Hii Friends నా పేరు Divya ఈ రోజు నేను మీ అందరి కోసం Top Moral Stories In Telugu ! నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పుర్తిగా చదివి మీ అభిప్రాయము తెలపండి
1. పావురాలు మరియు వేటగాడు ! Top Moral Stories In Telugu
చాలా ఏళ్ళ క్రితం అడవిలో ఒక మర్రిచెట్టు మీద చాలా పావురాలు ఉండేవి, ఆ పావురాలు ప్రతి రోజు తమ కడుపు నింపుకోడానికి మేతకు వెళ్లి మళ్ళి సాయంత్రం అయ్యేసరికి మర్రిచెట్టు పైకి వచ్చి పడుకునేవి, అందులో ఒక మొసలి పావురం కూడా ఉండేది, పావురాలన్నీ ఆ మొసలి పావురం చెప్పినట్టు వినేవి, ఒక రోజు ఆ మర్రిచెట్టు దగ్గరికి ఒక వేటగాడు వచ్చాడు, ఆ వేటగాడు అన్ని పావురాలను ఒక్కసారిగా చూసి అబ్బా ఎన్ని పావురాలు ఉన్నాయి రేపు వచ్చి వీటిని పట్టుకొని
వెళ్ళిపోతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు, వాడికి చూడగానే మొసలి పావురానికి వాడి పై అనుమానం కలుగుతుంది, రెండవ రోజు మిట్ట మధ్యాహ్నం ఆ వేటగాడు మళ్ళి మర్రిచెట్టు దగ్గరికి వస్తాడు, వచ్చి చూడగా పావురాలన్నీ పడుకొని ఉంటాయి వేటగాడు వెంటనే తన దగ్గరున్న వల తీసి మరిచెట్టు కింద వేసి వల మీద కొన్ని మొక్కజొన్న గింజలు వేసతాడు వేసి నెమ్మదిగా వెళ్లి ఒక కొండా వెనుక దాచుకొని పావురాలను గమనిస్తాడు, అప్పుడే ఒక పావురం నిద్ర లేచి చెట్టు కింద చూస్తుంది,
చెట్టు కింద మొక్కజొన్న గింజలను చూసి అన్ని పావురాలను నిద్ర లేపి ఈ రోజు మనం మేతకు వెళాల్సిన అవసరం లేదు మన చెట్టు కిందే మేత వచ్చేసింది అని అంటుంది, పావురాలన్నీ మేతను చూసి తెగ సంతోషపడి ఒక్కోటి చెట్టు కిందికి దిగడం మొదలు పెడతాయి, అప్పుడే మొసలి పావురము ఎవ్వరు కిందికి దిగ కూడదు ఎవరో వేటగాడు కింద వల వేసాడు అని అంటుంది కానీ పావురాలన్నీ బాగా ఆకలి మీద ఉంటాయి కాబట్టి ఎవ్వరు ఆ మొసలి పావురం మాట వినకుండా అందరు కిందికి

దిగిపోతారు కానీ మొసలి పావురము చెట్టు మీద నుంచి కింద దిగకుండా అక్కడే కూర్చొని వెళ్ళొదు వెళ్ళొదు అని అరుస్తుంది, కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది పావురాలన్నీ వేటగాడి వలలో చిక్కుకుంటాయి ఇక పావురాలు వామ్మో మేము వలలో చిక్కుకున్నాము మమల్ని కాపాడు అని మొసలి పావురం తో అంటాయి..ఇటు వేటగాడు ఆనందం తో హమ్మయ్య అన్ని పావురాలు నా వలలో చిక్కుకున్నాయి అని మనసులోనే అనుకుంటూ పరిగెత్తుకుంటూ వల వైపు వస్తు ఉంటాడు ఆ
వేటగాడిని చూసి పావురాలు భయం తో కేకలు వేస్తూ మొసలి పావురానికి కాపాడు కాపాడు అని అంటాయి, అప్పుడు మొసలి పావురం బాగా అలోచించి, నేను చెప్పినప్పుడు అందరు ఒకేసారి ఎగరడానికి ప్రయత్నించండి అని అంటుంది ఇది విని వలలో చికుక్కున్న పావురాలు మేము వలలో చిక్కుకున్నాము మేము ఎలా ఎగరగలము అని అంటాయి, ఇది విని మొసలి పావురము మీరు అందరు కలిసి ఒకే సారి ఎగరడానికి ప్రయత్నించండి తప్పకుండ వలతో పాటు ఎగురుతారు అని అంటుంది,
ఆలా చూస్తూ చూస్తూ వేటగాడు పావురాల దగ్గరికి వచ్చేస్తాడు మొసలి పావురము ఒక్కసారిగా ఏగారండి అందరు అని గట్టిగ అరుస్తుంది పావురాలన్నీ ఒక్కసారిగా ఎగరడం వల్ల, వల కూడా వాళ్లతో పాటు తీస్కొని ఎగురుతాయి ఆలా మొసలి పావురము చెప్పినట్టు పావురాలన్నీ దాని వెంట ఎగురుకుంటూ వెళ్తాయి వేటగాడు ఇదంతా చూసి ఆశచేర్యం తో ఆమ్మో నా వల ఆమ్మో నా వల అంటూ పావురాల వెంట పరిగెత్తుతాడు కానీ మొసలి పావురము తన తెలివి తేటలు ఉపయోగించి ఒక నది పై నుంచి
ఎగురుతుంది అందువల్ల వేటగాడు చేసేది ఏమి లేక అక్కడితో ఆగిపోతాడు, మొసలి పావురము ఎగురుకుంటూ వాళ్ళందరిని ఒక కొండా పైకి తీసుకెళ్తుంది అక్కడ కి వెళ్లి ఒక ఎలుకను పిలిచి జరిగిందంతా చెప్పుతుంది అప్పుడు ఆ ఎలుక బాధ పడకండి నేను ఇప్పుడే నా పళ్లతో ఈ వలను కోసేస్తాను అని పాపం ఎలుక తన పళ్లతో ఆ వలను ముక్కలు ముక్కలు గా కోసేస్తుంది పావురాలన్నీ క్షేమంగా ప్రాణాలతో బయటపడతాయి, అన్ని పావురాలు వెళ్లి మొసలి పావురం తో నువ్వు చెప్పినట్టు
మేము వినలేదు మమల్ని క్షమించు అని మొసలి పావురం తో క్షమాపణలు కోరుకుంటారు, ఎలుక దగ్గరికి కూడా వెళ్లి ఎలుకా గారు మీరు ఎంతో కష్టాపడి మీ పళ్లతో వలను కోసినందుకు మీకు ధన్యవాదాలు అని అంటాయి, ఇక పై మేము పెద్దలు చెప్పినట్టే వింటాము అని అనుకుంటాయి
Moral Of The Story : అందరు కలిసి ఉంటె ఏదైనా సాధించవచ్చు, పెద్దలు చెప్పినట్టే వినాలి ఎందుకంటె వాళ్లకు బాగా అనుభవం ఉంటుంది
2. రెండు ఎలుకల కథ ! Telugu Moral Stories
ఫ్రెండ్స్ చాలా ఏళ్ళ క్రితం ఒక ఊర్లో రెండు ఎలుకలు ఉండెడివి, ఆ రెండు ఎలుకలు చాలా మంచి స్నేహితులు ఒకరిని విడిచి ఒకరో ఉండరు, కానీ కొన్ని కారణాల వల్ల ఒక ఎలుక ఊర్లో నుండి వెళ్ళయిపోయి పట్నం లో ఉండడం మొదలు పెడుతుంది ఆలా చాలా ఏళ్ళు గడిచాక పట్నం ఓ ఉన్న ఎలుక ఊర్లో లో ఉన్న తన మిత్రుడికి ఉత్తరం రాసి నేను నిన్ను కలవడానికి వస్తున్నాను అని చెప్తుంది, ఊర్లో ఉన్న ఎలుక అబ్బా ఎన్నాళ్లకు నా ప్రాణ స్నేహితుడు వస్తున్నాడు అని ఊర్లో
వాళ్లందరికీ చెప్తుంది, రెండు రోజుల తర్వాత పట్నం ఎలుక ఉరికి చేరుకుంటుంది, ఊర్లో ఉన్న ఎలుక తన స్నేహితుడు వచ్చాడని బాగా స్వగతం పలుకుతుంది ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళాక ఊర్లో ఉన్న ఎలుక పట్నం ఎలుక కు తినడానికి అన్నం పప్పు పెడ్తుంది ఇద్దరు కలిసి కడుపు నిండా అన్నం తింటారు, కాసేపు మాట్లాడి ఇద్దరు పడుకుంటారు తెల్లారి ఇద్దరు కలిసి పొలం లోకి వెళ్లి బాగా తిరిరి ఇంటికి చేరుకుంటారు, ఊర్లో ఎలుక మళ్ళి పట్నం ఎలుకకు అన్నం పెడ్తుంది ఈ సారి
కూడా అన్నం పప్పే పెడ్తుంది పట్నం ఎలుక ఏమి అనకుండా తినేస్తుంది కాసేపు మళ్ళి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు ఆలా చూస్తూ చూస్తూ రాత్రి అయిపోతుంది మళ్ళి ఉరి ఎలుక పట్నం ఎలుకకు భోజనం పెడ్తుంది ఈ సారి కూడా అన్నం పప్పే పెడ్తుంది పట్నం ఎలుకకు బాగా కోపం వచ్చి ఏంట్రా ఇది ఊర్లో అన్నం పప్పు తప్ప ఇంకా ఏమి తినరా అని గట్టిగ అడుగుతుంది, పాపం ఉరి ఎలుక ఏడుస్తూ మా ఊర్లో అన్నం పప్పు తప్ప ఇంకేమి దొరకదు అని అంటుంది, పట్నం ఎలుక నాతొ పాటు నువ్వు

కూడా పట్నానికి రా అక్కడ ఎన్ని రకాల భోజనాలు ఉంటయ్యె చూడు అని అంటుంది పాపం ఉరి ఎలుక అమాయకంగా అవునా? ఐతే నేను తప్పకుండా నీతో పాటు పట్నానికి వస్తాను అని అంటుంది, ఇద్దరు కలిసి అదే రోజు పట్నానికి బయలు దేరుతారు పట్నం వెళ్లేసరికి ఇద్దరు అలసి పోతారు, కాసేపు ఇద్దరు రెస్ట్ తీసుకుంటారు, అప్పుడు ఉరి ఎలుకకు అక్కడ కొన్ని పళ్ళు కనపడతాయి ఆ పళ్ళను చూసి అబ్బా ఏంటా బాగున్నాయి ఈ పళ్ళు నేను వీటిని తినొచ్చా అని పట్నం ఎలుకకు అడుగుతుంది
పట్నం ఎలుక కూడా తిను ని కోసమే ఇక్కడ పెట్టాను అని అంటుంది ఉరి ఎలుక ఇంతక ముందు ఎప్పుడు పళ్ళు తినలేదు అందువల్ల టప టప పళ్ళను తినేసింది, అప్పుడే వాళ్లకు మియావు మియావు అని పిల్లి శబ్దాలు వినబడతాయి పట్నం ఎలుక ఉరి ఎలుక తో ఒరేయ్ పిల్లి వస్తుంది వెంటనే దాక్కో లేదంటే అది మన ఇద్దరికీ తినేస్తుంది అని అంటుంది, ఇద్దరు కలిసి దాక్కుంటారు కాసేపు అయ్యాక పిల్లి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు పట్నం పిల్లి బయటకు వచ్చి ఉరి పిల్లి తో ఒరేయ్ పిల్లి
వెళ్ళిపోయింది బయటకు వచ్చేయ్ అని అంటుంది పాపం ఉరి పిల్లి భయోపడుతూ బయటకు వస్తుంది అప్పుడు పట్నం పిల్లి ఇదంతా మామూలే రా నువ్వు పళ్ళు తిను అని అంటుంది, కానీ ఉరి పిల్లి మాత్రం లోలోపలే భపడుతూ ఉంటుంది అంతలోపు ఒక కుక్క భౌ భౌ అని అరుస్తుంది మళ్ళి ఇద్దరు కలిసి దాక్కుంటారు కాసేపు అయ్యాక కుక్క వెళ్ళిపోతుంది మళ్ళి ఇద్దరు కలిసి బయటకు వస్తారు, అప్పుడు ఉరి ఎలుక పట్నం ఎలుక తో ఒరేయ్ ఇంత భయపడుకుంటూ నువ్వు ఎలా
బ్రతుకుతున్నావు, నేను తిరిగి నా ఉరికి వెళ్ళిపోతాను నాకు ఇక్కడ పళ్ళు అవసరం లేదు నాకు నా అన్నం పప్పే చాలు, నాకు తిండి కంటే నా ప్రాణమే ముఖ్యము అంటూ అదే రోజు రాత్రి ఉరికి తిరిగొచ్చి స్వేచ్చగా ఊపిరి పీల్చుకుంటుంది
Moral Of The Story : ప్రమాదం తో కూడుకున్న సుఖాలకన్నా అత్యాశ లేని జీవితం చాలా గొప్పది
3. కప్ప కథ ! Moral Story In Telugu
అనగనగ ఒక చెరువులో ఒక కప్ప ఉండేది చెరువులో ఆ కప్ప అన్నిటికంటే పెద్దగా లావుగా ఉండేది దానికి ముగ్గురు పిల్లలు కూడా ఉండేవి, చెరువులో ఇతర జంతువులూ అందరు ఆ కప్పను చూసి భయపడేవారు,కప్ప కూడా బాగా గర్వాంగా ఉండేది ఈ చెరువుకి నేనే రాజు నేను చెప్పినట్టే మీ అందరు వినాలి అని మిగితా జంతువులకు భయపెట్టేది, పాపం అందరు ఆ పెద్ద కప్పను చూసి భయపడేవారు, కప్ప ప్రతి రోజు అందరితో గొడవపడేది, కానీ భయం తో ఎవ్వరు దాన్ని ఎదురించేవారు కాదు ఆ కప్ప
పిల్లలు కూడా అబ్బా మా నాన్న ఎంత బలంగా ఉన్నాడు, మా నాన్నతో ఎవ్వరు గొడవ పడలేరు మా నన్నే రాజు అని అంటూ ఉంటె కప్ప ఆనందం తో ఎంతో మురిసిపోయేది, కప్పు కూడా తన పిల్లలతో ఒరేయ్ పిల్లలు ఈ ప్రపంచం లో అందరికంటే నేనే పెద్ద అందరికంటే నేనే బలశాలిని అని అబద్దాలు చెప్తాడు, కప్ప పిల్లలు కూడా నమ్మేస్తారు, ఒక రోజు కప్ప పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ చెరువు బయటకు వెళ్ళిపోతారు అక్కడ వాళ్లకు ఒక పెద్ద ఏనుగు కనిపిస్తుంది కప్ప పిల్లలు మొదటిదసారిగా

అంత పెద్ద జంతువుని చూస్తారు అందువల్ల ఏనుగు ని చేసి భయపడి పరిగెత్తుకుంటూ చెరువులోకి వెళ్లి వాళ్ళ నాన్న ఐన పెద్ద కప్పుతో నాన్న నాన్న మేము ఆడుకుంటూ చెరువు బయటకు వెళ్ళాము అక్కడ మేము చాలా పెద్ద జంతువుని చూసాము అని అంటారు, కప్ప కి బాగా కోపం వచ్చి బాగా నీళ్లు తాగుతుంది అందువల్ల దాని కడుపు బాగా ఉబ్బిపోతుంది అప్పుడు తన పిల్లతో ఇప్పడు చుడండి నేను ఎంత లావుగా ఉన్నానో అని అంటుంది కప్ప పిల్లలు నాన్న ఆ జంతువూ ఇంకా పెద్దగా ఉంది అని
అంటారు, కప్ప ఇంకా నీళ్లు తాగుతుంది తాగి ఇప్పుడు చుడండి నేను ఎంత లావుగా ఉన్నాను ఆ జంతువూ నా కన్నా లావుగా ఉందా అని అంటుంది, కప్ప పిల్లలు నన్ను నువ్వు అందులో సగం కూడా లేవు అది నీకంటే చాలా పెద్దగా ఉంది అని అంటారు, కప్పకు చాల కోపం వస్తుంది వెళ్లి ఇంకా నీళ్లు తాగుతుంది ఆలా నీళ్లు తాగుతూ తాగుతూ కప్పు తన ప్రాణాలు వదిలేస్తుంది
Moral Of The Story : ఎప్పుడైనా మనమే తోపు అని అనుకోకూడదు గర్వం పడకూడదు మనకంటే తోపులు కూడా ఉంటారు
Soo Friends ఇది మన ఈ రోజీ Top Moral Stories In Telugu నేను ఎంతో కష్టపడి రాసాను మీ అందరికి నచ్చాయి అని ఆశిస్తున్నాను, రేపు మరిన్ని నీతి కథలతో మళ్ళి మీ ముందు ఉంటాను నా పేరు Divya Bye And Take Care
Also Read These Moral Stories : కప్ప మరియు ఎలుక కథ ! Rat And Mouse Telugu Moral Stories
Top Best Moral Stories In Telugu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు
Top 2 Best Neeti Kathalu In Telugu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు
Telugu Moral Stories On Friendship ! తెలుగు నీతి కథలు