Hii Friends నా పేరు శైలజ ఈ రోజు నేను మీ అందరి కోసము Top Neeti Kathalu in Telugu ! Telugu Moral Stories చెప్పబోతున్న కథలు పుర్తిగా చదివి మీ అభిప్రాయము కామెంట్ చేసి తెలుపుతారు అని ఆశిస్తున్నాను
1. దేర్యం గల పిట్ట ! Top Neeti Kathalu in Telugu
అనగనగ ఒక అడవిలో ఒక పిట్ట ఉండేది దాని పేరు రాణి ఆ పిట్టకు ముగ్గురు పిల్లలు ఉండేవారు, అడవిలో అన్ని జంతువులూ బాగా కలిసి ఉండేవారు, ఎవ్వరికీ ఏ కష్టము వచ్చిన అందరూ కలిసి సహాయము చేసుకునేవారు, ఒక రోజు మధ్యాహ్నం సమయము లో జంతువులన్నీ బాగా తిని నిద్రపోతున్నాయి అప్పుడు అనుకోకుండా ఆ అడవిలో మంటలు అంటుకుంటాయి అందువల్ల పడుకున్న అన్ని జంతువులు నిద్ర లేచి చుడగా అడవి అంత కాలిపోతూ ఉంటుంది అందరు
భయపడి ఆ అడవికి రాజు ఐన పులి దగ్గరికి వెళ్లి రాజు గారు రాజు గారు మన అడవిలో మంటలు అంటుకున్నాయి, మన అందరి కొంపలు అంటుకున్నాయి అని ఏడుస్తూ పులికి చెప్తారు అప్పుడు పులి ఒక్క క్షణం కూడా ఆలస్యము చేయకుండా అడవిలోని అన్ని జంతువులకు మీరు అందరు వెంటనే ఈ అడవి వదిలేసి పారిపోండి లేకపోతె మనము అందరమూ కాలి చచ్చిపోతాము అని అంటుంది వెంటనే అన్ని జంతువులూ అడవి వదిలేసి పారిపోతూ ఉంటారు, కానీ రాణి పిట్ట మాత్రమూ ఎక్కడికి
పారిపోకుండా చెట్టు మీద అలాగే కూర్చొని మొత్తం చూస్తూ ఉంటుంది, కానీ మిగితా జంతువులూ అన్ని తమ ప్రాణాలు కాపాడుకుంటూ పరిగెత్తుకుంటూ ఉంటారు, వాళ్లతో పాటు అడవికి రాజు ఐన పులి కూడా తన ప్రాణాలు కాపాడుకుంటూ పరిగెత్తుకుంటూ ఉంటుంది అప్పడే అది రాణి పిట్టను చూసి ఓయ్ రాణి పిట్టా నీకు చెప్తే అర్ధం కాదా? అడవిలో అంత మంటలు అంటుకున్నాయి ఇక్కడే ఉంటె నువ్వు కూడా కాలి బూడిద అయిపోతావు ని పిల్లలను తీసుకోని ఇక్కడి నుండి వెళ్ళిపో అని కోపం తో గట్టిగ
అరుస్తుంది, కానీ రాణి పిట్ట రాజు గారు ఇది మన ఇల్లు దీన్ని వదిలిపెట్టి నేను రాను కావాలంటే మీరు వెళ్ళండి అని పులి తో అంటుంది అప్పుడు పులి సరే ని ఇష్టం ఇక్కడే ఉంది చావు అంటూ వెళ్ళిపోతుంది, ఆలా చూస్తూ చూస్తూ మాటలు బాగా పెరిగిపోతాయి ఇంకో వైపు పిట్ట పిల్లలు ముగ్గురు భయం తో కేకలు వేస్తూ ఏడుస్తున్నారు, అప్పుడు రాణి ఎగురుకుంటూ ఒక నది దగ్గరికి వెళ్లి దాని నోట్లో నీళ్లు నింపుకొని వచ్చి మంటల పై నీళ్లు చల్లుతూ ఉంటుంది, అప్పుడే అక్కడి నుండి ఒక గద్ద వెళ్తూ

ఉంటుంది ఆ గద్ద రాణి పిట్ట దగ్గరికి వచ్చి ఓయ్ రాణి పిట్ట నీకేమన్నా పిచ్చ ని నోట్లో ఎన్ని నీళ్ళు వస్తాయి? ఇలా నువ్వు ఎన్ని సార్లు ని నోట్లో నీళ్లు పట్టుకొచ్చి మంటలపై నీళ్లు చల్లుతావు? నివ్వు ని నోటి ద్వారా చాల్లే నీళ్లతో ఒక జానెడు మంట కూడా ఆరదు, కావున నువ్వు ని పిల్లను తీస్కొని వెళ్ళిపో అని సలహా ఇస్తుంది గద్ద, అప్పుడు రాణి పిట్ట గద్ద గారు నేను ఈ మంటలు ఆర్పుతానో లేదో తెలీదు కానీ నేను నా వంతు ప్రయత్నమూ తప్పకుండ చేస్తాను అని అంటుంది, అప్పుడు గద్ద పక పక నవ్వుతు ని
కర్మ ని చావు నువ్వు చావు అంటూ వెళ్ళిపోతుంది, కానీ రాణి పిట్ట మాత్రం తన ప్రయత్నాలు ఆపదు, ఆలా దాదాపు యాభై సార్లు తన నోట్లో నీళ్లు తీసుకొచ్చి అడవిలో చెల్లుతుంది కానీ ఒక్క అంగుళం కూడా మంటలు ఆర్పలేదు, అప్పుడే అనుకోకుండా వర్షం పడడం మొదలు అవుతుంది, ఆల చూస్తూ చూస్తూ వర్షం గట్టిగ పడడం ప్రారంభిస్తుంది, కాసేపు అయ్యాకా అడివిలో మంటలు అన్ని చల్లారి పోతాయి అప్పుడు రాణి పిట్ట ఆకాశం వైపు చూస్తూ దేవుడా నేను చేసిన కష్టానికి నువ్వు సహకరించావు నీకు
వందనాలు అని అంటుంది, కాసేపు అయ్యాక పారిపోయిన జంతువులూ అన్ని మళ్ళి తిరిగి అడవిలోకి వచ్చేస్తాయి, అందరు రాణి పిట్టను అభినందిస్తూ రాణి గారు మీరు చేసిన కష్టానికి దేవుడు కూడా మీకు సహకరించాడు అని అంటారు, పులి రాజు కూడా రాణి పిట్ట దగ్గరికి వచ్చి రాణి పిట్ట గారు నేను ఈ అడవికే రాజుని కానీ భయపడి నా ప్రాణాలు కాపాడుకుంటూ నేను కూడా పారిపోయాను కానీ మీరు మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు చివరికి మీరే గెలిచారు, నేను రాజు లా ఉండడానికి హక్కు
లేదు, అప్పుడు పులి అడవిలోని అన్ని జంతువుల సమీక్షంలో ఈ రోజు నుండి ఈ అడవి రాజు రాణి పిట్ట అని అంటాడు, అడవిలోని అన్ని జంతువులూ రాణి పిట్టను రాజు లా పొంది బాగా ఆనందిస్తారు.
Moral Of The Story : ఎంత కష్టం వచ్చిన మనము తొందరపడి ఎలాంటి పనులు చేయకూడదు, దేర్యం చేసి వచ్చిన ఆపదను ఎదురుకోవాలి, దేర్యం చేసిన వాళ్లకు దేవుడు కూడా సహకరిస్తారు
2. ఎద్దులు మరియు కోడిపుంజు ! Small Stories in Telugu
రామాపురం అనే ఒక ఊర్లో యాదగిరి అనే ఒక రైతు ఉండేవాడు, ఆయనకు ఊర్లో మంచి పేరు ఉండేది ఊర్లో ఎవ్వరికీ ఏ సమస్య వచ్చిన అందరు యాదగిరి దగ్గరికి వచ్చి సలహా తీసుకునేవారు యాదగిరి కూడా చాలా మంచి వ్యక్తి ఎవరైనా ఆపదలో ఉంటె డబ్బులు ఇచ్చి వాళ్లకు సహాయము చేసేవాడు, ఆయన ఇంట్లో తన భార్య తో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉండేవారు, యాదగిరి ప్రతి రోజు పొలానికి వెళ్లి బాగా కష్టపడి పనిచేసేవాడు అతని దగ్గర రెండు ఎద్దులు ఉండేవి, ఒక ఎద్దు పేరు సోను ఇంకో
ఎద్దు పేరు మోను యాదగిరి తన ఎద్దులతో ఎంతో ప్రేమగా ఉండేవాడు ప్రతి రోజు యాదగిరి తన తో పాటు రెండు ఎద్దులను కూడా పొలానికి తీస్కెలెవాడు, ఎద్దులు కూడా బాగా కష్టపడి పొలం లో పని చేసేవి, యాదగిరి ప్రతి రోజు తన ఎద్దులకు తినడానికి పచ్చని గడ్డి తో సహా మంచి మంచి ఆహారము పెట్టేవాడు ఎద్దులు కూడా యాదగిరి తో బాగా కలసి మెలిసి ఉండేవి, ప్రతి రోజు లాగే యాదగిరి తన ఎద్దులని తీసుకుని పొలానికి వెళ్ళాడు ఆ రోజు యాదగిరి భార్య అన్నము కట్టుకొని పొలానికి రావడము
ఆలస్యము కావడము వల్ల యాదగిరి ఇంటికి వెళ్ళాడు భోజనానికి, ఇంటికి వెళ్లి చూడగా యాదగిరి భార్య ఒక కోడిపుంజు ని ఇంటికి తెచ్చి దానికి దాన వేస్తూ ఉంటుంది అప్పుడు యాదగిరి తన భార్య తో ఈ రోజు నువ్వు అన్నము కట్టుకొని పొలానికి ఎందుకు రాలేదు నికోసము ఎదురు చూసి నేనే ఇంటికి వచ్చేసాను అని అంటాడు అప్పుడు యాదగిరి భార్య అయ్యో కోడిపుంజు తెచ్చిన ఆనందంలో ఈ రోజు నేను మీకు అన్నం కట్టుకొని రావడము మరిచిపోయాను అండి నన్ను క్షమించండి అంటూ యాదగిరి తో

అంటుంది, యాదగిరి పర్వాలేదులే ఐన ఈ కోడిపుంజు ఎక్కడి నుండి తెచ్చావు ? నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది అని అంటదు అప్పడు యాదగిరి భార్యా ఏవండి ఈ కోడిపుంజు మా నాన్న నాకు తెచ్చి ఇచ్చారు, ఈ కోడిపుంజు ని మనము పెంచుకుందాము అని అంటుంది ఇదంత విని యాదగిరి నవ్వుకుంటూ సర్లే అంటూ అన్నం తిని తిరిగి పొలానికి వెళ్ళిపోతాడు, పొలానికి వెళ్లేసరికి రెండు ఎద్దులు ఎండలో బాగా కష్టపడుతూ ఉంటాయి, యాదగిరి వెంటనే వెళ్లి తన ఎద్దులను నీడకు తీస్కెళి
కుర్చోపెడతాడు, ఆలా చూస్తూ చూస్తూ చీకటి పడిపోతుంది ఇక యాదగిరి తన ఎద్దులను ఇంటికి తీసుకెళ్తాడు, ఇంటికి వెళ్ళగానే ఎద్దులకి కోడిపుంజు కనియూపిస్తుంది దాన్ని చూసి రెండు ఎద్దులు ఒకరిని ఒకరు చూసుకుంటూ మన ఇంట్లో ఈ కోడిపుంజు ఎక్కడినుండి వచ్చింది అంటూ ఆలోచిస్తాయి, అప్పుడు యాదగిరి భార్య మరియు యాదగిరి ఇద్దరు కలిసి కోడిపుంజు ని తినడానికి జీడిపప్పు బాదంపప్పు ఇంకా మంచి మంచి ఆహారము పెడుతుంటారు, ఇది చూసి ఒక ఎద్దు ఇంకో ఎద్దుతో
మనము ప్రతి రోజు ఎండలో కష్టపడితే మనకు ఒక్క రోజు కూడా తినడానికి ఇలాంటి ఆహారము పెట్టలేదు, ఈ రోజు వచ్చిన కోడిపుంజు కోసం ఎంత మంచి మంచి ఆహారము పెడ్తున్నారు వీళ్లు అని అంటుంది, ఇది విని ఇంకో ఎద్దు నువ్వు బాధ పడకు మనము ఎప్పుడు నుండో యాదగిరి దగ్గర పని చేస్తున్నాము, ఈ కోడిపుంజు ఈ రోజు వచ్చింది రేపు వెళ్ళిపోతుంది అని అంటుంది, కానీ ఆ ఎద్దు మాత్రం లోలోపలే బాధ పడుతూవుంటుంది ప్రతి రోజు లాగే యాదగిరి తన ఎద్దులను తనతో పాటు
పొలానికి తీసుకెళ్తాడు, పాపం రెండు ఎద్దులు ఆ రోజు కూడా పొద్దంతా ఎండలో బాగా కష్టపడతాయి సాయంత్రము ఇంటికి వస్తాయి, అదే రోజు రాత్రి యాదగిరి ఇంటికి చుట్టాలు వస్తారు వాళ్ళను చూసి యాదగిరి మరియు అతని భార్య చాల సంతోషపడతారు, అందరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు యాదగిరి వాళ్లతో చాలా రోజులకు మా ఇంటికి వచ్చారు కోసం ఏమి వండి పెట్టమంటారు అని అంటాడు, అప్పుడు వాళ్ళు కోడిపుంజు ని చూసి యాదగిరి గారు ఈ కోడిపుంజు ని వండి పెట్టండి అని
అంటారు, యాదగిరి వెంటనే వెళ్లి కోడిపుంజు ని కోసి కోడి కూర చేసి వాళ్లకు పెడ్తాడు, ఇది చూసి ఎద్దు ఇంకో ఎద్దుతో నువ్వు చెప్పింది నిజమే మద్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు అని అంటుంది.
Moral Of The Story : ఈ కథ ద్వారా మనము నేర్చుకున్న నీతి ఏమిటంటే, చుట్టరికం కొన్నాళ్లే, పాత పరిచేయమే శాశ్వతంగా ఉండిపోతుంది
Also Read These Moral Stories : Top Best Telugu Moral Stories
Top 3 Best Moral Stories In Telugu
Top 4 Best Moral Stories In Telugu
Best 4 Moral Stories In Telugu