెళ్ళాడు, సుత్తి తీస్కొని తిరిగి వస్తుండగా వాడి చూపు కుక్కపైకి వెళ్ళింది కుక్క బొమ్మలాగా లగే నిలబడి ఉంది గోపాల కుక్క దగ్గరికి

వెళ్లి చూడగా ఆ కుక్క సుత్తి దెబ్బ తగలగానే బంగారు కుక్క అయిపోయింది, అప్పుడు గోపాల బాబా చెప్పింది నిజమే ఈ సుత్తి మాములు సుత్తి కాదు ఈ సుత్తితో కొట్టిందల్లా బంగారము అయిపోతుందని తెలుసుకున్నాడు, ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి తన భార్య పిల్లలతో జరిగిందంతా చెప్పేడు ఇంట్లో వాళ్ళు కూడా బాగా సంతోష పడ్డారు, ఆలా గోపాల ప్రతి రోజు ఎదో ఒక జంతువుని తన సుత్తితో కొట్టి దాన్ని బంగారము లాగ మర్చి అమ్మేవాడు ఆలా చేస్తూ చేస్తూ గోపాల బాగా డబ్బులు సంపాదించాడు,

ఆ ఊర్లో గోపాల అంత డబ్బుగలవాడు ఎవ్వడు లేడు కానీ నెమ్మదిగా గోపాల కి అహంకారం అత్యాశ పెరుగుతున్నాయి, ఇక గోపాల ముందుకి కూడా బానిస అయిపోయాడు అన్ని చెడు అలవాట్లు అతనిలోకి వచ్చాయి, అతని భార్య పిల్లలు ఎంత చెప్పిన వినేవాడు కాదు, గోపాల లో అత్యాశ బాగా పెరిగింది అందు వల్ల తన సుత్తి తో ఊర్లో ఉన్న అన్ని జంతువులను చంపి వాటిని బంగారము లాగ మర్చి అమ్మేశాడు, ఇక ఊర్లో జంతువులూ అన్ని అయిపోయాయి ఏమి చేయాలో అర్ధం కావడంలేదు,

ఒక రోజు గోపాల బాగా మందు తాగి సుత్తి తీస్కొని జంతువుల వేటకు వెళ్ళాడు కానీ దురదృష్టం తో అతనికి ఒక్క జంతువూ కూడా కనిపించలేదు, కోపం తో ఇంటికి తిరిగి వచ్చాడు అప్పుడు అతని మైండ్ లో ఒక idea వచ్చింది ఆ idea ఏంటంటే నేను జంతువుల కోసము ఎంత వెతికినా నాకు ఒక్క జంతువూ కూడా కనిపించలేదు, ఇలాగైతే నేను బంగారము ఎలా సంపాదించాలి ఈ సుత్తితో నా భార్య ని కొడతాను నా భార్య బంగారం లాగ మారుతుంది అప్పుడు దాన్ని తీసుకెళ్లి అమ్మేస్తాను అని ఒక రోజు

రాత్రి ఇంట్లో వాళ్ళు అందరు పడుకున్న తరవాత గోపాల నెమ్మదిగా సుత్తి తీసుకోని తన భార్య దగ్గరికి వెళ్లి ఒక్క క్షణం కూడా ఆలస్యము చేయకుండా సుత్తి తీసుకోని ఆమె తలపై గట్టిగ కొడతాడు పాపం ఆమె బంగారము లాగ మారి అక్కడికి అక్కడే ప్రాణాలు వదిలేస్తుంది గోపాల ఆమెను బంగారము లా మర్చి ఆమెను తీస్కెళికి అమ్మేస్తాడు వచ్చినా డబ్బుతో జల్సాలు షికార్లు చేస్తూ ఆలా తన జీవితం కొనసాగుతుంది, కొన్నాళ్లకు డబ్బు అయిపోతుంది ఈ సారి గోపాల ఈ సారి తన పిల్లల పై కాళ్ళేసి

Top Best Telugu Moral Stories ! తెలుగు నీతి కథలు  
Top Best Telugu Moral Stories

వాళ్ళను ఒక్కరిగా మాయ మాటలు చెప్పి వాళ్లకు కుడి బాబా ఇచ్చిన సుత్తితో కొట్టి చంపి వాళ్ళని కూడా బంగారము లాగ మార్చి అమ్మసేసాడు వచ్చిన డబ్బు తో అలాగే జల్సాలు షికార్లు చేసి డబ్బంతా కర్చు పెట్టేసాడు, కొన్నాళ్లకు ఆ డబ్బు కూడా అయిపోయింది ఈ సారి గోపాల ఇంకో plan వేసాడు ఆ ప్లాన్ ఏంటంటే వాడికి బాగా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లి నాదగ్గర బాగా డబ్బు ఉంది కానీ ఏమి లాభం లేదు నాకు భార్య పిల్లలు లేరు అని నటిస్తూ బాగా ఏడ్చేస్తాడు వాళ్ళు కూడా గోపాల మాటల్లో పడి అయ్యో

పాపం గోపాల ఎంత బాధలో ఉన్నాడు అంటూ అతనికి కొన్ని రోజులు తమ ఇంట్లోనే పెట్టుకొని అతనికి ఇంకో మంచి సంబంధం చూసి మళ్ళి పెళ్లి చేస్తారు, కొన్నాళ్ళు గోపాల బాగానే ఉంటాడు ఆలా చూస్తూ చూస్తూ అతనకి మళ్ళి పిల్లలు పుడతారు, మళ్ళి అతనిలోని రాక్షసుడు మేలుకుంటాడు ఒక రోజు తన దగ్గరున్న సుత్తి గురించి తన భార్య కి చెప్తాడు, వాడి భార్య ఆశచేర్యం తో అవునా నేను నమ్మను అని అంటుంది గోపాల ఎంత చెప్పిన ఆమె నమ్మాడు చివరికి గోపాల తన భార్య తో నువ్వు నమ్మాలంటే

నేను ఏమి చేయాలో చెప్పు అని అంటాడు అప్పుడు ఆమె నువ్వు నా ముందు ఏదో ఒక జంతువుని చంపి బంగారం లాగ మార్చు అప్పుడు నేను నమ్ముతాను అని అంటుంది, అప్పుడు గోపాల తన భార్య తో ఊర్లో ఉన్న జంతువులన్నిటిని నేను ముందే చంపి బంగారం లా మర్చి అనేశాను అని అంటాడు, అప్పుడు గోపాల భార్య నేను మా ఉరి నుండి ఒక కోడి తెస్తాను నా ముందు దాన్ని ని సుత్తితో కొట్టి చంపి బంగారంలాగా మార్చు అప్పుడు నేను నమ్ముతాను అని అంటుంది, గోపాల సరే తీసుకోని రా ని ముందే

దాన్ని బంగారము లాగ మర్చి చూపిస్తాను అని అంటాడు, ఆమె వెంటనే తన ఉరికి వెళ్లి ఒక కోడి ని తెచ్చి గోపాల కి ఇచ్చి ఇదిగో కోడి నా ముందు దీన్ని బంగారము లా మార్చు అని అంటుంది, గోపాల వెంటనే తన సుత్తి తీసుకొచ్చి కోడి తలపై కొడతాడు ఒకే దెబ్బకు కోడి ప్రాణ పోతుంది ఆలా చూస్తూ చూస్తూ కోడి వాళ్ళ కాళ్ళ ముందే బంగారము లాగ మారిపోతుంది, అది చూసి గోపాల భార్య మీరు చెప్పింది నిజమే నన్ను మన్నించండి అని అంటుంది, అప్పుడు గోపాల ఆ బంగారపు కోడిని తీసుకెళ్లి

అమ్మి డబ్బులు తెస్తాడు ఇద్దరు భార్య భర్తలు ఆ డబ్బును బాగా ఆనందంతో ఖర్చు పెడ్తారు కొన్నలుకు డబ్బులు అయిపోతాయి, ఒక రోజు రాత్రి గోపాల భార్య పిల్లలు పడుకున్న తర్వాత నెమ్మదిగా వెళ్లి వాళ్ళ కు ఆ సుత్తితో కొడతాడు వాళ్ళు కూడా బంగారంలా మారిపోతారు గోపాల వాళ్ళను కూడా తీసుకెళ్లి అమ్మేస్తాడు వచ్చిన డబ్బుతో మళ్ళి బాగా మందు తాగి పడిఉంటాడు, ఆలా కొన్నాళ్లకు ఆ డబ్బు కూడా అయిపోతుంది, ఈ సారి ఏమి చేయాలి ఎవరికి చంపాలి అని బాగా ఆలోచిస్తాడు, సుత్తి

తీస్కొని ఊరంతా తిరుగుతాడు కానీ అతనికి ఒక్క మనిషి కానీ ఒక్క జంతువూ కానీ కనపడరు, చివరికి చిరాకు పడి తన దగ్గరున్న సుత్తితో తానె కొట్టుకుంటాడు అందువల్ల గోపాల అక్కడే ప్రాణాలు వాదిస్తాడు.

Moral Of The Story : ఆశ పడడం మంచిదే కానీ అత్యాశ పడడం మంచిది కాదు, అత్యాశ రకరకాల నేరాలకు దారి తీస్తుంది

Also These Moral Stories : Top 3 Best Moral Stories In Telugu

Top 4 Best Moral Stories In Telugu

Best 4 Moral Stories In Telugu

Top Moral Stories In Telugu

Leave a Comment

%d bloggers like this: